The onion home remedies to remove dandruff problems

onion home remedies, the onion home remedies for dandruff, dandruff problems, dandruff issues, lemon juice health tips, beauty tips, beauty problems, beauty tips for dandruff issues

the onion home remedies to remove dandruff problems

చుండ్రును నివారించే ఆనియన్ హెయిర్ ప్యాక్స్

Posted: 11/13/2014 05:19 PM IST
The onion home remedies to remove dandruff problems

టీనేజ్ నుంచి పెద్దవయస్కుల వారందరికీ నిత్యం బాధిస్తున్న సమస్య ‘‘చుండ్రు’’, ఈ సమస్య తెలియకుండానే ప్రతిఒక్కరిని వస్తుంది. మొదటి దశలో వున్నప్పుడే దీనిని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేకానీ.. ముదిరిపోతే మాత్రం జుట్టు రాలిపోవడం ఖాయం. పైగా తలపైభాగం కూడా వికారంగా మారిపోతుంది. కాబట్టి.. చుండ్రు సమస్యను ఎంతవరకు వీలైతే అంత త్వరగా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. చుండ్రు సమస్యను నివారించుకోవడానికి మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు వున్నాయి కానీ.. అవి శాశ్వతంగా తొలగించవు. అలాకాకుండా శాశ్వతంగా చుండ్రు సమస్య నుంచి బయటపడాలంటే అందుకు ఆనియన్ ట్రీట్ మెంట్ చాలా బెస్ట్. ఉల్లిపాయలో వుండే పోషకాలు చుండ్రు సమస్యను తగ్గించి.. జుట్టును సంరక్షిస్తుంది. అయితే నేరుగా ఆనియన్ కాకుండా అందులో కొన్ని ఇతర పదర్థాలతో కలిపి రెమెడీస్ తయారుచేసుకొని పట్టించుకోవాలి. మరెలా తయారుచేస్తారో తెలుసుకుందాం...

1. ఉల్లిపాయ రసం : ఇందులో ఆర్ధోడాక్స్ అనే పదార్ధం వుంటుంది. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. అలాగే తలలో వున్న బ్యాక్టీరియాను నివారించి.. తెల్లగా రాలే పొట్టు సమస్య నుంచి దూరంగా వుంచుతుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయను కట్ చేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. తలకు పట్టించి 30నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

2. మెంతులు : మెంతులను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

3. అలోవెర : కలబంద రసానికి కొద్ది ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వల్ల తలను చాలా కూల్ గా చేస్తుంది. దురదను నివారిస్తుంది.

4. బీట్ రూట్ : దుంపలను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి వేళ్ళతో బాగా మసాజ్ చేయాలి.

5. నిమ్మరసం : ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించుకోవాలి. ఇలా చేస్తే తలలో దుర్వాసన నివారించబడుతుంది. తలలో దురద దూరమవుతుంది.

6. తేనె : ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించుకోవాలి. అనంతరం 10నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

7. కొబ్బరి నూనె : ఒక చెంచా నిమ్మరసం, 5చెంచాల కొబ్బరినూనె, 3చెంచాల ఉల్లిపాయరసం తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

8. గుడ్డు : 1 లేదా 2 గుడ్లను తీసుకొని, అందులో కొద్దిగా నిమ్మ, ఉల్లిపాయ రసాలు మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

9. ఆపిల్ జ్యూస్ : రెండు చెంచాల ఆపిల్ జ్యుస్ లో 2చెంచాల ఉల్లిపాయ రసం మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

10. వెనిగర్ : ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. అది చుండ్రును నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తర్వాత తలకు మసాజ్ చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dandruff problems  onion home remedies  beauty tips  health tips  hair problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more