Not just bricks on the wall

Mark Twain,Preeti and Kabir Vajpeyi,outfit Viny?s,,Building as Learning Aid,NGOs,Sarva Shiksha Abhiyan

With writable surfaces on the walls and clocks that have movable hands, Delhi-based outfit Vinyãs is changing the face of schools in India to facilitate better learning.

Not just bricks on the wall.gif

Posted: 03/22/2012 01:39 PM IST
Not just bricks on the wall

Kabir-Vajpeyi_3

Kabeerస్కూల్ బిల్డింగ్ అంటే నాలుగు గోడలు. వాటిపైన ఓ కప్పు. గోడకి నల్లబల్ల. శతాబ్దాలుగా ఇదే పరిస్థితి. భవన నిర్మాణంలో కొత్తదనం లేదు. చదువు చెప్పేతీరులోనూ మార్పు కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్ బిల్డింగ్ నే ఓ చదువు నేర్పించే పరికరంగా నిర్మించి విద్యాబోధనలో వినూత్న మార్పులు తెస్తోంది విన్యాస్ సంస్థ.

ఢిల్లీకి చెందిన కబీర్ వాజ్ పేయి ఓ సివిల్ కాంట్రాక్టర్. ఈయనకు చెందిన విన్యాస్ సంస్థ స్కూల్ భవనాలను నిర్మిస్తుంది. కబీర్ 1994లో రాజస్థాన్ లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించే కాంట్రాక్టు పొందారు. ఆ సమయంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఒక ఫజిల్ ని ఇచ్చి తరగతి గది ఫ్లోరింగ్ పైన పెట్టాలను సూచించాడు. ఆ ఫజిల్ ను ఏర్పాటు చేయగానే భవన నిర్మాణంలో కబీర్ వాజ్ పేయి కి కొత్తదనం కనిపించింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ఆ మార్పు నచ్చింది. అప్పటి నుండి కబీర్ స్కూల్ భవనాల నిర్మాణమంటే కేవలం ఇటుకలతో పూర్తిచేయడం లేదు. భిన్నాలు నేర్పుకోవడానికి వీలుగా కిటికీ ఊచల్ని ఒక ప్రత్యేక ఛదరాలు, అండాకారాల వంటివి దాదాపు 150 రకాల వినూత్న ఆలోచనలు జోడించాడు.

పదేళ్ళ క్రిందట న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ తో ఒప్పందం కుదుర్చుకొని ఈ విధమైన నిర్మాణాలకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది విన్యాస్. అందులో భాగంగా మొదట 10 స్కూళ్ళను వీరు వినూత్నంగా తీర్చిదిద్దారు. దాంతో ఆ స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాదు, పాఠాలు నేర్చుకోవడమూ సులభమైందని గుర్తించారు. ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని స్కూళ్ళలో ఈ మార్పుల్ని చేసే కాంట్రాక్టునిచ్చింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ నుండి తమిళనాడు వరకూ అనేక రాష్ట్రప్రభుత్వాలు సర్వ శిక్ష అభియాన్ లో భాగంగా ‘విన్యాస్’ కి భవన నిర్మాణ పనులు అప్పగించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ ఇంజనీర్లకు పాఠశాలల నిర్మాణంలో శిక్షణ ఇచ్చారు. వీరు చేసే ప్రాజెక్టులు ఒకటి నుండి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఉధ్దేశించి ఉంటాయి.
బ్లాక్ బోర్డు.... తరగతి గదిలో ఒకవైపు టీచర్ కి అనుకూలంగా బోర్డు ఉంటే మరో వైపున విద్యార్థులు కూడా రాయడానికి తగినంత ఎత్తుల్లో బోర్డులు, క్యాలెండర్లు ఏర్పాటు చేశారు. నెలలు, వారాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే విధంగా వివిధ రంగుల్లో అందంగా తీర్చిదిద్దారు. పరీక్షలు, అసైన్ మెంట్ లు ఇతర వివరాల్ని తేదీల ప్రక్కనే ఉండే గళ్ళలో రాసుకునేందుకు వీలుగా క్యాలెండర్లను రూపొందించారు.

కొలతలు.. విద్యార్థులకు ఎంతో కష్టమైన అంశం. ఎందుకంటే ఎనిమిదేళ్ళప్పుడు నిజజీవితంలో కొలిచే అవకాశం రాదు. కానీ కబీర్ విద్యార్ధులKabir-Vajpeyi2 బెంచీల పైనే స్కేలు ఏర్పాటు చేశాడు. దీని ద్వారా పుస్తకాలు, పెన్ను, పెన్సిళ్ళ పొడవులు సరదాగా కొలుస్తూనే విషయాల్ని త్వరగా అర్థం చేసుకునే వీలుంటుంది. కొలతల పాఠం సులభంగా అర్థం అవుతుంది. ఎత్తును కొలిచే స్కేలు కూడా తరగతి గోడ మీద ఏర్పాటు చేస్తారు. బెంచీ, కుర్చీల బరువుల వివరాలూ వాటి పైనే రాసి పెడతారు.

కోణాలు... తెలుసుకోవడానికి రంగుల గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్లపైన ఇంద్రధనస్సులోని రంగుల్ని అదే వరుసలో వేస్తారు. ఫ్యాన్ తిరిగినప్పుడు మాత్రం ప్రాథమిక రంగులైన నీలం, ఎరుపు, ఆకుపచ్చ మాత్రమే కనిపిస్తాయి. రంగుల పాఠం ఇప్పుడు ఎంతో సులభం. టైమ్ గురించి నేర్చుకోవడానికి వీలుగా గోడపైన పెద్ద గడియారాన్ని ఏర్పాటు చేస్తారు. దానిలో ముళ్ళను మార్చుకోవడానికి వీలుంటుంది. ఇక గది గచ్చుపైన గళ్ళు గీసి ఉంచుతారు. దీని పైన సరిసంఖ్యలు, బేసి సంఖ్యలు  గుర్తించడం రాయడం చేయవచ్చు.

Kabir-Vajpeyi‘పట్టణ ప్రాంత విద్యార్థులతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల వారు చదువులో వెనుకబడి ఉన్నారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కోటి ముప్పై లక్షల స్కూల్ భవనాలు ఉన్నాయి. భవనాలనే భోధనా పరికరంగా మార్చితే విద్యార్థుల చదువులు ఎంతో మెరుగుపడతాయి అంటారు కబీర్. తనను స్కూల్ పిల్లాడిగా ఊహించుకొని వారి కష్టాలకు పరిష్కారాలు కనుక్కుంటాడాయన. కుర్చీ, బెంచీల పైన వాటి బరువు, పొడవుల వివరాలు రాసి ఉంచితే వాటిని చూసినా, పట్టుకొని ఎత్తినా వారికి కొలతలూ, బరువుల మీద ఒక అవగాహన వస్తుంది.

విన్యాస్ నిర్మించిన పాఠశాలల్లో విద్యార్థులకు చదువంటే భారం కాదు, ఆటా పాటా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Italian village was forced to build an artificial sun
World richest village huaxi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles