The healthy home remedies for yellow teeth to change into white

home remedies for yellow teeth, yellow teeth home remedies, beauty tipf for yellow teeth, yellow teeth tips, yellow teeth tips, tips to reduce yellow content on teeth, beauty tips, beauty tips for hairs, beauty tips for skin, beauty tips for face, beauty tips for teeth

the healthy home remedies for yellow teeth to change into white

పసుపు దంతాలను తెల్లగా మార్చే రెమెడీస్

Posted: 11/14/2014 05:56 PM IST
The healthy home remedies for yellow teeth to change into white

పసుపు దంతాలు.. ఇవి ప్రతిఒక్కరికీ పట్టిపీడించే సమస్య! నలుగురిలో ఎంత అందంగా కనిపించినా... పసుపు దంతాలు వుంటే మాత్రం మనస్ఫూర్తిగా నవ్వలేం. ఏ విధంగా అయితే అందాన్ని ప్రాధాన్యత ఇస్తారో.. అదేవిధంగా దంతాలను తెల్లగా మార్చడంలో ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి! పసుపు దంతాలు వుంటే సరిగ్గా మాట్లాడటానికి కూడా వీలుకుదరదు. కాబట్టి.. అటువంటి దంతాలను నివారించుకోవాలంటే ప్రతిరోజూ పళ్లను శుభ్రం చేసుకోవాలి. కొంతమంది రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల తెల్లగా కనిపిస్తాయి.. కానీ మరికొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు.. చూడ్డానికి ఓ మోస్తరు తెల్లగానే వున్నా.. పగుళ్ల దగ్గరలో పసుపచ్చ రంగు క్లియర్ గా కనిపిస్తుంది. అటువంటి రంగును కూడా పూర్తిగా నిర్మూలించాలంటే ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ద్వారా దూరం చేయొచ్చు. అందులో ముఖ్యంగా తులసి బాగా పనిచేస్తుంది. ఈ తులసిని వివిధరకాల రెమెడీస్ లో కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటేమంచి ఫలితం పొందుతారు. మరి తులసీ మిశ్రమంతో ఆ రెమెడీస్ ఏమిటి..? ఎలా తయారుచేస్తారో..? తెలుసుకుందాం...

1. బాసిల్ టూత్ పౌడర్ : తాజాగా ఉండి తులసి ఆకులను తీసుకొని, నీడలో బాగా ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత, ఆ ఆకులను మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి ప్రతిరోజూ బ్రష్ చేస్తే.. పసుపు దంతాలను నిర్మూలించుకోవచ్చు.

2. బానియన్ ట్రీ (ఫిక్కస్ రిలిజియోస) : ఈ చెట్టులోని వేరులో ఒక నేచురల్ ఆస్ట్రింజెంట్ వుంటుంది. ఆ వేరును తీసుకుని ప్రతిరోజూ బ్రష్ లా చేసుకుంటే.. అది దంతాలను ముత్యాల్లా మెరిపిస్తుంది. ఇది చెట్టు పై బాగంలో వేల్రాడుతూ పెరుగుతుంది.

3. వేప లేదా మార్గోస(అజార్డిరచ్తా ఇండిక) : వేపపుల్లలో ఆస్ట్రిజెంట్స్ తోపాటు యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా పుష్కలంగా వుంటాయి. ఈ పుల్లలతో బ్రష్ చేసుకుంటే దంతాలను శుభ్రపరచడంతో పాటు చెడు శ్వాసను, దంతక్షయాన్ని నివారిస్తుంది.

4. బేకింగ్ సోడా రెమెడీ : బేకింగ్ సోడాలో సానపెట్టే స్వభావం కలిగి ఉంటుంది. ఇది మీ దంతాల ఎనామిల్ ను తగ్గించేయవచ్చు. అయితే, బేకింగ్ సోడాలోని ఈ సానపెట్టే గుణం దంతాల మీద పడ్డ మొండి మరకలను తొలగించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో పాటు నిమ్మరసం ఉపయోగించినట్లైతే, దంతాల్లోన్ని క్యాల్షియంను బ్లాక్ చేసి దంతాలను తెల్లగా మార్చుతుంది. అయితే జాగ్రత్తగా వాడాలి.

5. విటమిన్ సి ఎక్కువగా వుండే పళ్లు, కూరగాయలు :స్ట్రాబెర్రీస్, టమోటో, ఆమ్లా, ఆరెంజ్, నిమ్మకాయ వంటివాటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. స్ట్రాబెర్రీని రెండు ముక్కలుగా కట్ చేసి, అందులో సగం తీసుకొని, దాని మీద బేకింగ్ సోడాను చిలకరించి, దాంతో దంతాల మీద బాగా రుద్దాలి. స్ట్రాబెర్రీలో ఉండే మాలిక్ యాసిడ్, అందులోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు, స్వచ్చమైన దంతాలను అందిస్తాయి.

6. ఆరెంజ్ తొక్క : రాత్రి నిద్రపోవడానికి ముందు ఆరెంజ్ తొక్కను తీసుకుని.. దంతాలను బాగా రుద్దుకోవాలి. అనంతరం నీటితో పొక్కిలించుకుని నిద్రపోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  yellow teeth solutions  yellow teeth home remedies  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more