Mba student nathan

MBA Student Nathan.GIF

Posted: 04/05/2012 01:51 PM IST
Mba student nathan

MBA_Student_Nathan

MBA_Student_Nathan_solar_project

ఎంబీఏ విద్యార్థి చదువులో భాగంగా ప్రాజెక్టు చేయాలనుకున్నాడు. ఏదో ఒకటి చేసి ‘మమ’ అనిపించినా కూడా పట్టా వచ్చేస్తుంది. కానీ, నాథన్ అడయార్ చేసిన ప్రాజెక్టు మార్కులతో పాటు మనసులనూ గెలిచింది. కొన్ని వందల జీవితాలకు వెలుగులను పంచింది. బ్రిటన్‌కు చెందిన నాథన్ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల విద్యార్థుల జీవితాలను ఎలా మార్చాడు?

ఖరీదైన దేశంలో సుఖవంతమైన జీవితం గడుపుతున్న నాథన్ అడయార్ ఎంబీఏలో భాగంగా ఓ ప్రాజెక్టు చేయాలనుకున్నాడు. అది పుస్తకాల్లో మిగిలిపోకుండా ఉండాలని అనుకున్నాడు. అయితే, మరి దానికోసం ఏం చేయాలి అని ఆలోచించి చివరకు మిత్రుడు కిర్బీని కలిశాడు. ఆయన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. నాథన్, కిర్బీల మధ్య దారిద్రరేఖకు దిగువన డాలరు కంటే తక్కువ ఖర్చుతో బతుకులీడుస్తున్న వారి గురించి చర్చకు వచ్చింది. దాన్నే ప్రాజెక్టుగా చేసుకున్నాడు.

మరి ఆ సమస్యను వినూత్నంగా ఎలా చెప్పాలి అన్న ఆలోచనలోంచి పుట్టిందే ఒక డాలర్ ఐడియా. లండన్‌లో రోజుకు ఒక్క డాలరుతోనే తను కూడా బతకాలని, తద్వారా ఈ సమస్య వైపు ప్రపంచ దృష్టి మళ్లించాలని భావించాడు నాథన్. రోజూ తాను తిండి ద్వారా పొదుపు చేసిన సొమ్మును, 30 రోజుల పాటు విరాళాల రూపంలో వచ్చిన డబ్బును ఉపయోగించి మనరాష్ట్రంలోని ఒంగోలులో ఉన్న ఓ అనాథాశ్రమానికి విద్యుత్ వెలుగులు నింపాడు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వరకు రోజుకు సగటున పాతిక డాలర్లతో బతికిన నాథన్ ఒక్కసారిగా రోజుకు ఒక్కడాలరుతో బతకాల్సి వచ్చేటప్పటికి నరకం చూశాడు.

మొదటి నాలుగురోజుల్లోనే అది ఎంత కష్టమో అర్థమైంది. కానీ, జనం నుంచి వస్తున్న స్పందనే నాథన్ పట్టుదలకు ప్రోత్సాహమైంది. తన ఆహారాన్ని అతడు ఎంత కంట్రోల్ చేసుకున్నాడంటే మధ్యాహ్న భోజనం... సగం క్యారెట్ ముక్క, మూడు పిడికిళ్ల అన్నం, పింటో బీన్స్ కరీ, టమాటాలతో గడిచిపోయింది ఒకరోజు. దీని మొత్తం ఖర్చు 25 సెంట్లు. అంటే డాలరులో పావు వంతు.ఇలా ప్రతిరోజు మూడుపూటలకు ఒక్క డాలరును ఎలా సరిపెట్టాలో చార్టు వేసేవాడు నాథన్. ఆరోగ్యం పాడవకుండా ఆహారంలో కొంతయినా పోషకాలు ఉండేలా చూసుకున్నాడు.

ప్రత్యేక బ్లాగును ప్రారంభించి ఎప్పటికప్పుడు మెనూ వివరాలు, విరాళాలు అందులో రాసేవాడు. తను అనుకున్నట్లు 11560 డాలర్లు (9 లక్షలు) సేకరించగలిగాడు. ఆ క్రమంలో ఎంతోమందిని మనసులను కదిలించారు.ఆయన ఒంగోలులో ఉన్న అనాథాశ్రమాన్ని ఎంచుకోవడానికి ఓ కారణముంది. భారత్‌లో రోజుకో డాలరు (రూ.50)తో గడిపేవారి సంఖ్య దేశ జనాభాలో మూడోవంతు. అందుకే భారత్‌ను ఎంచుకుంటే సమస్యను మరింత తీవ్రంగా చెప్పవచ్చని, మీడియాపై కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తద్వారా ఎక్కువ మందికి సమాచారం తెలిసే అవకాశం ఉందని అనుకున్నాడు. ఇక ఒంగోలు సమీపంలో ఉన్న అనాథాశ్రమం తన స్నేహితుడు కిర్బీ నిర్వహిస్తున్నాడు.

ఆ అనాథాశ్రమం ఉన్న ప్రాంతంలో కరెంటు కష్టాలెక్కువగా ఉన్నందున పిల్లలు చీకట్లోనే బతకాల్సి వచ్చేది. పైగా బిల్లులు కూడా తడిసి మోపెడవుతాయి. అందుకే ఆ ఆశ్రమానికే ప్రత్యేకంగా ఓ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న కిర్బీ సూచన మేరకు దీన్ని ఎంచుకున్నాడు. కేవలం 30 రోజుల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన తొమ్మిది లక్షలను అతడు సేకరించాడు. బ్రిటన్ మీడియా కూడా అతడి ప్రయత్నాన్ని అభినందించింది. అలా అతడి ఎంబీఏ పట్టా కొన్ని జీవితాలకు వెలుగునిచ్చింది. నాథన్ స్వయంగా ఒంగోలుకు వచ్చి సోలార్ వెలుతుర్లు నింపి వెళ్లాడు. మనసుంటే సాయానికి మార్గం ఉండదా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Papamma is a model organic farmer
Italian village was forced to build an artificial sun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles