The Special Story Of Rock Garden of Chandigarh | Famous Tourist Spots | India Beautiful Places

Rock garden chandigarh famous tourist spots india beautiful places

rock garden, chandigarh rock garden, rock garden specialities, india tourist spots, best tourist locations of india, india beautiful places, rock garden photos, rock garden, chandigarh tourist spots, chandigarh tourism

Rock Garden Chandigarh Famous Tourist Spots India Beautiful Places : The Rock Garden of Chandigarh is a sculpture garden in Chandigarh, India. Its founder Nek Chand, a government official who started the garden secretly in his spare time in 1957.

‘రాక్ గార్డెన్’.. అద్భుత చాతుర్యానికి పెట్టిన పేరు

Posted: 08/11/2015 06:05 PM IST
Rock garden chandigarh famous tourist spots india beautiful places

మానవుడు సృష్టించిన అద్భుతమైన సృష్టిలో ‘రాక్ గార్డెన్’ ఒకటి.  చండీగఢ్‌లో సుఖ్‌నా సరస్సుకు దగ్గరలో వున్న రాతి ఉద్యానవనంలో అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేసే చెత్త, వ్యర్థాలతో తయారైన విగ్రహాలు వున్నాయి. పట్టణంలో పనికిరాని వస్తువులు, విరిగిన సిరామిక్ రాళ్ల ఆధారంగా నృత్యభంగిమల్లో శిల్పాలు, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలు తయారుచేయబడి వున్నాయి. ఈ విధంగా ప్రత్యేక విగ్రహాలు కలిగిన ఈ పార్క్ దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తించబడుతోంది.

విశేషాలు :

చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న ‘నెక్ చంద్’ అనే వ్యక్తి ఈ వినూత్న గార్డెన్ ని సృష్టించాడు. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఇది ప్రస్తుతం సుమారు నలభై ఎకరాలకు విస్తరించింది. వాస్తవానికి అప్పటి ప్రభుత్వం ఈ గార్డెన్ ఏర్పాటుపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఇతను పట్టువదలకుండా 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిల్ పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో ఎన్నోరకాల శిల్పాలను ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పని చేశారు.

Rock-Garden-01
Rock-Garden-02
Rock-Garden-03
Rock-Garden-04
Rock-Garden-05
Rock-Garden-06
Rock-Garden-07
Rock-Garden-08
Rock-Garden-09
Rock-Garden-10

అలా 18 ఏళ్లు శ్రమించిన అనంతరం ఈ గార్డెన్ 1975లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం.. నెక్ చంద్ శ్రమను గుర్తించి, అందులోని విగ్రహాలను పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్ల ద్వారా తయారుచేయబడినవిగా సూచించింది. ఎన్నో ప్రత్యేకతలతో ఆ గార్డెన్ రూపుదిద్దుకోవడంతో 1976లో ఈ పార్క్‌ను ప్రభుత్వం పబ్లిక్ ప్లేస్‌గా గుర్తించి.. ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఇందులో కృత్రిమ జలపాతాలు మరియు చెత్త,యితర వ్యర్థాలతో (గాజువస్తువులు, గాజులు, టైల్సు, సిరామిక్ కుందలు, సింకులు,విద్యుత్ వ్యర్థపదార్థాలుమొదలైనవి) చేయబడిన యితర విగ్రహాలు విస్తరింపబడి ఉన్నాయి. ఈ గార్డెన్ ఎంత అద్భుతంగా మలచబడిందంటే.. ‘ఒక్క మనిషి ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలడా?’ అని ఆశ్చర్యపోక తప్పదు. ఈ గార్డెన్ కి తరచూ 5వేల మంది సందర్శకులు విచ్చేస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rock garden  chandigarh tourist spots  india best destinations  

Other Articles