Ghantasala venkateswara rao biography famous telugu singer south indian film industry

Ghantasala Venkateswara Rao, Ghantasala Venkateswara Rao latest news, Ghantasala Venkateswara Rao wikipedia, Ghantasala Venkateswara Rao photos, Ghantasala Venkateswara Rao history, Ghantasala Venkateswara Rao story, Ghantasala Venkateswara Rao life story, Ghantasala Venkateswara Rao

Ghantasala Venkateswara Rao biography famous telugu singer south indian film industry

తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడైన ఘంటసాల!

Posted: 12/04/2014 03:34 PM IST
Ghantasala venkateswara rao biography famous telugu singer south indian film industry

తెలుగుసినిమా రంగంలో తన మధురగానంతో ఎందరో ప్రేక్షకులను మైమరిచిన ఘంటసాల వెంకటేశ్వరరావు.. ఇండస్ట్రీలో గాయకుడిగా ప్రత్యేక ప్రస్థానం ఏర్పరుచుకున్నారు. పుట్టుకతోనే గంభీరమైన స్వరాన్ని కలిగిన ఈయన.. శాస్త్రీయ, తెలుగుసినీ సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణాకాలంలో తన స్వరంతో గురువుల్ని ముగ్ధుల్ని చేసిన ఆయన.. అనంతరం ఇండస్ట్రీలో అదేవిధంగా ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈయన పాడిన ఆధ్యాత్మిక సంగీతాలు అత్యంత ప్రజాదరణ పొందింది.

జీవిత విశేషాలు :

1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు ఘంటసాల జన్మించారు. తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. సంగీత సభాస్థలికి వెళ్లే సమయంలో ఆయన తనతోబాటు తన కుమారుడు ఘంటసాలను కూడా తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన భజనలు వింటూ, పాటలు పాడుతూ, నాట్యం చేసేవారు. అప్పుడు ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అప్పట్లో ‘బాలభరతుడు’ అని పిలిచేవారు. ఇలావుండగా.. ఘంటసాల 11వ ఏటలో ఆయన తండ్రి మరణించారు. అయితే మరణానికి కొన్నిరోజులముందు సంగీత గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి, గొప్ప సంగీత విద్వాంసుడిగా అవమని కోరారు.

సంగీత సాధనలో ఘంటసాల ఎదుర్కొన్న అనుభవాలు :

తండ్రి కోరిక మేరకు సంగీతంలో గొప్పపేరు సాధించేందుకు ఆయన అహర్నిశలు ప్రయత్నాలు చేశారు. మొదట ఆయన సగీత గురుకులాలో చేరారు కానీ.. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. అనంతరం ఒకసారి గ్రామంలో కచేరీలో విద్వాంసులతో పోటీపడి నవ్వులపాలయ్యాడు. దాంతో సంగీతం నేర్చుకోవాలన్న కసి ఆయనలో మరింతగా పెరిగింది. అప్పుడతడు తనకు తెలిసిన కొందరి విద్వాంసుల ఇళ్లలో పనిచేసి, వారిదగ్గరే సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. ఇలా రెండేళ్లపాటు ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొని చేయాల్సి వచ్చింది.

తర్వాత ఆయన ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు. అందులో శిక్షణ పొందుతున్న కాలంలో తోటివిద్యార్థులు చేసిన తప్పిదాలవల్ల ఆయనను కళాశాల నుంచి బహిష్కరించారు. అదితెలిసి ఆయనకు చేయూతనిచ్చిన కుటుంబసభ్యులు కూడా తమ ఇళ్లక రావొద్దని చెప్పేశారు. దీంతో గత్యంతరంలేక ఆ ఊరిలో వుండే గుడిలో తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి అనే ప్రముఖ వ్యక్తి.. ఘంటసాల గురించి మొత్తం విషయాలు తెలుసుకుని ఆయనకు తన ఇంట్లోనే ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. అలా ఆయన ఇచ్చిన సహాయంతోనే నేడు ఈ స్థానానికి చేరుకోగలిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles