The Biography Of Guttikonda Narahari Who Is A Famous Political Analyst | Telugu Politics | Famous Persons

Guttikonda narahari biography political analyst telugu politics famous persons

Guttikonda Narahari history, Guttikonda Narahari story, Guttikonda Narahari biography, Guttikonda Narahari life story, Guttikonda Narahari wikipedia, Guttikonda Narahari telugu wiki, Guttikonda Narahari wiki in telugu, Guttikonda Narahari telugu biography, Political Analysts, Famous Persons

Guttikonda Narahari Biography Political Analyst Telugu Politics Famous Persons : The Biography Of Guttikonda Narahari Who Is A Famous Political Analyst. He Is Also A Good Writer.

రాజకీయరంగంలో అసమాన వక్తగా పేరగాంచిన విశ్లేషకుడు

Posted: 08/11/2015 06:12 PM IST
Guttikonda narahari biography political analyst telugu politics famous persons

తెలుగు రాజకీయరంగంలో విశేషంగా రాణించిన విశ్లేషకుల్లో గుత్తికొండ నరహరి ఒకరు. 1946 ఎన్నికల సమయంలో నరహరి యువతను ఉద్దేశించి.. పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదుర్కొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. రాజకీయం అంటే ఏమిటన్న విషయాన్ని తన ప్రతిభతో అందరికీ తెలియజేశాడు. ఇలా ఈ విధంగా రాజకీయరంగంలో అసమాన వక్తగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈయన రచయిత, సంపాదకులు కూడా.

జీవిత విశేషాలు :

1918 ఆగస్టు 10వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రు గ్రామంలో ఆంజనేయుడు, రాఘవమ్మ దంపతులకు గుత్తికొండ నరహరి జన్మించాడు. గ్రామానికి సమీపంలో వుండే తురుమెళ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసం కొనసాగించాడు. ఈయన ఎంతో చురుకైనవాడు. కాలేజీలో చేరకుండానే బర్మాలోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గుంటూరు ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బి.ఎ. పూర్తి చేశాడు. అనంతరం మద్రాస్ లో న్యాయశాస్త్రంలో చేరాడు. అయితే.. ఈ సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాలవైపు మళ్లడంతో ఆ న్యాయశాస్త్రాన్ని మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో ‘నవ్య మానవవాద రాష్ట్ర పార్టి’ కార్యదర్శి అయ్యాడు. 1944లో గూడవల్లిలో, తన మేనమామ కూతురు సరోజినితో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం లౌకిక పద్ధతిలో జరిగింది.

రాజకీయ జీవితం :

‘నవ్య మానవవాద రాష్ట్ర పార్టి’ కార్యదర్శిగా కొనసాగుతున్న నరహరి.. 1946 ఎన్నికలలో యువతను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘పదవులకు రాజీనామాలు చేయడండి.. స్వాతంత్ర్యం రానుంది కాబట్టి, పదవులను రాజీనామా చేస్తే ఆ తర్వాత ఉన్నత పదవులు వస్తాయి’ అని బోధన చేశాడు. అంతేకాదు.. రాడికల్ రాజకీయాలలో కమ్మూనిస్ట్, కాంగ్రెస్ వర్గాలను సమర్థవంతంగా ఎదుర్కొని.. తన ధారాళ ఉపన్యాసాలతో ప్రజల్ని ఆకట్టుకున్నాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. 1972లో ‘క్షాత్ర ధర్మ పరిషత్’ అనే రాజకీయ పార్టీ పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. ఆనాడు మధ్యలోనే వదిలేసిన న్యాయశాస్త్రాన్ని (లా) పూర్తి చేసి, 1974లో హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేశాడు.

మరిన్ని విశేషాలు :

* గుంటూరులో పొగాకు కంపెనీ పెట్టి వ్యాపారం చేశాడు. అయితే ఆ వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభను రచనలకు వినియోగించాడు. పొగాకు వాణిజ్యం కోసం కంపెనీల ఆర్డర్లు పొందడానికి ఆనాడు జపాన్ వెళ్ళాడు. ఆ తర్వాత అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్యపరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు రాశాడు.

* రాష్ట్ర రాడికల్ డెమొక్రాటిక్ పార్టి కార్య దర్శిగా మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేశాడు. ‘ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికల’లో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. ఈయన 1985 మార్చి 27న తుదిశ్వాస విడిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guttikonda Narahari  Telugu Political Analysts  Famous Persons  

Other Articles