OMKARAM the sacred sound OM first originated place తొలిసారిగా ఓంకారం ధ్వనించిన ఫుణ్యధామం ఓంకారం

Omkaram the sacred sound om first originated place

Omkaram temple, omkara kshetram, omkara kshetram history, omkara kshetram importance, omkara kshetram lord sri rama, omkara kshetram pandavas, omkara kshetram nanda rajas, omkara kshetram vyasa maharshi, omkara kshetram shivalingam, omkara kshetram jagathjanani, omkara kshetram srikrishna devaraya, omkara kshetram saptarushis, omkara kshetram impotance, omkara kshetram bandi atmakur

In Omkaram this temple is ancient temple and also popular in Andhrapradesh. According to the legends the seven Rushis called Saptarushi’s and many siddhas were performed penance here. By the puranas vyasa Maharshi was installed the Shivalinga in this temple.

తొలిసారిగా ‘ఓంకారం’ ధ్వనించిన అభయారణ్య ఫుణ్యధామం

Posted: 01/19/2019 03:14 PM IST
Omkaram the sacred sound om first originated place

ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే ప్రాంతంలో వాతావరణం ఎలా వుంటుంది.? అసలు ఆ ప్రాంతం జనవాసాలకు ఆమోదయోగ్యమా.? ఓంకార నాదం ధ్వనించిన క్రమంలో అక్కడ ఎవరు ఉండేవారు.? ఓంకార ధ్వని ఎలా తగ్గిపోయింది.? ఇలాంటి ప్రశ్నలు మీలో ఉద్భవిస్తున్నాయా.?

కర్నూలు జిల్లా బండిఅత్మకూరు మండలంలోని శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరు ఓంకారక్షేత్రం. ఈ ఆలయంలో కూడా కాశీనాయన ఆశ్రమం తరపున నిత్యాన్నదాన సమారాధన జరుగుతుంది. ఓంకార స్వరూపుడైన సదాశివుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి.యుగాల నాటి పౌరాణిక విశేషాలు , శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం.

శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. స్వచ్చమైన గాలి, పచ్చని ప్రకృతి, మొక్కిన వారిని దరి చేర్చుకొని, కొంగుబంగారంగా నిలిచే పరమేశ్వరుని సన్నిధి, భక్తులను భక్తిపారవశ్యంలో నింపుతుంది. ఇక ఇక్కడి వాతావరణంలో ఈ ఆశ్రమంలో ఒక రాత్రి నిద్రించిన వారికి అనేక శరీర, మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇక్కడి అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం, ఏ సమయంలో వచ్చిన వారికైనా నిత్యం అన్నదానం చేస్తూంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం.

Omkara Kshetram Photos(Image Source: myindia-heritage.blogspot.com)

పురాణ ఐతిహ్యం.!

సృష్టి ఆరంభంలో బ్రమ్హ్మ  దేవుడు, శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు వారిరువురి మధ్యన ఓంకార నాదంతో లింగా కారంలో ఉన్న అగ్ని ఉద్భవించినది. అది ఎవరా ? అన్న ఆశ్చర్యానికి లోనైనా వారికి "మీ ఇరువురలో ఎవరైతే నా అది అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప " అన్న మాటలు వినిపించాయి.

బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా, మహా విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళం లోనికి వెళ్ళారు. ఎంతో దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొన లేక పోయారు. శ్రీహరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని విధాత మాత్రం తాను లింగ అగ్ర భాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపారు.

అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించారని, వంత  పాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు. ఈ సంఘటన జరిగిన క్రమంలో.. తొలిసారి ఓంకార నాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి "ఓంకారం" అన్న పేరోచ్చినదని భక్తుల నమ్మకం. కాగా, ఈ ఓంకార శబ్దం పెద్దగా వినిపిస్తూ స్థానికంగా ధాన్య, జపాలు చేసుకునే సాధువులకు కూడా ఇబ్బందిగా పరిణమించింది.

