The Special Story Of Singarakonda Kshetram | Lord Anjaneya temple | Ugra Narasimha Swamy Stories

Singarakonda kshetram history lord anjaneya temples ugra narasimha swamy stories

singarakonda kshetram, singarakonda biography, singarakonda history, singarakonda special story, singarakonda temples, anjaneya temple, narasimha swamy temples, singarakonda temples story

singarakonda kshetram history lord anjaneya temples ugra narasimha swamy stories : The Biography Of Singarakonda Kshetram Where Lord Anjaneya Swamy Has Take Rest Here For Few Minutes When He Went To Discover Sita.

ఆంజనేయుడు విశ్రాంతి తీసుకున్న సింగరకొండ క్షేత్ర విశేషాలు

Posted: 05/18/2015 07:04 PM IST
Singarakonda kshetram history lord anjaneya temples ugra narasimha swamy stories

పూర్వం దేవతలు విశ్రాంతి నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో సేదతీర్చుకున్నారు. అలాంటి ప్రదేశాలను ఆధ్యాత్మికంగా భావిస్తూ వాటిని పుణ్యక్షేత్రంగా భావిస్తూ వచ్చారు. అంతేకాదు.. అందుకు ప్రతిరూపంగా ఆలయాలు నిర్మించడం కూడా జరిగింది. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ‘సింగరకొండ’ పుణ్యక్షేత్రం ఒకటి! ఇది ప్రకాశం జిల్లాలో వున్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో వున్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవలయాలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి. మొదట్లో సింగర కొండ అని నరసింహ క్షేత్రం పిలుబడినప్పటికీ.. ఆంజనేయ స్వామి క్షేత్రంగానే ప్రఖ్యాతి గాంచింది. ఈ ఆలయంలోని గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం.. దీనిని 14వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు నిర్మించినట్లు తెలుస్తోంది.

స్థల పురాణం : సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపధం బయలుదేరిన ఆంజనేయుడు, సింగరకొండ ప్రారంతంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని ఒక నమ్మకం. అందుకే ఇక్కడ ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగర కొండలోని కొండపై గల నరసింహస్వామి గుడి దగ్గర ధ్వజారోహణ చేస్తున్న సమయంలో.. కొండ క్రింద ఓ దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహానికి హారతి ఇస్తున్నట్లుగా కనిపంచాడట. దాంతో తాతాచర్యులు వెంటనే పరుగుపెడుతూ కొండకిందకెళ్లి చూడగా.. వారికి పురుషుడు మాయమై, దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.

సింగరకొండలో జరిగే పూజలు :

సింగర కొండలో ప్రతి మంగళ, శనివారాలు విశేష పూజలు జరుగుతాయి. అలాగే ముఖ్య పండుగలైన ఉగాది, శ్రీరామ నవమి, హనుమజ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవాల తిరునాల్లు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ, కోటి తమలపాకుల పూజలు రెండు కళ్ళూ చాలవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singarakonda kshetram  Anjaneya Swamy Temple  

Other Articles