The beauty home remedies for skin which improve the glow and shine

beauty home remedies, beauty tips, beauty tips in telugu, beauty tips skin, home remedies for skin, shiny glow skin, orange home remedies, honey home remedies, healthy food for beauty

the beauty home remedies for skin which improve the glow and shine

తెల్ల చర్మానికి ఇంటి చిట్కాలు...

Posted: 11/12/2014 05:41 PM IST
The beauty home remedies for skin which improve the glow and shine

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి కావలసిన క్రీములు, ఇతర రసాయన పదార్థాలు అందబాటులో వుంటాయి కానీ.. అవి చర్మానికి కావలసిన పోషకాలను అందించవు. ఫలితంగా చర్మం కేవలం కృత్రిమ అందాన్ని పొందుతుందే తప్ప.. సహజత్వంతో కూడిన అందాన్ని పొందదు. దీంతో చర్మం పొడిగా, బిగుతుగా మారిపోవడంతోపాటు మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోతాయి. అలాకాకుండా సహజత్వంతో కూడిన అందాన్ని సొంతం చేసుకోవాలంటే.. పోషక విలువలతో నిండిన కొన్ని పదార్థాలతో ఇంట్లోనే రెమెడీస్ తయారుచేసుకుని అప్లై చేసుకుంటే చాలు! కాంతివంతమైన అందంతోపాటు సహజత్వాన్ని పొందవచ్చు. మరి.. ఆ హోమ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

1. ఎండబెట్టిన ఆరెంజ్ తొక్క - పెరుగు మిశ్రమం : ముందుగా ఆరేంజ్ తొక్కలను ఎండలో ఎండబెట్టి... వాటిని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిన ఒక డబ్బాలో నిల్వ చేయాలి. అందులో నుంచి ఒక పొడిని ఒక గిన్నెలో తీసుకుని అందులో పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మీద మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి.

2. కొబ్బరి నూనె : శరీరం మీద మచ్చలు వున్న భాగాలపై ప్రతిరోజూ కొబ్బరి నూనె రాసుకుంటే మంచిది. అలాగే ముఖం మీద కూడా రాసుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే.. మంచి ఫలితం దక్కుతుంది.

3. పాలు-తేనె-నిమ్మరసం : ఒక స్పూన్ పాలు, తేనె, నిమ్మరసం తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మీద మచ్చలు తొలిగి, మృదువుగా మారుతుంది.

4. హనీ-బాదం మాస్క్ : తేనె, బాదం రెండు కలుపుకుని ఒక పేస్ట్ తయారుచేసుకోవాలి. దీనిని చర్మానికి పట్టించి మంచి ఫలితం లభిస్తుంది. ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ పాల పొడి, అర స్పూన్ బాదం పొడి లేదా ఆయిల్ లను బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

5. టమోటా-శనగపిండి మాస్క్ : రెండు స్పూన్స్ శనగపిండిలో రెండు-మూడు స్పూన్స్ నిమ్మరసం, టమోటా రసం కలిపి ముఖానికి పట్టించించుకోవాలి. 20 నిముషాలు అయిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే చర్మం తెల్లబడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  skin home remedies  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more