The Biography Of Iyyanki Venkata Ramanayya Who Was Know As Architect of the free Public Library Movement In India

Iyyanki venkata ramanayya biography architect of the free public library movement

Iyyanki Venkata Ramanayya, Iyyanki Venkata Ramanayya history, Iyyanki Venkata Ramanayya biography, Iyyanki Venkata Ramanayya life story, famous telugu people, telugu literatures, telugu gold medalists

Iyyanki Venkata Ramanayya Biography Architect of the free Public Library Movement : The Biography Of Iyyanki Venkata Ramanayya Who is recognised as the "Architect of Public Library Movement in India". He is the first Indian to be awarded the Kaula Gold Medal.

‘గ్రంథాలయ పితామహుడు’గా పేరుగాంచిన అయ్యంకి

Posted: 08/08/2015 04:24 PM IST
Iyyanki venkata ramanayya biography architect of the free public library movement

‘ప్రజల్లో చైతన్యం నింపాలంటే సమాజానికి సంబంధించిన సమగ్ర సమాచారం వారికి తెలియాలి. ఆ సమాచారం వారికి చేరవేయాలంటే పత్రికలు, గ్రంథాలయాలే సులభమైన మార్గం’ అని ఆలోచించిన గొప్ప వ్యక్తి అయ్యంకి వెంకట రమణయ్య. ఆ ఆలోచన రావడమే ఆలస్యం.. ఆ దిశగా ఆయన అడుగులు వేశారు. ప్రముఖ పత్రికా సంపాదకుడు అయిన ఈయన.. గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి చేశారు. అందుకే.. ఈయనకు ‘గ్రంథాలయ పితామహుడు’ అనే పేరు లభించింది.

జీవిత విశేషాలు :

1890 ఆగష్టు 7వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కొంకుదురు గ్రామంలో వెంకటరత్నం, మంగమాంబ దంపతులకు వెంకటరమణయ్య జన్మించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ ని ఆదర్శంగా తీసుకొన్న ఈయన.. అప్పటినుంచి ప్రజాసేవవైపు అడుగిడినారు. 1910లో బందరులో ‘ఆంధ్ర సాహిత్య పత్రిక’ ను స్థాపించి... గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ వంటి గొప్ప రచయిత రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రధమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు.

1919 నవంబరు 14వ తేదీన చెన్నైలో తొలి ‘అఖిలభారత పౌర గ్రంథాలయం’ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును 1968 నుండి ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం’గా జరుపుకొంటున్నారు. 1934-48 మధ్యకాలంలో కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972లో ‘పద్మశ్రీ పురస్కారం’ అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించిన ఈయన.. అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, ‘ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం’ అని చాటి చెప్పారు. ఇలా ఈ విధంగా తన జీవితం మొత్తం గ్రంథాలయ ఉద్యమానికే కృషి చేసిన ఈయన.. 1979 మార్చ్ 7వ తేదీన పరమపదించారు.

గ్రంథాలయోద్యమం :

1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ‘ఇండియన్ లైబ్రరీ జర్నల్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. 1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను ఈయన నిర్వహించడంతోనే కొన్ని వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Iyyanki Venkata Ramanayya  Libraby Movement  

Other Articles