Aaarland city

Aaarland.png

Posted: 07/23/2012 01:15 PM IST
Aaarland city

Aaarland_city

Aaarland1వాల్డ్ డిస్నీ మానసపుత్రిక డిస్నీ వరల్డ్ ఇక్కడా ఉంది! జురాసిక్ పార్కు రూపొందిన యూనివర్సల్ స్టూడియో ఇక్కడే. పెద్దవాళ్ల చేత పిల్లల్లా అల్లరి చేయించే ఈ థీమ్ పార్కుల నగరం... నింగికి నిచ్చెన వేస్తున్న నేల. రాకెట్లను ప్రయోగించే ఈ భూమ్మీద డాల్ఫిన్ కేరింతలు... మొసళ్ల భీకరాలు... అన్నీ వింతలే! వినోదాలే!! కమలాలు పండే ఫ్లోరిడాలో ప్రధానమైన ఈ నగరం... ఆర్‌ల్యాండ్... విశేషాలు.

ఆర్‌ల్యాండ్ నగరాన్ని అందమైన నగరంగా అభివర్ణిస్తారు. నగరంలో థీమ్‌పార్కులు ఎక్కువ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డిస్నీవరల్డ్ ఉంది. వాల్ట్ డిస్నీ నిర్మించిన రెండవ థీమ్ రిసార్ట్ ఇది. మొదటిది కాలిఫోర్నియాలో ఉంది. ఆర్‌ల్యాండ్‌లో ఎక్కువ శ్వేతజాతీయులే అయినా నీగ్రోలు, ఆసియా వాళ్లు కూడా ఉంటారు. వారమంతా పని చేయడం, వారాంతంలో షికార్లకెళ్లడం వంటి రొటీన్ అమెరికా జీవనశైలి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఐదు రోజులు సంపాదించింది ఖర్చుచేయడానికి వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఆ రెండ్రోజులు ఖర్చు చేయడానికి కావలసిన డబ్బును ఐదు రోజులు సంపాదిస్తున్నట్లు ఉంటుంది వీళ్ల ధోరణి. తల్లీతండ్రీ పట్టించుకోకపోవడంతో వీళ్లకు ప్రేమ, ఆప్యాయతలు పెద్దగా తెలియవు. లైఫ్‌ని వాళ్లు ఎంజాయ్ చేయడమే జీవితం అన్నట్లు ఉంటారు. విడోలు, డైవలు పిల్లినో, కుక్కనో పెంచుకుంటూ పెట్‌తోనే లోకం అన్నట్లు జీవిస్తారు. మొసళ్లను కూడా పెంచుకుంటారు.లోకల్ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు  నీగ్రోల అల్లరిని భరించాల్సి ఉంటుంది.

ప్రపంచ భోజనం!

Aaarland2వారాంతంలో రకరకాల భోజనం అందించే థీమ్‌పార్కు ఫుడ్ అండ్ వైన్. ఇది డిస్నీవరల్డ్‌లో ఉంది. ఇందులో మెక్సికో, నార్వే, చైనా, జర్మనీ, ఇటలీ, యునెటైడ్ స్టేట్స్, జపాన్, ఫ్రాన్స్, కెనడా... వంటి పదకొండు దేశాల వంటలు ఉంటాయి. లాబ్‌స్టర్, ఫిషర్‌మన్స్ పై, వార్మ్ చాకొలెట్ లావా కేక్ వంటి చాలా రకాలు ఉంటాయి. కొన్నింటి పేర్లను పలకలేం కూడ. గార్నిష్ చేసిన విధానం చూస్తే ఇది తినే పదార్థమా లేక టేబుల్ మీద షోపీస్‌లా పెట్టారా అనిపిస్తుంది. ఇక్కడి వాళ్లు ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లను... అదే ప్రధాన ఆహారం అన్నట్లు తింటారు. మన భోజనం దొరికే వుడ్‌ల్యాండ్స్ వంటి హోటళ్లు ఉంటాయి కానీ తక్కువ. భోజనం కోసమే అక్కడి వరకు వెళ్లాలి. ఫైవ్ స్టార్ కేటగిరీ హోటల్‌లో ఒక దోసె 900 రూపాయలవుతుంది. అరలీటరు నీళ్లు రెండు వందలు. ఇక్కడ రాబడి కూడా అలాగే ఉంటుంది కాబట్టి జీవించగలరు కానీ మన ధరలతో పోల్చుకుంటే ఇక్కడ జీవించలేం.

