Dangerous Places For Women In India Where Crimes Are Raising On Them | India Crime News

Dangerous places for women in india where crimes are raising on them

danger places for women, women danger places, india danger places, india crime places, women crimes, india rape cases, crime cities india, india crime cities

Dangerous Places For Women In India Where Crimes Are Raising On Them : Dangerous Places For Women In India Where Crimes Are Raising On Them.

భారత్ లో మహిళలకు సురక్షితంలేని ప్రదేశాలు ఇవే!!

Posted: 10/14/2015 06:30 PM IST
Dangerous places for women in india where crimes are raising on them

సాంకేతిక రంగంలో ప్రపంచదేశాలతో పోరాడుతూ ముందుకు దూసుకుపోతున్న భారతదేశంలో మహిళలకు మాత్రం ఇప్పటికీ సురక్షితం లేదు. ఒకప్పుడు గాంధీ చెప్పిన మాటలు (ఆడవారు అర్థరాత్రి తిరిగితేనే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం) ఇప్పుడు పూర్తి రివర్స్ లో జరుగుతున్నాయి. ఆడవారు రాత్రివేళ కాదు కదా.. కనీసం పగతిపూటలో తిరిగేందుకు భయపడుతున్న దుస్థితి ఏర్పడింది. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఒక వ్యాసంలో.. భారతదేశంలో మహిళ ఒక ఘోరమైన స్థానంలో ఉందని తెలిపింది.  అంతెందుకు.. ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన మొదటి ఐదుదేశాల్లో భారతదేశం కూడా వుందంటే.. వారిపై అఘాయిత్యాలు ఎంతమేర జరుగుతుందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని ముఖ్యనగరాల్లో మహిళలపై తరచూ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రదేశాలేమిటంటే..

* ఢిల్లీ : దేశ రాజధాని ‘ఢిల్లీ’ నగరంలో మహిళలకు సురక్షితం కానీ మొదటి ప్రదేశంగా గుర్తింపు పొందింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. ఇప్పటికి మొత్తం రేప్ కేసులు 23.8 శాతం అని నివేదించారు.
* కోలకతా : ఈ నగరంలో మహిళలపై ఈవ్ - టీజింగ్, వేధింపులు, అత్యాచారం, అనేక సంఖ్యలో నేరాలు జరుగుతున్నాయని క్రైమ్ రికార్డ్స్ లెక్కలు తేల్చి చెప్పాయి.
* బెంగుళూర్ : ‘ఎలక్ట్రానిక్ నగరం’గా పేరుగాంచిన ఈ నగరం దక్షిణ భారతదేశంలో ‘నేరాల రాజధాని’గా మారింది. డ్రగ్స్, అత్యాచారాలు కారణంగా రాత్రివేళ్లలో పనిచేసే మహిళలకు ఈ నగరం సురక్షితం కాదు.
* గుర్గావ్ : ఇక్కడ రేప్ కేసులు, నేరాలు ఎక్కువగా ఉండుట వలన మహిళలు సందర్శించటానికి సురక్షితం కానీ ప్రదేశాలలో ఒకటిగా ఉంది.
* ముంబై : దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై ఒకప్పుడు మహిళలకు సురక్షితమైన ప్రదేశంగా పేరుగాంచింది కానీ.. ఇప్పుడు కాదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రేప్ కేసులు 10.8 శాతం ముంబైలోనే జరుగుతున్నాయి.
* హైదరాబాద్ : 2011లో హైదరాబాద్ లో వేధింపుల కేసులు 157గా నమోదు అయ్యాయి. భారతదేశంలో ఈ ప్రదేశం మహిళలకు సురక్షితం కాదు. ఈ నగరంలో రేప్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి.
* పూణె : మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరమైన పూణెలో  ప్రజారవాణా వ్యవస్థ అంతగా బాగోలేదు. మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలకు చెకోవాలంటే కష్టపడక తప్పదు.
* ఉత్తర ప్రదేశ్ : ఈ రాష్ట్రంలో 11.9 శాతం మహిళలు హింసాత్మక నేరాలకు గురౌతున్నారు. మహిళల మీద ఎటువంటి దాడి అయిన చేయవచ్చు. ఇక్కడ మహిళల భద్రత మరింత సందేహాస్పదంగా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india crime cities  women danger places  

Other Articles