Papamma is a model organic farmer

Papamma (60), a farmer from the remote village of D. Kurubarahalli in Kolar district of Karnataka, has now become a household name in the State by bagging this year’s Rajyotsava Award. Starting off as a farm labourer, Papamma is now a successful agriculturist. Relentless efforts in the field of organic farming for the last one decade have brought laurels and recognition to Papamma, who till recently did not know how to write her name.

Papamma is a model organic farmer.gif

Posted: 04/10/2012 03:29 PM IST
Papamma is a model organic farmer

Papamma_is_a_model_organic_farmer

papammaఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో అధిక భాగం... తింటున్న ఆహారంలో రసాయనాలు, తాగుతున్న నీటిలో కలుషితాల వల్ల వస్తున్నవే. వ్యవసాయ, గ్రామీణ దేశమైన మన పరిస్థితే ఇలా ఉంటే ఎలా? ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు దొరకడం మనకు అసాధ్యమా? కాదు, వ్యవసాయాన్ని ప్రేమిస్తే అసాధ్యం కానేకాదని నిరూపించింది ఒక మహిళా రైతు. కర్ణాటకకు చెందిన ఆ మహిళ పాపమ్మ. ఊరినే మార్చిన అందరికి స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

నేలతల్లిని కలుషితం చేయకుండా పుణ్యం కట్టుకున్న ఆమె పేరు పాపమ్మ. మూడేళ్ల క్రితం వరకు ఆమె ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఒక సెలెబ్రిటీ ఆమె. ఆమెను అంత గొప్పదాన్ని చేసింది భూమిని నమ్ముకుని ఆమె పడిన కష్టమే. అందులో బంగారం దొరకలేదు. బంగార ం లాంటి పంట పండించింది. కర్ణాటకలో నదుల జాడ లేని కరవు జిల్లా కోలారు. వేడి వాతావరణం ఉన్న ఆ జిల్లాలో బంగారు గనులున్నాయి కానీ భూగర్భ జలాలు మాత్రం లేవు. వర్షం పడితే పంట, లేకుంటే లేదు. అలాంటి జిల్లాలోని మారుమూల పల్లె డి.కురబరహళ్లి. ఆ ఊరిలో పాపమ్మది మూడెకరాల పొలం. కానీ, గత 20 సంవత్సరాల్లో ఆమె ఏనాడూ ఒక్క కూరగాయను కూడా కొనలేదు.

ఒక కిలో బియ్యం కొనుక్కోలేదు. తన కుటుంబానికి అవసరమైన ఆహారం, కూరగాయలు ఆ మూడెకరాల్లోనే పండిస్తోంది. ఆమె కృషిని గుర్తించి, రైతు లోకానికి ఆమె ఆదర్శమని కొనియాడుతూ కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసింది. అప్పుడే ఆమె పేరు నలుగురికీ తెలిసింది. ఎలా సాధ్యమైంది?ఐదుగురు పిల్లలున్న పాపమ్మ బతకడానికి ఆ మూడెకరాలే ఆధారం. అందుకే దాన్నే నమ్ముకుంది. అందులో బావిని తవ్వించింది. అదే ఆ మూడెకరాలకు దిక్కు. వర్షపు నీరు ఒక్క చుక్క వృథా కాకుండా అందులోకి మళ్లించింది. ఇల్లు కూడా పొలంలోనే ఉండటంతో ఇంటి నుంచి వచ్చే వృథా నీరు కూడా పొలానికే మళ్లిస్తుంది. మూడెకరాల్లో ఒక ఎకరాలో వరి, మిగతా రెండు ఎకరాల్లో 30 రకాలు పంటలు పండించేది. వర్షాకాలంలో అయితే 40, 50 రకాల పంటలు పండిస్తుంది. మార్కెట్లో దొరకని కొన్ని రకాలు కూడా ఆమె దగ్గర దొరుకుతాయి. చివరకు విత్తనాలు కూడా ఆమె మార్కెట్లో కొనుక్కోదు. తాను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు తన పొలంలో పంటకు అవసరమైన అన్నిరకాల విత్తనాలను తాను పండించిన పంట నుంచే దాచుకుంటుంది. ఏ పంట మధ్య ఏ పంట బాగా పండుతుందో చెప్పడానికి ఏ పుస్తకమూ తిరగేయాల్సిన అవసరం లేదు. పాపమ్మకు అది నోటి మీద లెక్క.

సీడ్ బ్యాంక్

చాలాకాలం క్రితం రైతులు మరుసటి పంటకు విత్తనాలు దాచుకునే వారు. కానీ, పాపమ్మ ఇప్పటికీ ఆ పని చేస్తోంది. మళ్లీ పంట వేసే వరకు ఆ విత్తనాలు పాడవకుండా వేప, సీతాఫలం ఆకుల నుంచి తయారుచేసిన పొడితో వాటిని రక్షిస్తుంది. మామూలుగా మనకు రెండు రకాల వంకాయలు కనిపిస్తుంటాయి. ఆమె వద్ద ఐదు రకాల వంకాయల విత్తనాలు ఉంటాయి. ఇలా ప్రతి కూరగాయకు సంబంధించి ఆమె రెండు మూడు రకాల వెరైటీల విత్తనాలు దాచిపెట్టింది.నాలుగైదేళ్లయినా అవి పాడవకుండా కుండలో దాచిపెడుతుంది పాపమ్మ. పక్క ఊళ్లలో తిరిగి విత్తనాలు సేకరించే అలవాటు ఉండటం వల్ల ఆమె వద్ద అన్నిరకాల విత్తనాలూ ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంప్రదాయ విత్తనాలు కావాలంటే 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు నుంచి పాపమ్మ వద్దకే వస్తుంటారు. విదేశీ విత్తనాల దాడి నుంచి తప్పించుకోగలిగిన ఆమెను కర్ణాటక రాష్ట్రం ఆదర్శ రైతుగా ప్రకటించింది.

మందులేయని ఆహారమే!

సొంతంగా పండించుకోవడమే కాదు ఇప్పటివరకు పాపమ్మ తన పంటలకు అస్సలు మందులు వేయలేదు. సేంద్రీయ పద్ధతుల్లోనే పంట పండిస్తుంది. కేవలం తన వద్దనున్న ఆవులు, ఎనుముల నుంచి దానికి అవసరమైన ఎరువును సేకరిస్తుంది. ఆమె పంటలకు కీటకనాశని గోమూత్రమే. గ్రామంలో ఇతర రైతులు మందులు వాడి, హైబ్రిడ్ విత్తనాలు వాడినా ఆమెకంటే ఎక్కువ దిగుబడి సాధించలేకపోతున్నారు. దీంతో చివరకు ఊరంతా ఆమె మార్గంలో నడిచింది. ఆ ఊరి ప్రజలు మందులు వేయని ఆహారం తింటున్నారంటే అది పాపమ్మ పుణ్యమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Information for bangkok city
Mba student nathan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles