The Biography Of Puchalapalli Sundarayya A Member of Communist Party and Called as Telangana Rebellion

Puchalapalli sundarayya biogaphy communist party peasant revolt telangana rebellion

Puchalapalli Sundarayya History, Puchalapalli Sundarayya biography, Puchalapalli Sundarayya life story, Puchalapalli Sundaraiah wikipedia, Puchalapalli Sundarayya updates, telangana rebellions, indian freedom fighters

Puchalapalli Sundarayya biogaphy Communist Party peasant revolt Telangana Rebellion : The Biography Of Puchalapalli Sundarayya was a founding member of the Communist Party of India and a leader of the peasant revolt in the former Hyderabad State of India, called the Telangana Rebellion. He is popularly known as Comrade PS.

‘కమ్యూనిస్టు గాంధీ’గా పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుడు

Posted: 05/12/2015 08:35 PM IST
Puchalapalli sundarayya biogaphy communist party peasant revolt telangana rebellion

తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడైన పుచ్చలపల్లి సుందరయ్య.. ‘కమ్యూనిస్టు గాంధీ’గా పేరొందారు. అంతేకాదు.. బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశానికి స్వాతంత్ర్య కల్పించడంలోనూ తనవంతు కృషి చేశారు. గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడైన ఈయన.. 1930లో తన 17వ యేట హైస్కూలు రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ‘సైమన్ కమిషన్’ వ్యతిరేక ప్రదర్శనలలోను, ‘ఉప్పు సత్యాగ్రహం’లోను, సహాయ నిరాకరణోద్యమంలోనూ పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు.

అంతేకాదు.. నిజాం పాలన కాలంలో సాగిన ‘తెలంగాణా సాయుధ పోరాటానికి’ ముఖ్యమైన నాయకుల్లో సుందరయ్య ఒకరు. ఆనాడు నిజాం పాలకులు ప్రవేశపెట్టిన ప్రణాళికలు తెలంగాణ రైతులకు ఇబ్బంది కలిగేవిధంగా వుండగా.. అందుకు వ్యతిరేకంగా ఈయన పోరాటం కొనసాగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రజాసేవ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప వీరుల్లో ఈయన ఒకరు! ప్రజాసేవ కోసం బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని.. పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న గొప్ప వ్యక్తి!

జీవిత చరిత్ర :

1913 మే 1వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో సుందరయ్య జన్మించారు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. సుందరయ్య ఆరేళ్ళ వయసులో వుండగానే ఆయన తండ్రి మరణించారు. ఈయన తన ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేశారు. తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసులలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

రాజకీయాలు - కమ్యూనిస్టు పార్టీ :

బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశానికి స్వాతంత్ర్యం కలిగించడంలో భాగంగా గాంధీజీ చేపట్టిన ప్రణాళికలు, ఆయన నాయకత్వం పట్ల సుందరయ్య ఆకర్షితుడయ్యారు. దీంతో ఆయన కూడా తన 17వ ఏటలోనే 1930లో హైస్కూలు రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. అలాగే ‘సైమన్ కమిషన్’ చేపట్టిన వ్యతిరేక ప్రదర్శనలలోను, ‘ఉప్పు సత్యాగ్రహం’లోను, ‘సహాయ నిరాకరణోద్యమం’లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు. నిజామాబాద్ బోర్స్టల్ స్కూలు‌లో బందీగా వుంచిన ఈయనకు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది.

జైలు నుంచి విడుదల అయిన అనంతరం తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశారు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తరువాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను సెంట్రల్ కమిటీ సుందరయ్యకు అప్పగించింది. ఆ బాధ్యతలకనుగుణంగా ఈయన తన ప్రణాళికలను చేపట్టారు. మొదట ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ఈయన ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చారు. 1936లో అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించిన వారిలో సుందరయ్య ఒకరు. ఆ సభకు సంయుక్త కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యారు.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు 1939 నుండి 1942 వరకు (నాలుగేళ్ళు) అజ్ఞాతంలోనే సుందరయ్యకు గడపాల్సి వచ్చింది. అయితే 1943లో నిషేధం ఎత్తివేశారు. బొంబాయిలో మొదటి పార్టీ కాంగ్రెస్, తరువాత రెండవ పార్టీ కలకత్తాలో జరగగా.. రెండుసార్లు కేంద్ర కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యారు. కలకత్తా సమావేశంలో పార్టీ సాయుధ పోరాటంను సమర్ధిస్తూ తీర్మానం చేసింది. దీనిని ‘కలకత్తా థీసిస్’ అంటారు. అప్పటి సాధారణ కారదర్శి ఈ తీర్మానాన్ని బలంగా సమర్ధించారు. త్రిపుర, తెలంగాణా, తిరువాన్కురు ప్రాంతాలలో సాయుధ పోరాటాలు జరిగాయి. వీటిలో అత్యంత ముఖ్యమైంది ‘తెలంగాణా సాయుధ పోరాటం’.

మరికొన్ని విశేషాలు :

1952 లో సుందరయ్య మద్రాసు నియోజక వర్గం నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యారు. తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 1967 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగారు. మళ్ళీ కొంత కాలం విరామం తరువాత 1978లో శాసన సభకు ఎన్నికయ్యారు. 1983 వరకు శాసన సభ సభ్యునిగానే వున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఈయన 1985 మే 19వ తేదీన మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puchalapalli Sundarayya  Indian Freedom Fighters  Telangana Rebellion  

Other Articles