ఈ విషయాన్ని అమ్మవారి ఉపాసకులు ఏకంగా అమ్మకు నివేదించుకున్నారు. దీంతో అమ్మవారు కూడా ఇక్కడకు వచ్చి ఓంకారక్షేత్రంలోని ఆలయానికి కుంకుమ బోట్టు పెట్టారని అప్పటి నుంచి ఓంకార శబ్దం పెద్దగా వినిపించడం తగ్గిపోయిందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఏ భక్తులైయితే ఇక్కడకు వచ్చి దేవదేవుడని భక్తితో కొలిచి.. ఆలయంలో ఒక రోజు రాత్రి నిద్రచేస్తారో వారికి ఓంకార శబ్దం వినిపిస్తుందని కూడా భక్తులు చెబుతున్నారు. అలాంటి ఓంకార శబ్దం కాశీనాయనకు వినిపించదని కూడా భక్తులు చెబుతుంటారు.

ఆలయ విశేషాలు :

మూడుపక్కలా పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతిలో అహ్లాదకరంగా వుండే ప్రదేశంలో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. 6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరగిందని చరిత్ర చెబుతున్నా.. తొలిసారిగా ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయం ఇదుమిద్దంగా తెలియదు. అయితే ఎందరో రాజవంశీయులు ఈ క్షేత్రాన్ని సందర్సించారని తెలుస్తోంది. స్థానిక నంద వంశ రాజులు ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని తెలుస్తోంది.

ఈ అలయంలో సప్తరుషులు, ఎందరో సిద్దాంతులు కూడా దర్శించారని తెలుస్తుంది. మహర్షి వ్యాసుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. శ్రీరాముడితో పాటు పంచపాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీస్సులను పోందారని పురాణాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఇక్కడ కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తుంటారు. ఆ పక్కనే వున్న ఆమ్మవారి ఆలయదర్శనం చేసుకుని అశీర్వచనాలు పోందుతారు.

Omkara Kshetram Photos(Image Source: myindia-heritage.blogspot.com)

విజయనగర సామ్రాజ్యాదీశుడైన శ్రీకృష్ణ దేవరాయల వారి గురువైన శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంత కాలమిక్కడే ఉన్నారని అంటారు. దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. అపర ఆంజనేయ భక్తులైన వ్యాసరాయలు తమ నిత్య పూజకై అంజనా సుతుని ప్రతిష్టించారు. ఈ ప్రాంతాలలో పేరొందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరి ప్రతిస్టే అని ఆధారాల ద్వారా అవగతమవుతోంది.  

అదే వృక్షం క్రింద విఘ్ననాయకుని విగ్రహం, ఎన్నో నాగ ప్రతిష్టలు ఉంటాయి. మూడు కొండల నడుమ సుందర ప్రకృతిలో సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయంలోనికి వెళ్ళడానికి తూర్పున, దక్షిణాన ద్వారాలున్నాయి. రాతి మండపాలను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూతి కుంకుమ లెపనాలతొ సదాశివుడు లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు.

ప్రక్కనే అమ్మవారి సన్నిధి ఉంటుంది. ప్రతినిత్యం ఎన్నో అబిషేకాలు, అర్చనలు, పూజలు, అలంకరణలు ప్రధాన అర్చనా మూర్తులకు జరుగుతాయి. వినాయక చవితి, శివరాత్రి, దేవి నవరాత్రులు, కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ శనేశ్వర స్వామీ తపో వనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహా మూర్తులను ఉంచారు. ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతుంటారు.

Omkara Kshetram Photos(Image Source: myindia-heritage.blogspot.com)

ఈ పురాణ ప్రసిద్ద స్థలం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. నంద్యాల నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. నంద్యాల చుట్టుప్రక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఓంకారం. ఇక ఇక్కడకు వచ్చే భక్తులకు ఆకలి బాధ తెలియకుండా చేస్తుంది అవధూత శ్రీ కాశి నాయన ఆశ్రమం. ఓంకార క్షేత్ర సందర్శనార్ధం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం లభిస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : omkara kshetram  history  vedas  puranas  vyasa maharshi  Bandi atmakur  kurnool  Andhra Pradesh  

Other Articles