Brunei kampong air water village

Brunei, Government, Culture, Business, Guides, Education, Environment, Capital City, , News, Tourism, Travel, Maps, Country Guides, History

Brunei, Government, Culture, Business, Guides, Education, Environment, Capital City, , News, Tourism, Travel, Maps, Country Guides, History

Kampong Air Water Village - Brunei.png

Posted: 08/13/2012 12:55 PM IST
Brunei kampong air water village

Brunei_Country_History

Brunei-Country-Profile'గాంధి కలలుగన్న దేశం ఇదే. ఇక్కడ ఎంత రాత్రిపూటయినా సరే ఆడపిల్ల ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళగలదు. ఈ దేశంలో గత 20 ఏళ్ళలో ఒక్క హత్యా నమోదు కాలేదంటే ఆలోచించండి ఎంత ప్రశాంతమైన దేశమో'... బ్రూనై దారుస్సలాం విశేషాలు తెలుసుకుందాం.

బోర్నియో ద్వీపకల్పంలో వాయవ్యాన ఉన్న ఓ చిన్న అందమైన దేశం బ్రూనై దారుస్సలాం. 2010 జూలై లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా కేవలం నాలుగు లక్షలు. భారతదేశపు ఏ ఒక్క కాలనీలో మొహల్లాలోనో కనిపించే జనసాంద్రత ఇది. అలాంటిది దేశం మొత్తంమీద అంత తక్కువమంది ఉన్నారంటే అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ముఖ్యంగా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ నాలుగు లక్షల ప్రజల కోసం దాదాపు లక్షన్నర మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో సేవలందిస్తున్నారు.

అధికారిక మతం ఇస్లాం, భాష మలయ్. మలేషియా, ఇండొనేషియా, సింగపూర్‌లలో కూడా అధికార భాష అదే. నిజానికి మలయ్ అన్న పదం ఓ జాతి ప్రజల పేరుగా వాడుకలో ఉంది. దేశ జనాభాలో అరవై ఏడు శాతం ప్రజలు మలయ్‌లుగా పిలువబడుతూ మలయ్ భాషని మాట్లాడేవారిగా ఉన్నారు. రెండు మూడు స్థానాల్లో ఇంగ్లీష్, చైనీస్ భాషలు ఉన్నాయి. దాదాపు అందరూ కాస్తో కూస్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి విదేశీయులకి, టూరిస్టులకి భాష సమస్య కాదు. దేశాన్ని నాలుగు జిల్లాలుగా విభజించారు. 1906లో బ్రిటిష్ ప్రొటెక్టోరేట్‌గా ఉన్న ఈ బ్రూనై దారుస్సలాం 1984 జనవరిలో పూర్తి స్వాతంత్య్రం సంపాదించుకుంది. గల్ఫ్ దేశాల వలె పూర్తి స్థాయి రాజరికం ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ఈ దేశానికి ఆర్థిక వనరులు చమురు, సహజ వాయువే.

బ్రూనై అనగానే అందరికీ బ్రూనై సుల్తానే గుర్తుకు వస్తాడు. నిజమే ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఒకడైన హసనల్ బోల్కియా ఈ దేశపు రాజే. 1967 నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న 29వ రాజు. దాదాపు అరవై బిలియన్ డాలర్ల ఆస్తితో 1990 దశకంలో ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దేశపు చమురు, సహజవాయువు నిక్షేపాల విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు. సాధారణంగా నీళ్ళో, చమురో మాత్రమే ఉండే దేశాలు మనకు తెలుసు. కానీ ఈ బ్రూనై దారుస్సలాం ప్రత్యేకతల్లో ఒకటి అవి రెండూ పుష్కలంగా లభ్యం కావటం.

క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు మహారాజు శ్రీవిజయన్ ఈ దేశాన్ని పరిపాలించాడు. దేశంలో అందరూ సంస్కృతం మాత్రమే మాట్లాడాలని శాసనం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ఇస్లాం ప్రాబల్యం పెరిగి అదే అధికారిక మతంగా మారింది. అయితే భాషాపరంగా మాత్రం సంస్కృతమే ఇక్కడ అధికారిక భాషగా కొనసాగుతోంది. చరిత్ర ఆవిష్కరించే చిత్రాల్లో ఇదొకటి.