ఆర్‌ల్యాండ్‌లో డిస్నీల్యాండ్‌తోపాటు చూడాల్సినవి యూనివర్సల్ స్టూడియో, సీ వరల్డ్, అక్వాటికా థీమ్‌పార్కులు, నాసా... మొదలైనవి చాలానే ఉన్నాయి. ఇక్కడ నేషనల్ పార్కులు కూడా ఎక్కువ. స్నేక్ షోలు, క్రీక్ Aaarland4డాయిల్ షోలు కూడా జరుగుతుంటాయి. డిస్నీల్యాండ్... మ్యాజిక్ కింగ్‌డమ్, హాలీవుడ్, యానిమల్ కింగ్‌డమ్, ఎప్‌కాట్ అని నాలుగు భాగాలు. మిక్కీ మౌస్, గూఫీ, స్కూబీ, డొనాల్డ్‌డక్ క్యారెక్టర్లు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయి. టీవీలో కనిపించే పాత్రలు కళ్లెదురుగా తిరుగుతుంటే మనం బొమ్మల ప్రపంచంలో వినీలాకాశంలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ పాత్రల వేషాలు ధరించిన మనుషులు మన చుట్టూ తిరుగుతూ హాయ్‌చెప్తూ, షేక్ హ్యాండ్ ఇస్తారు. పెద్దవాళ్ల చేత చిన్న పిల్లల్లా అల్లరి చేయించగల అద్భుత ప్రపంచం ఇది. డిస్నీల్యాండ్‌లో రాత్రి తొమ్మిదిగంటలకు క్యాజిల్ చుట్టూ కార్టూన్ క్యారెక్టర్ల పెరేడ్ జరుగుతుంది. లైట్లతో అలంకరించిన వ్యాన్లలో ఈ పాత్రలు డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్సులకు నేపథ్య సంగీతంలా బ్యాండు వాయిస్తుంటారు, దీనికితోడు ప్రేక్షకుల చప్పట్లతో ఆ ప్రదేశం అరగంట పాటు మార్మోగుతుంటుంది. లేజర్ షో ఎంత చెప్పినా తక్కువే అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆఖరుగా క్రాకర్స్ కాల్చడంతో కార్యక్రమం ముగుస్తుంది.

Aaarland3రెండవది హాలీవుడ్. సినిమా స్టంట్లు, సెట్టింగులు, హారర్ సినిమాల పాత్రల మేకప్‌లు, పెద్దవాళ్లు ఆసక్తి చూపించే రకరకాల రైడ్‌లు ఉంటాయి. కార్లతో చేసే స్టంటులు ఆకట్టుకుంటాయి.ట్రామ్‌లో వెళ్తూ అన్ని రకాల వింతలనూ చూడవచ్చు. మూడవది యానిమల్ కింగ్‌డమ్. నేపాల్, ఇండియా, ఆఫ్రికా, చైనావంటి దేశాలను పోలిన సెట్టింగులు ఉంటాయి. ఇక్కడ తిరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న భావన కలుగుతుంది. వ్యాన్‌లో ఎక్కి జంతువులను చూడవచ్చు. ఇక నాలుగవది ఎప్‌కాట్. ఇక్కడ స్టిమ్యులేషన్ రైడ్స్ చాలా బాగుంటాయి. రోలర్ కోస్టర్ రైడ్ చేస్తున్నట్లు, రాకెట్‌లో అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న భావననూ కలిగిస్తాయి ఈ రైడ్స్. ఇక ఫ్యూచర్ షోల పేరుతో జరిగే ప్రదర్శనలు వాటి కాన్సెప్ట్ ఆసక్తికరంగానూ చమత్కారంగానూ ఉంటాయి. ట్రామ్‌లో ప్రయాణిస్తూ ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో పెంచే రకరకాల మొక్కలు, చెట్లు, పూలు, పండ్లు, కూరగాయలను చూడవచ్చు. మైక్‌లో ఆయా చెట్ల వివరాలను, సాగు పద్ధతులను వివరిస్తూంటారు.

గెటార్లాండ్‌కు మొసళ్లను చూడడానికే వెళ్తారు. ఈ థీమ్‌పార్కులో అబ్జర్వేటరీ టవర్ మీద నుంచి వీటిని చూడవచ్చు.ఆర్‌ల్యాండ్‌లో మరొక ప్రత్యేక ఆకర్షణ యూనివర్సల్ స్టూడియో. దీనిని ఇలా చెప్పడంకంటే జురాసిక్ పార్క్ సినిమా తీసిన స్టూడియో అంటే వెంటనే గుర్తొస్తుంది. వందేళ్లుగా సినిమాలు, యానిమేషన్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టూడియో ఇది. జాస్, మమ్మీ లాంటి సినిమాలు రూపుదిద్దుకున్నది కూడా ఇక్కడే. ఈ స్టూడియో హెడ్ ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంది. ఇక్కడ ఉన్నది దాని అనుబంధ శాఖ. రకరకాల ఆటలు, రైడ్స్, షోలు, త్రీడి సినిమాలు, ఫోర్ డి సినిమాలు ఇక్కడ ముఖ్యమైనవి. ఆటల్లో గెలుచుకునే చిన్న చిన్న బహుమతులు పెద్దవాళ్లను కూడా చిన్న పిల్లల్లా మురిసిపోయేలా చేస్తాయి. ఆర్‌ల్యాండ్ పర్యటన ఆసక్తికరంగా సాగుతుంది, ఆనందానుభూతులను మిగులుస్తుంది.

మరికొన్ని సంగతులు...

యునెటైడ్ స్టేట్స్‌కి నైరుతి దిశగా ఉంటుంది ఫ్లోరిడా రాష్ట్రం. ప్రపంచంలో మొసళ్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశం ఫ్లోరిడా. రాష్ట్రానికి పశ్చిమాన గల్ఫ్ ఆఫ్ మెక్సికో, తూర్పున అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయి. ఈ రాష్ర్టం కమలాలకు ప్రసిద్ధి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iitian powers ukhand village with electricity
Historical information of cologne in germany  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles