udaipur taj lake palace history | king maharana jagath singh 2

Udaipur taj lake palace history details

taj lake palace, udaipur taj lake palace, taj lake palace history, taj lake palace biography, taj lake palace story, taj lake palace news, taj lake palace making, taj lake palace shooting, taj lake palace guests, taj lake palace photos, king maharana jagath singh 2

udaipur taj lake palace history details : The History of taj lake palace in udaipur which is made by king maharana jagat singh in 18th century with luxurious facilities for him.

ఉదయ్ పూర్ లోని తాజ్ లేక్ ప్యాలేస్ విశేషాలు

Posted: 04/01/2015 04:08 PM IST
Udaipur taj lake palace history details

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో లేక్ పిచోలా ప్రాంతంలో వుండే తాజ్ లేక్ ప్యాలేస్ ఎంతో విలాసవంతమైన హోటల్. 83 గదులు, పాలరాతి గోడలతో కూడిన అధునాతన సూట్లు గల ఈ ప్యాలెస్ ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 4ఎకరాల విస్తీర్ణంలోని ద్వీపంలో నిర్మించారు. ఈ ప్యాలెస్ ఓ విశేష గుర్తింపు వుంది. అదేమిటంటే.. కేవలం భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే శృంగార హోటల్ గా ఈ ప్యాలెజ్ ప్రసిద్ధి గాంచింది.

ఈ ప్యాలెస్ లో అతిథ్యం పొందినవారిలో ప్రపంచదేశాధినేతలతోపాటు ఎందరో సినీ ప్రముఖులు కూడా వున్నారు. లార్డ్ కర్జన్, వీవీన్ లీ, ఎలిజెబెత్ రాణి, ఇరాన్ ఒకప్పటి రాజు, నేపాల్ రాజు, ఒకప్పటి అమెరికా ప్రథమ మహిళ జాక్వలిన్ కెన్నడి లాంటి వాళ్లంతా ఇందులో కొన్నాళ్లపాటు బస చేశారు.అంతేకాదు.. ఈ ప్యాలెస్ లో అనేక సినిమాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన జేమ్స్ బాండ్ సిరీస్ లలో ఓ మూవీ, బ్రిటీష్ టీవీ సిరీస్, ఇతర హాలీవుడ్ చిత్రాలతోపాటు పలు హిందీ సినిమాల చిత్రీకరణలు జరిగాయి.

చరిత్ర :

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ రాజైన మహారాణా జగత్ సింగ్-II (మేవార్ రాజవంశస్థుల పాలనలో 62వ రాజు) ఈ అద్భుతమైన ప్యాలెస్ ను 1743-1746 మధ్యకాలంలో నిర్మించారు. వేసవికాలంలో తన విడిదిగా ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ఆయన దీనిని అప్పట్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, తనకు కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చుకునే విధంగా నిర్మించుకున్నారు. అప్పట్లో తమ రాజ దర్బార్లను కూడా ఇక్కడే నిర్వహించేవారు. దర్బార్ లోని అందమైన ఫిల్లర్లు, చూడముచ్చటైన పై అంతస్తుతో పాటు ఇక్కడి తోటలు ప్రత్యేక ఆకర్షణ నిస్తాయి. అప్పట్లో దీనిని ‘జగ్ నివాస్’ లేదా ‘జన్ నివాస్’ అని పిలిచేవారు.

Taj-Lake-Palace-01
Taj-Lake-Palace-02
Taj-Lake-Palace-03
Taj-Lake-Palace-04
Taj-Lake-Palace-05
Taj-Lake-Palace-06
Taj-Lake-Palace-07
Taj-Lake-Palace-08

ప్యాలెస్ విశేషాలు :

- హిందువుల ఆరాధ్య దైవమైన సూర్యున్ని నమస్కరించుకునేందుకు వీలుగా ఈ ప్యాలేస్ ను తూర్పు ముఖంగా నిర్మించారు. ఇప్పటికీ ఈ హోటల్ సన్ బాత్ కు, సూర్య నమస్కారాలకు ప్రసిద్ధి గాంచింది.

- లేక్ ప్యాలేస్ లో రాజుల కాలం నాడు బట్లర్లుగా పనిచేసిన వారి వారసులు ఇప్పటికీ ఇక్కడ ‘రాయల్ బట్లర్లు’ గా పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అతిథులకు వీరంతా రాచ మర్యాదలు అందిస్తారు.

- ప్యాలేస్ లోని పై గది దాదాపు 21 అడుగుల వ్యాసంతో పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. దీని ఫ్లోరింగ్ మొత్తం నలుపు, తెలుపు రంగు పాలరాతితో పరిచారు. అదేవిధంగా ప్యాలేస్ గోడలు రంగురంగుల ఖరీదైన రాళ్లతో నిర్మించారు. ప్యాలేస్ గోపురము చూడడానికి ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

- లేక్ ప్యాలేస్ హోటల్ నిర్వహణ బాధ్యతలను 1971లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలేసెస్ తీసుకుంది. ఆ తర్వాత ఈ ప్యాలేస్ కు అదనంగా మరో 75 గదులు నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : udaipur taj lake palace  king maharana jagath singh 2  rajasthan kingdoms  

Other Articles