Special Story Of Sri Varala Venkateswara Swamy Temple Eduru | Small Tirupati Temple

Sri varala venkateswara swamy temple eduru special story small tirupati

sri varala venkateswara swamy temple, small tirupati, small tirupati west godavari, venkateswara temples, hindu temples india, india historical stories, indian mythology stories

sri varala venkateswara swamy temple eduru special story small tirupati : A special story on sri varala venkateswara swamy temple which is famous as small tirupathi. This is located in west godavari district eduru village.

‘బుల్లి తిరుపతి’గా పేరుగాంచిన ప్రసిద్ధ దేవాలయం

Posted: 05/09/2015 06:06 PM IST
Sri varala venkateswara swamy temple eduru special story small tirupati

దేశంలో ఎన్నో హిందూదేవాలయాలు వెలసినా.. వాటి ప్రముఖ్యతలు, విశిష్టతలు మాత్రం భక్తుల నోళ్లలో నానుతూ ఆచంద్రతారఖ్కంగా నిలుస్తున్నాయి. భక్తులు విశ్వాసాలకు పుట్టినిళ్లుగా మారిన దేవాలయాల్లో.. దేవుళ్లు స్వయంభువుగా వెలిస్తే.. మరికొన్ని ఆలయాలను భక్తులు దేవుడిపై వున్న తమ భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించారు. ఇలా నిర్మితమైన వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి వున్నాయి. అలాంటి ఆలయాల్లో తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఒకటి! ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వుండే భక్తులు వస్తుంటారు. పలు కీలక సందర్భాలలో మాత్రం బారులు తీరుతుంటారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వైకుంఠంగా ప్రసిద్ది చెందిన తిరుమలకు వున్న విశిష్టత నేపథ్యంలో ఈ ఆలయ తరహాలోనే మరెన్నో ఆలయాలు పుట్టుకొచ్చాయి. సదరు దేవాలయాలకు ప్రత్యేకంగా పేర్లున్నప్పటికీ.. వాటికి గుర్తింపు మాత్రం ప్రసిద్ధ ఆలయాలతో పోలి వుంటుంది. అలాంటి ఆలయాల్లో శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి! ఆంధ్రరాష్ట్రంలో వున్న ఈ ఆలయం ‘బుల్లి తిరుపతి’గా ప్రసిద్ధి గాంచింది.

ఆలయ విశేషాలు :

ఈ దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని ఈడూరులో నెలకొని ఉన్న ప్రసిద్ధ ఆలయం. 2005 ఫిబ్రవరి 17న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది. క్రమంగా స్వామివారి మహిమ గుర్తించిన భక్తులు.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తూ కోరిన వరాలు ఇచ్చే దేవునిగా ‘శ్రీ వరాలవేంకటేశ్వరుని’గా ప్రసిద్ధి చెందారు. మనసులో కొరిక తలచుకొని 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి వారి మొక్కును చెల్లించుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా మారింది.

ముందుగా చిన్నగుడిగా నిర్మాణమైన ఈ ఆలయం.. దాతల సహకారంతో గుడిచుట్టూ ప్రాకారం, రాజగోపురం నిర్మాణం జరిగింది. రథోత్సవాల కోసం రథం తయారు చేయించారు. మకరతోరణం, గరుడవాహనం, శేషవాహనం కూడా స్వామి వారికి సమకూర్చడం జరిగింది. అందరికీ మంచి బుద్ధి సిద్ధించాలని, సర్వజనులు సుఖశాంతులతో ఉండాలని, ఆలయ దినదినాభివృద్ధి సాధించాలని ఈ ఆలయంలో ఓ ప్రత్యేక యాగం నిర్వహిస్తారు. ఈ యాగంలో పాలుపంచుకున్న దంపతులకు, సర్వులకు శ్రీవారి అనుగ్రహం వల్ల సర్వదోషాలు తొలిగి.. అన్నీ విధాల సుఖశాంతులతో జీవిస్తారని నమ్మకం.

ఇక ఆలయంలో ప్రతీ శనివారం విశేష అలంకారాలు, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీ నెలా వచ్చే శ్రవణా నక్షత్రం రోజున స్వామి వారికి కల్యాణం జరుపుతారు. ఈ కల్యాణం జరిపించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని, పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, చదువు , ఆరోగ్యం, మొదలైన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri varala venkateswara swamy temple  Venkateswara temple  small tirupathi  

Other Articles