The Historical Story Of Saraswathi Devi Temple Which Is Located At Basara | Hindu Temples | Valmiki Maharshi

Basara saraswathi devi temple history valmiki maharshi hindu temples

basara saraswathi temple, basara saraswati devi temple, basara temple history, saraswati devi temples, hindu temples, temples in india, india temples list, basara temple history, saraswati temple history,

Basara Saraswathi Devi Temple History Valmiki Maharshi Hindu Temples : The Historical Story Of Saraswathi Devi Temple Which Is Located At Basara. According To The Mythological Stories Valmiki Has Developed This Temple.

వాల్మీకి మహర్షి ప్రతిష్టించిన సరస్వతీ దేవి ఆలయం

Posted: 08/12/2015 06:32 PM IST
Basara saraswathi devi temple history valmiki maharshi hindu temples

హైందవ ఆధ్యాత్మిక జగత్తులో విధాత అర్థాంగిగా విశిష్ఠస్ధానం కలిగిన సరస్వతీదేవికి దేశంలో కేవలం రెండు ఆలయాలే వున్నాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశంలోని కాశ్మీరంలో ఉన్న ‘శరణాలయం’ కాగా.. రెండోది తెలంగాణా రాష్టంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసర’ గ్రామంలో వుంది. చదువుల తల్లిగా పిలువబడే ఈమె అనుగ్రహం ప్రతిఒక్కరి మీద వుంటే సుఖసంతోషాలతో జీవితాన్ని గడుపుతారని భక్తుల విశ్వాసం. అంతేకాదు.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి అక్షరాభ్యాసాన్ని బాసరలోని సరస్వతీదేవి ఆలయంలోనే జరిపిస్తారు.

ఆలయ చరిత్ర : బాసరలో వున్న సరస్వతీదేవి ఆలయం అతి పురాతనమైనది. ఆదికవి వాల్మీకిమహర్షి బాసరలో సరస్వతీదేవి ప్రతిష్ఠ చేసాడనీ., ఇక్కడే శ్రీమద్రామాయణాన్ని కూడా రచించాడనీ ‘బ్రహ్మాండ పురాణం’లో ఉన్నట్లు పెద్దలు చెప్తారు. ఈ ఆలయం క్రీ.శ.4వ శతాబ్దికి పూర్వం నుంచీ వుందని.. ఈ క్షేత్రం రాష్ట్రకూటుల కాలంనాటిదనీ ఈ ఆలయం దగ్గర లభించిన శిలాశాసనాలు ఆధారంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతో విశిష్ట చరిత్రను కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు నిత్యం భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఆలయం కారణంగా బాసరలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు.

ఆలయ విశేషాలు : బాసరలో వున్న సరస్వతీదేవి ఆలయం సమచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయానికి దక్షిణభాగాన కోనేరు ఉంది. దీనిని ‘గుండం’ అని పిలుస్తారు. దానికి ప్రక్కగా ఒక సమాధి ఉంది. దానిని ‘వాల్మీకి సమాధి’ అని అర్చకులు భక్తులకు పరిచయం చేస్తారు. శివరాత్రి మొదలు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : basara temple  saraswati temple history  hindu temples india  

Other Articles