The Historical Story Of Dorabavi Viaduct Which Is Made By British Govt | Indian Historical Builts | Indian Railway Bridges

Dorabavi viaduct historical story british government indian wonder builts

Dorabavi Viaduct, Dorabavi Viaduct historical Story, Dorabavi Viaduct photos, Dorabavi Viaduct updates, Dorabavi Viaduct history, Dorabavi Viaduct special story, british government, british government constructions

Dorabavi Viaduct Historical Story British Government Indian Wonder Builts : The Historical Story Of Dorabavi Viaduct Which Is Made By British Govt For Exports And Imports.

మానవ నిర్మితమైన చారిత్రాత్మక దొరబావి వంతెన

Posted: 10/16/2015 06:06 PM IST
Dorabavi viaduct historical story british government indian wonder builts

దేశంలో కొలువైన చారిత్రాత్మక నిర్మాణాల్లో దొరబావి వంతెన ఒకటి. సరుకు రావాణా కోసం ఆంగ్లేయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించారు. నల్లమల అడవుల్లో నిర్మించబడిన ఈ రైల్వే వంతెనను ఎలాంటి సాంకేతిక నైపుణ్యం, యంత్ర సామాగ్రి సహకారం లేకుండానే.. కూలీలు కేవలం తమ శరీర బలంతోనే భారీ ఇనుప దిమ్మెలను ఒక్కొక్కటిగా చేర్చుతూ ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు 800 మీటర్ల పొడవున్న ఈ వంతెనను కూలీలు మూడేళ్ల సమయంలో పూర్తి చేశారు.

దొరబావి వంతెన నిర్మాణం :

గోవా నుంచి మచిలీపట్నం పోర్టు వరకు సరుకు రవాణా కోసం మీటరు గేజి రైల్వే మార్గాన్ని నిర్మించాలని నాటి ఆంగ్లేయులు భావించారు. ఈ నేపథ్యంలోనే వారు ఈ మార్గంపై 1842లో సర్వే ప్రారంభించారు. సర్వే పూర్తయ్యాక గోవా నుంచి రైల్వే మార్గాన్ని గుంతకల్లు వరకు 1867 నాటికి పూర్తి చేశారు. అయితే.. ఈ మార్గంలో వున్న నల్లమల అడవుల్లోని లోయలను కలుపుతూ రైల్వే వంతెన నిర్మించాలని తలపెట్టారు. ఇందుకోసం 1967లో నల్లమల అడవిలోని చలమ, బొగద రైల్వేస్టేషన్ల సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 2,600 అడుగుల ఎత్తున రైల్వే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ వంతెన నిర్మాణం కోసం సుమారు 420 టన్నుల ఇనుమును వినియోగించారు.

Dorabavi-Viaduct-01
Dorabavi-Viaduct-02
Dorabavi-Viaduct-03
Dorabavi-Viaduct-04
Dorabavi-Viaduct-05
Dorabavi-Viaduct-06

బిట్రన్‌లోని బర్మింగ్‌హామ్ ఉక్కు కర్మాగారం నుంచి ఉక్కు సేకరించి, లండన్‌లో డిజైన్ చేసి, అక్కడే వంతెన విడిభాగాలను నిర్మించి వాటిని సముద్రమార్గం గుండా 1883 నాటికి మచిలీపట్నం చేర్చారు. ఈ సామాగ్రిని 1884వ సంవత్సరం ప్రారంభంలో లోయలకు సమీపంలో రైలు నుంచి కిందికి చేర్చి నిర్మాణపనులు ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక నైపుణ్యం, యంత్ర సామాగ్రి సహాయం లేకుండా కేవలం కూలీలు తమ శరీర బలంతోనే భారీ ఇనుప దూలాలను వంతెన దిమ్మెలపైకి ఒక్కోటిగా చేర్చారు. వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు అక్కడే నివాసం ఉండేలా ఆంగ్లేయులు ఏర్పాట్లు చేయించారు. వారి కోసం నాటి మదరాసు గవర్నర్ ప్రత్యేకంగా ఒక బావిని తవ్వించి తాగునీటి వసతి కల్పించారు. నాటి పాలకులను దొరలని పిలుచుకునే అలవాటున్న కూలీలు బావిని దొరబావిగా, రైల్వే వంతెన స్థలాన్ని దొరబావి వంతెనగా పిలుచుకోవడంతో కాలక్రమంలో అదే పేరు స్థిరపడింది. సుమారు 800 మీటర్ల పొడవున్న వంతెన నిర్మించడానికి కూలీలకు మూడేళ్ల సమయం పట్టింది. అన్ని హంగులు సిద్ధం చేసుకుని 1884వ సంవత్సరం ప్రారంభంలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా.. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పూర్తయి 1887 మధ్య కాలంలో మొదటి రైలును ఆ వంతెనపై పరుగులు తీయించినట్లు రైల్వే రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఎత్తైన ప్రదేశంలో నిర్మాణమైన ఈ వంతెనకు వేలాది స్ప్రింగులు వినియోగించారు. వీటి కారణంగా అడవిలో చిన్న గాలి వీచినా ఊయల మాదిరి వంతెన ఊగేది. ఇక రైలులో కూర్చున్న వారికి ఊయల ఊగినంత అనుభూతి కలిగేది. దీనిపై ప్రయాణించ డానికి జనం ఇష్టపడేవారు. అలా ప్రజలు ఎంతో అపురూపంగా అభిమానించే ఆ వంతెన సుమారు 110 సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలందించింది. అయితే 1992లో ప్రధాని అయిన దివంగత పీవీ నరసింహారావు గుంటూరు నుంచి గుంతకల్లు వరకు మీటర్‌గేజిని బ్రాడ్‌గేజీగా మార్పు చేయాలని ఆదేశించడంతో దొరబావి వంతెన సమీపంలోనే మరో మార్గం గుండా నూతన రైలు మార్గాన్ని నిర్మించారు. దాంతో నిరుపయోగంగా ఉన్న దొరబావి వంతెనను కూల్చివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీన్ని ప్రజలు.. వ్యతిరేకించినా కేవలం రూ.4 లక్షలకు వంతెన కోసం వినియోగించిన ఉక్కును విక్రయించారు. ఫలితంగా వంతెనను కూల్చి వ్యాపారులు ఉక్కును తరలించుకుపోవడంతో వంతెన కోసం లోయ లోపలి నుంచి నిర్మించిన దిమ్మెలు నాటి చారిత్రాత్మక వంతెనకు సాక్ష్యంగా నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dorabavi Viaduct History  Indian Railway Bridges  

Other Articles