Brunei-kingప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం సదుపాయాలతో పాటు అందరికీ ఇల్లు, కారు సమకూర్చుకోవడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ఋణాలు ఇస్తారు. ఇవన్నీ సాధ్యం కావడానికి ప్రధాన కారణం వారి తక్కువ జనాభానే. ఇక్కడ ప్రతీ వ్యక్తికి ఓ కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ. అక్కడక్కడ విదేశీ శ్రామికుల కోసం మినీ బస్సులు కనబడతాయి. టాక్సీలు, ఆటోల్లాంటివి లేకపోవడం ఒక్కోసారి ఇబ్బందికరమేగాని ఏం చేస్తాం? టీవీ ఛానళ్ళు రోజుకి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందులో నేరాలు-ఘోరాలు లాంటి కార్యక్రమాలు అసలు ఉండవు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఒక హత్య కూడా జరగలేదు. దానికి కారణం హత్యలు, ఆత్మహత్యలు, రేప్‌ల్లాంటి వార్తలు మచ్చుకైనా వినపడవు. కనపడవు. చిన్న చిన్న దొంగతనాలు, అవీ విదేశీ కార్మికులు చేసిన వాటి గురించే వింటూంటాం. ఇక్కడ మనుషులు అతి నెమ్మదిగా మాట్లాడతారు. భావావేశాలకు, ఉద్రేకాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించే వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్పిస్తూంటూంది.రామరాజ్యం గురించి మనం వినడమే తప్ప. చూడలేదు. ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. రాత్రి... అర్ధరాత్రి ఏ సమయంలోనైనా ఏ స్త్రీ అయినా రోడ్డుమీద ఒంటరిగా ఒక్కర్తే నడవగలిగే దేశం, ప్రదేశం ఇంకెక్కడైనా ఉందో లేదో తెలియదు కాని, ఇక్కడ మాత్రం ఉంది. అందుకే ఇది ఇస్లాంలో రామరాజ్యం అనవచ్చు.

ఇక్కడా మన రాముడే!

Water-villageప్రస్తుతం కాంబోడియా అని పిలువబడుతున్న కాంభోజ రాజ్యం వరకూ మన భారత రామాయణాలు పరిఢవిల్లేవనే విషయం కాస్తో కూస్తో బయట తిరిగే టూరిస్టులకి తెలిసే ఉంటుంది. దీనికి బ్రూనై దారుస్సలాం అతీతం కాదు. ఇక్కడ కూడా రామాయణం పూర్తి స్థాయిలో రాణించడమే కాక రామాయణంలోని ముఖ్యపాత్రల పేర్లన్నీ ప్రతి ఇంట్లోను విన్పిస్తుంటాయి. పురుషులకు రమ్‌లీ అని, భుజాంగ్ అని, స్త్రీలకి సితి అని పేర్లు పెట్టుకుంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం లక్ష్మణుడి పేరు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఓ ప్రత్యేకవర్గంగా ఉండడం. రాజుగారి ఆంతరంగిక రక్షకభటులుగా ఇప్పటికీ ఈ 'లక్ష్మణ' వర్గం పనిచేస్తుంటూంది. మలయ్ భాషలో దాదాపు నలభై శాతం సంస్కృత పదాలే వినపడడం కొంతలో కొంత మనదేశపు వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది.నీటి నివాసం

వాటర్ విలేజ్ అని పిలవబడే ఎనిమిది కిలోమీటర్ల గ్రామం ఒకటి ఉంది ఇక్కడ. అక్కడ ఇళ్ళన్నీ నీటిపైనే. పూర్తి చెక్కతో చెయ్యబడ్డ ఈ ఇళ్ళు మామూలు వాటికి దేనిలోనూ తీసిపోవు. కొన్ని శతాబ్దాలుగా అక్కడే నీటిపైన నివాసం ఉంటున్నారు 30 వేల ప్రజలు. వాళ్లు వేరే గృహాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ప్రభుత్వమే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. టూరిస్టులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ వాటర్ విలేజ్. దీన్ని మలయ్ భాషలో 'కంపోంగ్ ఐర్' అంటారు. కంపోంగ్ అంటే గ్రామం అని ఐర్ అంటే నీరు అని అర్థం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Death mystery of subhash chandra bose
Iitian powers ukhand village with electricity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles