The History Of Sangameswara Temple Which Is Located In Kurnool District Where 7 Rivers Meet Up | Lord Shiva Temples | Telugu Mythological Stories

Kurnool sangameswara temple history 7 rivers alignment place lord shiva mythological stories

Kurnool Sangameswara Temple, kurnool lord shiva temple, kurnool temple history, lord shiva temples, kurnool shiva temple history, 7 rivers meet up temple, telugu mythological stories

Kurnool Sangameswara Temple History 7 Rivers Alignment Place Lord Shiva Mythological Stories : The History Of Sangameswara Temple Which Is Located In Kurnool District Where 7 Rivers Meet Up.

సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

Posted: 10/07/2015 06:27 PM IST
Kurnool sangameswara temple history 7 rivers alignment place lord shiva mythological stories

అది వేలసంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన ప్రదేశం.. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శైవాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి వుంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది... సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

స్థలపురాణం :

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణ గాధ. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. మరొక కథనం ఏమిటంటే.. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు.. ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో.. రుషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు.. తీవ్ర ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆలయ విశేషాలు :

* ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతోపాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

* ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం.

* ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles