hanuman jayanthi | tadubandh temple | Lord Sri Ram

Hanuman jayanthi ramayan lessons hanuman rally tadubandh temple

hanuman jayanti, hanuman festival, anjaneya festival, tadubandh temple, sri ram temple, hanuman temples, anjaneya history, hanuman history, hanuman special story

hanuman jayanthi ramayan lessons hanuman rally tadubandh temple : A Special article on hanuman jayanthi festival. In this Time the hyderabadi devotees make hanuman rally from koti to tadubandh temple

తాడ్ బంద్ హానుమాన్ మందిర్ వరకు శోభాయాత్ర..

Posted: 04/04/2015 05:27 PM IST
Hanuman jayanthi ramayan lessons hanuman rally tadubandh temple

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరుపుకునే పండుగల్లో ‘హనుమాన్ జయంతి’ ముఖ్యమైంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు ఎంతో శ్రద్ధగా హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఎంతోమంది భక్తులు కోఠి నుంచి తాడుబంధ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు హునుమాన్ ర్యాలీ నిర్వహిస్తారు. ధైర్యానికీ ప్రతీక అయిన ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఎంతటి వాడంటే.. ఆయన కోసం ఆకాశమార్గంలో పయనించి, ఏడు సముద్రాలు దాటి.. లంకలో వున్న సీతమ్మ జాడ కనిపెట్టాడు. అంతేకాదు.. ప్రమాదంలో వున్న లక్ష్మనుడికోసం సంజీవనీ పర్వతాన్ని సైతం పెకిలించి తీసుకొచ్చాడు.

భారతదేశంలో హనుమాన్ జయంతి సంవత్సరానికి మూడుసార్లు జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతానికి చెందిన వారు ఒక్కొక్క మాసంలో ఈ వేడుకను నిర్వహించుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు.

హనుమంతుడి భక్తి :

హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ కూడా రాముడి సేవలోనే గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు.

ఒకసారి సీతమ్మ తన నుదుటన సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు...‘‘నుదుట సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావమ్మా?’’ అని అడిగాడు. అప్పుడు సీత నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండడానికి’’ అని అంటుంది. అంతే, ఆ మరుక్షణమే ఏమీ ఆలోచించకుండా హనుమంతుడు తన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు.

ఇంకో సందర్భంలో సీత హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. కానీ హనుమంతుడు ఆ భరణంలో వున్న ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు. అదేమిటని సీత అడగ్గా.... ''రామయ్య తండ్రి ఈ పూసలలో కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామిలేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అని సమధానం ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hanuman jayanti  anjaneya temples  hanuman chalisa  

Other Articles