Iitian powers ukhand village with electricity

Real Heroes, Agunda, Uttarakhand, IIT Delhi, Yogeshwar Kumar, Electricity, Employment, Agunda village

In the fifth year of CNN-IBN's Real Hero, we get you the story of Yogeshwar Kumar. In the last three decades, Kumar, an IIT engineer, has set up environmentally friendly micro-hydroelectric plants in villages where no gridline passed through. The community-run powerstation not just powers people but also empowers them

IITian powers Ukhand village with electricity.png

Posted: 08/09/2012 01:25 PM IST
Iitian powers ukhand village with electricity

Yogeshwar_Kumar3

Yogeshwar_Kumarమనిషి అభివృద్ధికి ప్రభుత్వం కల్పించాల్సిన అత్యంత ముఖ్యమైన సదుపాయాలు రెండు. ఒకటి రవాణా, రెండు విద్యుత్తు... ఈ రెండూ పుష్కలంగా ఉన్నచోట ఉపాధికి కరవుండదు. కరవుకు చోటుండదు. అరవై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా లక్ష గ్రామాలకు ఈ రెండూ అస్సలు లేవు. అలాంటి గ్రామాలే లక్ష్యంగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు యోగేశ్వర్‌కుమార్.

ఉత్తరాఖండ్... ఉత్తరభారతంలోని పైకొసన కొండలు కోనల్లో ఉండే రాష్ట్రం. అక్కడ సమతలమైన భూమి చాలా తక్కువ. దీంతో గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయాలంటే చాలా కష్టం. పైగా పల్లెలు కూడా చాలా చిన్నవి. సగటున ఒక్కోదాంట్లో 50 నుంచి 300 ఇళ్లుంటాయి. ఈ నేపథ్యంలో వాటికి విద్యుత్ సరఫరా చేయడం అంటే ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం.ఇప్పటికే ఇండియాలో విద్యుత్ పంపిణీలో లోపాల వల్ల వేల కోట్లు ఆవిరవుతున్నాయి. ఎంతో విద్యుత్ వృథా అవుతోంది. పైగా కొండల్లో ఉండే ఆ గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయడం అంటే రూపాయి ఆదాయం కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టినట్లు లెక్క. వీరికి భవిష్యత్తులో కూడా వెలుగులు రావడం కష్టమే. ఈ విషయాన్ని గర్తించి, అక్కడి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమయ్యారో వ్యక్తి. ఆయనే యోగేశ్వర్‌కుమార్ (30).

ఢిల్లీ ఐఐటీ పట్టభద్రుడైన యోగేశ్వర్ కొండలు, లోయల్లోని ఉత్తరాఖండ్ గ్రామాల్లో విసృ్తతంగా పర్యటించారు. వారికి విద్యుత్ సదుపాయం కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. అప్పుడు, ఆయన కనుగొన్న మార్గమే సూక్ష్మ జల విద్యుత్ కేంద్రాలు. వాటిని పల్లెల్లోప్రవేశపెట్టడం ద్వారా చిన్న గ్రామాలకు విద్యుత్ కష్టాలు తీరిపోతాయన్నది ఆయన ఆలోచన. దానికోసం ఎంతో పరిశోధన చేశారు. చాలా కాలం శ్రమించారు.కేవలం కరెంటు ఇవ్వడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు, విద్యుత్‌తో అంధకారం తొలగించడంతో పాటు దాన్ని ఉపాధి కల్పనకు వినియోగించుకుని కొనుగోలు శక్తి పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మార్చాలన్నది ఆయన లక్ష్యం. దీన్నే ‘ఎంపవర్ ఓవర్ పవర్’ అంటారాయన. ఏదో స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బు తేవడం, దాన్ని ఖర్చు పెట్టడం అనే పద్ధతిలో కాకుండా కమ్యూనిటీ పవర్ జనరేషన్ సిద్ధాంతాన్ని అనుసరించారు. అంటే గ్రామీణులను ప్రాజెక్టులో భాగస్వాములను చేసి దాని ఉత్పత్తి, పంపిణీ, నిర్వహణ, అమ్మకం బాధ్యతలన్నింటినీ గ్రామస్థులకే అప్పగిస్తారు.ఒక్కో ప్రాజెక్టు నుంచి పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. దాన్నంతా ఒక చోటుకు తెచ్చి ఇళ్లకు, గ్రామాలకు వికేంద్రీకరణ చేస్తారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి తన ఢిల్లీ కార్యాలయంలో యోగేశ్వర్ ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

Yogeshwar_Kumar1ఈ విధంగా ఆయన ఇప్పటివరకు సుమారు 15 మైక్రో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నెలకొల్పారు. ఒకవేళ ఆ గ్రామాలకు ప్రభుత్వం కరెంటు సరఫరా కల్పించి ఉంటే వీరు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. వీటిలో పంపిణీ నష్టాల నివారణ, స్థానిక ఉత్పత్తి, స్వయం నియంత్రణ ద్వారా ఖర్చు తక్కువవుతోంది. అందుబాటులో విద్యుత్ దొరుకుతోంది.వెలుగులతో ఆగలేదు

యోగేశ్వర్ పలు భారత ప్రభుత్వ సంస్థలతో కలిసి ఆ గ్రామీణుల కోసం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆయన వారి ఉపాధిని బాగా పెంచారు. అక్కడ ఎక్కువ మంది ఉన్ని ఉత్పత్తి చేస్తారు. ఆ ఉన్ని కిలో రూ.20కి అమ్ముడుపోతోంది. దాన్ని ప్రాసెస్ చేసి అమ్మితే రూ.30 పలుకుతుంది. కానీ చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఈ చిన్న మెకానిజం ఉపయోగించి దాన్ని ఆరు రోజుల్లో ప్రాసెస్ చేసే అవకాశం కల్పించారు. దీని ద్వారా ధర పెరిగింది.ఉన్ని ఉత్పత్తి కూడా పెరిగింది. ఇప్పుడు ఆ గ్రామాలకే కాదు, ఆ జీవితాలకూ వెలుగొచ్చింది. యోగేశ్వర్ ఉత్తరాంచల్ గ్రామాలకే కాకుండా సరిహద్దుల్లోని కొన్ని ఇతర రాష్ట్రాల్లోని గ్రామాలకు మేధో సాయం చేసి వారు సొంతగా విద్యుత్ సదుపాయం ఏర్పాటుచేసుకోవడానికి తోడ్పడ్డారు. ఆయణ్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నో సంస్థలు మనస్ఫూర్తిగా అవార్డులతో ముంచెత్తాయి. అందుకే అంటారు... ఇలాంటివారు ఊరికి ఒక్కరైనా ఉండాలని!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brunei kampong air water village
Aaarland city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles