The Mythological Story Of Pandavas Secret Cave | Aranyavasam | Telugu Historical Stories

Pandavas secret cave aranyavasam mythological stories

pandavas secret cave, pandavas history, pandavas stories, mythological stories, pandavas special stories, pandavas caves, aranyavasam

Pandavas Secret Cave Aranyavasam Mythological Stories : The Mythological Story Of Pandavas Secret Cave Whey They Live In Aranyavasam.

పాండవులు నివసించిన రహస్య గృహ

Posted: 08/21/2015 07:01 PM IST
Pandavas secret cave aranyavasam mythological stories

పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు అడవుల్లో కొన్ని రహస్య ప్రాంతాల్లో బస చేశారు. అలా వారు బస చేసిన ప్రాంతాల్లో ‘పాండవుల మెట్ట’ ఒకటి. రాజమండ్రి నగరానికి సుమారు 40 కి.మీ. దూరంలో వున్న రహస్య గృహ.. ఓ ఎత్తైన కొండ మీద వుంది. ఇక్కడ పాండవులు రాళ్లను తొలిచి.. గృహాలుగా ఏర్పరుకొని తమ నివాసయోగ్యంగా మలుచుకున్నారు. అలా ఏర్పరచుకున్న గుహల్లో ఒకటి భీముడి వంటశాల కాగా, మరొకటి నివాసానికి అనుకూలంగా వుండేలా చేసుకున్నారు. ఇక్కడ పాండవులు నివసించినట్లుగా సాక్ష్యాలుగా కొన్ని చిహ్నాలు ఇప్పటికీ వున్నాయి.

భీముని పాదాలు : పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. ఆ సమయంలో భీముడు కొండ అగ్రభాగాన్ని చేరగా.. ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెబుతారు. సుమారు 15 అంగుళాల పొడవున్న భీముడి ఒక్కొక్క పాదం గుర్తు ఆ ప్రదేశంలో కనువిందు చేస్తుంది. అలాగే తన గద తాలూకు గుర్తు కూడా ఇక్కడ వుంది. మెట్ట ప్రాంతమంతా రాతితో వుండడంవలన పాద ముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాండవుల మెట్ట దర్శించే వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలే కనిపిస్తాయి.

ద్రౌపది రజస్వల చాప : వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాప వద్దకు తీసుకువచ్చి దాని పై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.

పాండవులు నివసించిన రహస్య గృహ : పాండవుల మెట్టపైనున్న గుహకు సంబంధించి అనేక కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించుటయే కాక గుహ మధ్యభాగాన గల జల ప్రాంతంలో స్నానాలు ఆచరించేవారని చెబుతారు. ఈ జల ప్రాంతం దాటి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమండ్రి చేరకునేవారని అంటారు.

నలభీమపాకాల వంటశాల : గుహకు అతి దగ్గరగా గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. దీనిని పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చెబుతారు. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని ‘గంజి వార్చే భాగము’గా వర్ణిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pandavas secret cave  pandavas stories  mythological stories  

Other Articles