the biography of bal thackeray was an indian politician | hindu hruday samraat | shiv sena party updates

Bal thackeray biography who named as hindu hruday samraat by his followers

bal thackeray biography, bal thackeray life history, bal thackeray updates, bal thackeray wikipedia, bal thackeray special story, bal thackeray political career, bal thackeray shiv sena party, marathi people, hindu hruday samraat

bal thackeray biography who named as Hindu Hruday Samraat by his followers : the biography of bal thackeray was an indian politician who founded the Shiv Sena, a right-wing Marathi ethnocentric party active mainly in the Western Indian state of Maharashtra. His followers called him the Hindu Hruday Samraat.

మరఠ్వాడా ప్రజల అభ్యుదయం కోసం పాటుపడ్డ ఉద్యమనేత

Posted: 11/17/2015 06:46 PM IST
Bal thackeray biography who named as hindu hruday samraat by his followers

మరఠ్వాడా ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం పాటుపడ్డ ప్రముఖ ఉద్యమనేత బాల్ థాకరే.. కేవలం మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. జర్నలిస్టు అయిన బాల్‌థాకరే.. 1950వ దశకంలో మరాఠీ మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డి మాండ్‌తో ప్రారంభమైన సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆనాడు ముంబైలో మహారాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించకలేకపోయిన ఆయన వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేయడమే కాదు.. మరాఠా ప్రజల హక్కు సాధనకై పోరాటం చేయడానికి ఓ పార్టీని స్థాపించాడు. అలా మరాఠీలకు ఆయన ఆరాధ్యదైవంగా మారిపోయాడు.

జీవిత విశేషాలు :

1923 జనవరి 23వ తేదీన ఫునేలో బాల్ థాకరే జన్మించారు. ఉన్నత చదువులు అభ్యసించిన ఆయన.. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. 1950లో రాజకీయ వ్యంగ్యచిత్రకారుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఈయన.. 1960 నాటికి సొంత వారపత్రికను ప్రారంభించారు. ఆనాడు మహారాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించలేకపోయిన థాకరే.. వారికి వ్యతిరేకంగా కార్లూన్లు వేసేవారు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటుచేశారు. ‘మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే’ అనే ఉద్యమంలో భాగంగా ముంబాయిని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించారు.

అంతేకాదు.. హిందూత్వను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపర్చారు. జాతీయ రాజకీయాలలో బీజేపీతో జతకట్టి కీలకపాత్ర వహించారు. 1995లో మహారాష్ట్రలో ఆ శివసేన పార్టీ అధికారంలోకి వచ్చినా.. బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు, ఎన్నికలలో పోటీచేయలేదు. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించారు. మరాఠీ ప్రజల కోస ఎన్నో సేవలు అందించి వారి ఆరాధ్యదైవంగా మారిన బాల్ థాకరే.. 86 ఏళ్ల వయస్సులో 2012 నవంబర్ 17వ తేదీన తుదిశ్వాస విడిచారు. అభిమానులు ఆయనను ‘హిందూ హృదయ సామ్రాట్’ అని పిలుచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bal thackeray  hindu hruday samraat  

Other Articles