Italian village was forced to build an artificial sun

Italy, Italy,Rome, Lazio, Italy,Giacomo,Viganella,the baltimore sun,Hospitality Recreation,mirror

In 2006, an Italian village was forced to build an artificial Sun Between November 11 and February 2, the northern Italian village of Viganella is thrust into darkness. Because of.

Italian village was forced to build an artificial Sun.GIF

Posted: 03/27/2012 06:24 PM IST
Italian village was forced to build an artificial sun

Italian_village_was_forced_to_build_an_artificial_Sun

Italian-Village

చుట్టూ ఆవరించిన పర్వతాలు తమ శక్తిమేర ప్రయత్నిస్తూ భానుడి కిరణాలకు అడ్డుపడుతున్నాయి. దీంతో శతాబ్దాలుగా ఆ గ్రామానికి అంధకారమే మిగులుతోంది. సాధారణంగా ప్రకృతి సమస్యలను పరిష్కరించడం కష్టం. అందరూ అలాగే అనుకుని... మా ఊరింతే అని ఊరుకుండి పోయారు. అయితే అందరికీ భిన్నంగా ఆలోచించాడతను. సూర్యుడికి ఎదురు నిలిచాడు. ప్రకృతిని శాసించాడు. సూర్యుణ్ని అద్దంతో పట్టి ఊరికి లాక్కుని వచ్చాడు... గ్రామాన్ని వెలుగుతో నింపాడు. ఇప్పుడతను ఆ ఊరికి దేవుడు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు.

భూమి కొంత వాలి తిరుగుతున్న కారణంగా సూర్యుడు భూ కక్ష్య మారి ఏటా మూడునెలలు ‘విగనెల’ ఊరికి రాడు. దీంతో ఆ కాలమంతా ఊరు అంధకారంలో ఉంటుంది. శతాబ్దాలుగా పరిష్కారం కాని ఈ ప్రకృతి సమస్యను తన తెలివితేటలతో అధిగమించాడు ‘పియర్ ఫ్రాన్స్‌స్కో మిడలి’. వంద మంది జనాభా ఉన్న ‘విగనెల’కు అతను మేయర్. వందమంది ఉన్న గ్రామానికి మేయర్ ఏమిటా అన్న మీ అనుమానానికి సమాధానముంది. సంవత్స రంలో మూడు నెలలు మాత్రమే ఆ ఊరి జనాభా వంద. మిగతా తొమ్మిది నెలలు ఆ సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇక ఆ అద్భుత ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చే పర్యాట కుల సంఖ్య లెక్కపెడితే తేలేది లక్షల్లోనే! నవంబరు రెండో వారం నుంచి ఫిబ్రవరి వరకు సూర్యుడు మొహం చాటేయడంతో ఆ ఊరి ఉనికే ప్రమాదంలో పడుతూ వచ్చింది. సూర్యరశ్మి లేకుండా జీవించడం కష్టం. దీంతో ఆ కాలమంతా అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్తారు.

నవంబర్ రెండో వారానికల్లా మిగిలేది ఏ వందమందో! మళ్లీ ఫిబ్రవరి తొలి వారానికల్లా అందరూ తిరిగి వచ్చే స్తారు. ఇటలీలో నాగరికత ఏర్పడి, ఆల్ఫ్స్‌ లో మనుషులు ఆవాసం ఏర్పరచు కొన్నప్పటి నుంచి ‘విగనెల’లో ఉన్న సమస్య ఇది. ఇరవై ఒకటో శతాబ్దం ప్రారంభంలో విగనెలకు మేయర్‌గా ఎన్నికైన పియర్ ఏదోలా ఊరిని సూర్య కిరణాలు తాకేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సూర్యుడు ఉదయించే, అస్తమించే దిశల గ్రాఫులను వేసుకొని ఆలోచిస్తే ఓ మంచి ఆలోచన తట్టింది. దాన్ని విన్న వాళ్లు అసాధ్యమన్నారు, కొందరు ఆశ్చర్యాన్ని ప్రకటించారు, ఒక ఆర్కి టెక్చర్‌కు ఈ ఆలోచన చెబితే ‘పద...కొండకు ఒక వెంట్రుక వేద్దాం’ అని పని ప్రారంభించాడు.

గ్రామానికి ఒక వైపు వాలుగా ఉన్న పర్వతంపై 870 మీటర్ల ఎత్తులో, 40 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, ఎనిమిది మీటర్ల వెడల్పుతో, ఐదు మీటర్ల ఎత్తుతో ఉన్న ఒక అద్దాన్ని ఏర్పాటు చేస్తారు. ఎదురు పర్వతం వైపు నుంచి ఏటవాలుగా పడే సూర్యకిరణాలు ఆ అద్దాన్ని తాకు తాయి. అప్పుడు వాటి ప్రతిబింబం లోయలో ఉన్న గ్రామాన్ని తాకుతుందన్న మాట! ఇదీ ఆ మేయర్ ఆలోచన. 2006లో అతడికి వచ్చి, అమలు పెట్టిన ఆలోచన. ఎంతో అభివృద్ధి చెందిన ఈ యూరో పియన్ దేశంలో ఈ ‘సన్‌మిర్రర్’ అంత వరకూ కనీవినీ ఎరగని అబ్బురంలా నిలిచింది. గికోమి బొన్‌జానీ అనే ఆర్కిటెక్చర్ పియర్ ఆలోచనకు ఒక రూపం కల్పించాడు. ఐదేళ్ల కిందట వారు చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం విగనెలకు సంవత్సరంలో ఏ దశలోనూ సూర్యకాంతి ఇబ్బందులు లేవు! సన్‌మిర్రర్ ప్రతిబింబ వెలుగుతో వారికి తెల్లవారుతోంది! ఏట వాలుగా పడే సూర్యకిరణాలను అనుసరించి మిర్రర్ యాంగిల్ దానంతట అదే మార్చు కుని సూర్య కిరణాల వెలుగు ఊరిపై ప్రస రించేలా దీనికి ప్రోగ్రామింగ్ ఇచ్చారు. ఈ సన్ మిర్రర్ ప్రాజెక్టు కోసం లక్ష యూరోలు ఖర్చు పెట్టారు. కానీ దాంతో తమ గ్రామం పొందుతున్న సౌలభ్యానికి వెలకట్టడం సాధ్యం కాదని ఆ గ్రామస్తులంటారు. ఇదంతా తమ మేయర్ ఘనతేనని, శతాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపిన వ్యక్తిగా మేయర్ పియర్ తమకు ఆరాధ్యుడని వారు అంటున్నారు.

సూర్య కిరణాలు తాకని అంధకారంలో ఆశా కిరణంలా గ్రామానికి వెలుగు ప్రసరింపజేసిన పియర్ మాత్రం ఇందులో తన ఘనత ఏమీ లేదన్నట్టుగా చిరునవ్వు నవ్వుతారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు అంటే ఇలాంటి వాళ్లను చూసే! ఈ ప్రపంచంలో కష్టమైన పనులున్నాయేమో గానీ అసాధ్యమైన పనులేవీ లేవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mba student nathan
Not just bricks on the wall  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles