The Special Story of Meramec Caverns Cave | Most Visited Caves in the World

Meramec caverns special story most visited caves gunpowder

Meramec Caverns, Meramec Caverns special story, Meramec Caverns photos, Meramec Caverns history, most visited caves in world, gunpower manufacturer, beautiful places in world, worlds best tourist places

Meramec Caverns Special Story most visited caves gunpowder : Meramec Caverns is the collective name for a 4.6-mile cavern system in the Ozarks, near Stanton, Missouri.[1] The caverns were formed from the erosion of large limestone deposits over millions of years.

‘తుపాకీ మందు’ పుట్టినిల్లైన అద్భుత మెరామిక్ గుహల విశేషాలు

Posted: 05/12/2015 06:10 PM IST
Meramec caverns special story most visited caves gunpowder

ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశాల్లో ‘మెరామిక్ జలాంతర్గత గుహలు’ కూడా ఒకటి! ఈ అద్భుతమైన గుహలు యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణము తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగంలో ఏర్పడ్డాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి విస్తారమైన సున్నపురాయి నిలువల మీద ప్రవహిస్తున్న మిస్సోరీ నది కారణంగా ఈ గుహలు రూపుదిద్దుకున్నాయి. ఈ గుహల్లో కొలంబస్‌కు పూర్వపు స్థానిక అమెరికన్ అవశేషాలు కనుగొనబడ్డాయి. ప్రస్తుతము ఇవి సెయింట్ లూయిస్ పట్టణ ప్రత్యేక పర్యటక ఆకర్షణలలో ప్రధానమైనవిగా పరిగణించబడుతాయి.

చరిత్ర :

ఈ గుహలు 400 వేల సంవత్సరాల నుండి సున్నపురాయి నిలువల కారణంగా రూపు దిద్దుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కొన్ని శతాబ్దాల ముందు కాలంలో స్థానిక అమెరికన్లు వీటిని నివాసంగా వుపయోగించుకునేవారు. ఈ గుహలను ఒక ఫ్రెంచి మైనర్ (గనుల తవ్వకందారు) 1722లో కనిపెట్టాడు. 18వ శతాబ్దములో ఈ గుహల నుండి లభించిన మూల పదార్థము గన్ పౌడర్ (తుపాకీ మందు) తయారీకి వాడబడింది.

‘సివిల్ వార్’ శకంలో యూనియన్ ఆర్మీ ఈ గుహలను సాల్ట్ పీటర్ తయారీ సంస్థకు ఉపయోగించారు. కానీ ఈ తయారీ సంస్థను కాన్‌ఫిడరేట్ గొరిల్లాల చేత కనిపెట్టబడి ధ్వంసము చేయబడింది. 1870లో ఈ గుహలను జేమ్స్, అతడి నేరాలలో భాగస్థుడైన సొదరునితో కలిసి చట్టము నుండి తలదాచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. తర్వాత వారిని ఎలాగోలా పట్టుకోవడం జరిగింది. 1933లో ఈ గుహల విస్తరణను పూర్తిగా గుర్తించారు. ఈ గుహలు 4.6 మైళ్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఈ గుహలు 1935 వ సంవత్సరము నుండి పర్యటకులకు ఆకర్షణగా తెరువబడ్డాయి. 1960లో మెరామిక్ కేవర్న్‌ లో ప్రకటన ఫలకాలు చోటు చేసుకున్నాయి.

గుహల లోపలి సందర్శన :

ఈ గుహల్లో ప్రవేశించగానే ముందుగా వీటిని తమ రహస్య స్థావరంగా ఉపయోగించిన జెస్, జేమ్స్ శిల్పాలు కనిపిస్తాయి. అనంతరం ఒక పెద్ద దర్బారు వంటి ప్రదేశంలో లోలకంలా ఒక తాడు పైకప్పు నుండి వేలాడుతూ ఉంటుంది. దానిని ఆ గుహలను ఉపయోగించిన వారు దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగించుకునేవారు. ఈ గుహల లోపలికి వెళ్లేకొద్దీ గాఢ అంధకారంగా మారుతుంది కాబట్టి.. అక్కడక్కడా విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు.

ఈ గుహల లోపలికి వెళ్ళే కొద్దీ వివిధ రూపాలలో, వర్ణాలలో, పరిమాణాలలో నీటికి కరిగి రూపుదిద్దుకుని పై కప్పు నుండి కిందకు జాలు వారిన గుహల సహజ సౌందర్యము ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఈ గుహలను మొత్తంగా సందర్శించిన తర్వాత చివరగా చిన్న ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో ప్రేక్షకులు గుహల అందాలను వివిధ వర్ణాల విద్యుద్దీప కాంతిలో చూడవచ్చు. రెండు నుండి మూడు గంటల సమయములో ఈ గుహ సందర్శన పూర్తి చేయవచ్చు.

మరికొన్ని విశేషాలు :

* ఈ గుహాల్లో ‘జిప్ లైన్’ అనే సాహసిక క్రీడలలో మే నుండి అక్టోబరు వరకు నిర్వహించడం జరగుతుంది. ఈ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులు ఎత్తైన ప్రదేశము నుండి నడుముకు బెల్టు కట్టుకుని తీగ ద్వారా ప్రయాణించి నదిని దాటవచ్చు. అయితే.. ఈ క్రీడలో పాల్గొనడానికి రుసుము అధికంగా చెల్లించాల్సి వుంటుంది.
* ఈ ప్రదేశంలో లాంతర్న్ టూర్ అనే మరో ఆకర్షణీయమైన ప్రాంతం వుంది. గుహలలో ఉన్న విక్రయ శాలలో క్రిస్టల్ తో చేసిన అలంకార సామాగ్రి, సహజమైన మధ్యకు కోసిన ఆకర్షణీయమైన క్రిస్టల్ రాళ్లు, శిలాజాలు, వివిధమైన బహుమతి ప్రధానమైన వస్తువులు లభిస్తాయి.
* గుహలలో సందర్శకుల సౌకర్యార్ధం ఆల్పాహార విక్రయశాల ఉంది. ఇక్కడ దేశీయ ఆహారపదార్ధాలు, ఐస్‌క్రీమ్స్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కుక్క్డ్ కార్న్ వంటి అహారపదార్థాలు ఇతర చిరుతిండ్లు లభిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meramec Caverns  Most Visited Caves  Worlds Beautiful Places  

Other Articles