ummingbird special story | worlds smallest birds

Hummingbird special story worlds smallest birds

hummingbird, hummingbird special story, hummingbird history, hummingbird wikipedia, hummingbird most popular, hummingbird life story, hummingbird biography, hummingbird photos, hummingbird story

hummingbird special story worlds smallest birds : A special story on hummingbird which is the smallest bird in the world history.

ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కిన పక్షి

Posted: 04/03/2015 07:32 PM IST
Hummingbird special story worlds smallest birds

దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో ఎన్నోరకాల వింతలు విశేషాలు దాగి వున్నాయి. మానవుడికి అంతుచిక్కని కోటానుకోట్ల విచిత్రమైన జాతులు ఈ భూమి మీద ఆవిష్కృతమై వున్నాయి. అలాంటి వాటిల్లో హమ్మింగ్ పక్షి కూడా ఒకటిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కింది. ఇది తన రెక్కల్ని ఆడించేప్పుడు ఒక శ్రావ్యమైన శబ్దం వినిపిస్తుంది. దానివల్లే ఈ పక్షికి 'హమ్మింగ్ బర్డ్' అనే పేరొచ్చింది. ఇతర పక్షులతో పోల్చుకుంటే దీని ఆకారం కాస్త భిన్నంగా వుంటుంది. అంతేకాదు.. ఈ పక్షిలో ఇంకా ఎన్నో విచిత్రాలు దాగివున్నాయి.

ఇతర పక్షులతో పోలిస్తే వీటి ముక్కలు కాస్త పొడవుగా వుంటాయి. ముఖ్యంగా మగపక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా ఉంటాయి. ఈ పదునైన ముక్కునే అవి కత్తుల్లా వాడుకుంటాయిట. అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ముక్కునే ఆయుధాల్లా ఉపయోగిస్తాయని. న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇన్నాళ్లూ ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు. కానీ ఇవి ముక్కుతో చేసే పనులు చూసి ఆశ్చర్యపోయారు.

ఇవి ఒకదానితో మరోటి గొంతుపై ముక్కుతో పొడుచుకుంటూ పోటీపడతాయి. తమ జతపక్షి ఇబ్బందుల్లో ఉంటే శత్రువుల్నించి కాపాడ్డానికి కూడా మగ హమ్మింగ్ పక్షులు ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై గట్టిగా పొడుస్తూ యుద్ధానికి దిగుతాయట. ఇలాంటి నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్‌కు ఉండడంతో ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది వరకు జరిగిన పరిశోధనల్లో మగ హమ్మింగ్‌లు ఆడ పక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసింది.

మరికొన్ని విశేషాలు :

ఈ హమ్మింగ్ పక్షులు ఒక సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు. ప్రపంచంలోనే అతిచిన్నగా వుండే పక్షుల కాళ్లు బలహీనంగా ఉండటం వల్ల నడవలేవు. అందుకే గాల్లో ఎగురుతూనే తేనెను ఆస్వాదిస్తాయి. వెనక్కి కూడా ఎగిరే సత్తా వీటికుంది. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hummingbird  worlds smallest bird  

Other Articles