Babu rajendra prasad biography first president of india indian freedom fighter

babu rajendra prasad, babu rajendra prasad news, babu rajendra prasad latest news, babu rajendra prasad biography, babu rajendra prasad life history, babu rajendra prasad story, babu rajendra prasad history in telugu, babu rajendra prasad wiki in telugu, babu rajendra prasad wikipedia, babu rajendra prasad photos, indian freedom fighters, first president of india, indian president, president of india list, telugu news

babu rajendra prasad biography first president of india indian freedom fighter

దేశపు మొదటి రాష్ట్రపతిగా పదవీ చేపట్టిన సమరయోధుడు

Posted: 12/03/2014 01:41 PM IST
Babu rajendra prasad biography first president of india indian freedom fighter

బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశస్వాతంత్య్రంకోసం పోరాడిన సమయోధుల్లో ‘‘బాబూ రాజేంద్ర ప్రసాద్’’ ఒకరు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా నిర్వహించిన ఎన్నో ఉద్యమాల్లో, నినాదాల్లో ఈయన ప్రత్యేకపాత్రను పోషించాడు. స్వాతంత్ర్యంపట్ల ప్రజల్లో చైతన్యం కల్పించిన ఈయన.. ఒక ముఖ్యనాయకుడిగా ఎదిగాడు. ఈయన నాయకత్వాన్ని మెచ్చుకున్న ప్రజలు ప్రేమగా ‘బాబు’ అని పిలుచుకునేవారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గొప్ప పేరు సాధించిన ఈయన.. భారత రాజ్యాంగంలోనూ కీలకపాత్రను పోషించారు. దేశపు మొదటి ప్రభుత్వంలో కొన్నాళ్లపాటు కేంద్రమంత్రిగా కొనసాగిన ఈయన.. మొట్టమొదటి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

జీవిత విశేషాలు :

1884 డిసెంబరు 3వ తేదీన బీహార్ రాష్ట్రం, శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో మహదేవ్ సహాయ్ - కమలేశ్వరీ దేవి దంపతులకు జన్మించారు. ఐదవ ఏటలో పర్షియన్ భాష నేర్చుకున్న ఈయన.. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 12 ఏటలోనే రాజ్‌వంశీ దేవీతో వివాహం జరిగింది. అనంతరం పాట్నాలో ఉన్నత విద్యను అభ్యసించారు. కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడే ఆయన కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.

మొదట సైన్యు విద్యార్థిగా కొనసాగిన ఈయన.. తర్వాత సాంఘికశాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. ఆర్థికశాస్త్రంలో ఎం.ఎ. చదివిన అనంతరం, బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు. ఆయన చదువుతున్నకాలంలో తన అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు. దాంతో ఆయన 1911లో కాంగ్రెసులో చేరాడు. ఆ సమయంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు ఆయన ప్రత్నించాడు కానీ.. అప్పుడు కుటుంబపరిస్థితులు బాగులేకపోవడం వల్ల 1916లో బీహార్, ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో న్యాయవాదిగా చేరాడు.

స్వాతంత్ర్య సమరంలో బాబూ పాత్ర :

న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. కొన్నికాలాలకే స్వాతంత్ర్యం పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు. 1921లో మహాత్మా గాంధీతో ఒకసారి సమావేశం జరిగిన తర్వాత ఆయన విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు. పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్‌లో చేర్చాడు.  1924లో బీహారు, బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను తనవంతు సహాయాన్ని అందించాడు. అలాగే 1934 జనవరి 15వ తేదీన బీహార్’లో భూకంపం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన జైలులో వున్నాడు. విడుదలైన అనంతరం బాధితులకోసం ఆయన నిధులు సేకరించగా.. భారీస్థాయిలో ముట్టాయి.

1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు బాబూ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939, 1947లో కూడా ఆ పదవిలో కొనసాగారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన్ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అలా పదవీబాధ్యతలు చేపట్టిన ఆయన.. రాజ్యాంగ నిర్మాణంలో ప్రధానినిగానీ, పార్టీనిగానీ జోక్యం చేసుకోనివ్వలేదు. 12 సంవత్సరాలపాటు రాష్ట్రపతిగా సేవలందించిన ఆయన.. 1962న పదవీ విరమణ చేసాడు. హిందీ, సంస్కృతం, ఉర్దూ,పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో పండితుడైన బాబూ.. ‘హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ, ఇండియా డివైడెడ్, ఆత్మకథ, ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా’ వంటి గ్రంథాలను రచించారు.

పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు ఆయన భార్య రాజ్‌వంశీ దేవి చనిపోయింది. అనంతరం ఆయన కూడా 1963 ఫిబ్రవరి 28న కన్నుమూశాడు. ఆనాడు ఆయన అందించిన సేవలకుగానూ ప్రజలు అభిమానంతో ‘దేశ్ రత్న’ అని పిలిచేవారు. అలాగే అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని ఆనాటి ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles