Ramineni ayyanna chowdary biography social worker businessman educator

ramineni ayyanna chowdary news, ramineni ayyanna chowdary photos, ramineni ayyanna chowdary history, ramineni ayyanna chowdary wikipedia, ramineni ayyanna chowdary social worker, ramineni ayyanna chowdary educator, ramineni ayyanna chowdary businessman, ramineni ayyanna chowdary biography, ramineni ayyanna chowdary latest news, ramineni ayyanna chowdary death day

ramineni ayyanna chowdary biography social worker businessman educator

సమాజంకోసం పాటుపడిన విద్యావేత్త ‘‘అయ్యన్న’’

Posted: 11/13/2014 03:58 PM IST
Ramineni ayyanna chowdary biography social worker businessman educator

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎందరో సంఘసేవకులు తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని లెక్కచేయకుండా ఎంతగానో పాటుపడ్డారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించి, సమాజానికి న్యాయం జరిగేలా నినాదాలు చేసిన ఎందరో మహానుభావులు వున్నారు. అలాకాకుండా తమకు సాధ్యమైనంతవరకు సమాజానికి మంచిచేసిన వాళ్లూవున్నారు. అటువంటివారిలో రామినేని అయ్యన్న చౌదరి ఒకరు. ఒక సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు,విద్యావేత్త.

జీవిత విశేషాలు :

1929 అక్టోబర్ 12న గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు గ్రామములో వీరయ్య చౌదరి, కన్యాకుమారి దంపతులకు రామినేని అయ్యన్న చౌదరి జన్మించారు. గుంటూరులోని విద్యాభ్యాసం పూర్తిచేసిన తర్వాత కాశీ హిందూ విశ్వవిద్యాలయంనుంచి గణితశాస్త్రంలో పట్టాపొందారు. అనంతరం తిరిగి గుంటూరుజిల్లా పాలపర్రు గ్రామంలో అధ్యాపకునిగా పనిచేశారు. విద్యమీద మమకారం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఆయన 1955లో అమెరికా వెళ్లి విత్తశాస్త్రములో ఎం.ఎస్సీ,  మిన్నసోటా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. 1963 - 1973ల మధ్య నార్త్ లాండ్ కళాశాలలో, జేవియర్ విశ్వవిద్యాలయములో అచార్య పదవి నిర్వహించి మంచి అధ్యాపకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే సమాజంలో జరుగుతున్న  అన్యాయాలను అరికట్టే భాగంలో ఆయన 1973లో పదవీ విరమణ చేసి సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని చివరి నిర్ణయానికి వచ్చారు.

సాంఘిక సేవలు :

జన్మభూమిపై వున్న మమకారముతో ఆయన బ్రాహ్మణకోడూరు గ్రామములో ‘‘సంగీత సాహిత్య, సంస్కృతీ హిందూ ధర్మనిలయం’’ స్థాపించారు. గ్రామములోని వ్యవసాయదారులకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన, శిక్షణ మొదలగు సేవాకార్యక్రమాలు చేశారు. హైదరాబాదులో హిందూస్తాన్ థెరప్యూటిక్స్ అను సంస్థను ప్రారంభించి రైతులకు పశువుల మందులు, మేత తయారు చేయించారు. 1999లో అయ్యన్న సంతానము ఆతని 70వ పుట్టినరోజున రామినేని ఫౌండేషన్ స్థాపించారు. దీని ముఖ్యోద్దేశములు అమెరికాలో, ఆంధ్ర రాష్ట్రములో సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి, పలు రంగములలో పేరొందిన వ్యక్తులను సన్మానించి తరువాయి తరముల వారికి ఉత్ప్రేరకముగా పనిచేయుట. మిన్నసోటా హిందూ సంఘము స్థాపించి హిందూ సంస్కృతి, కళలు, పండుగలు, సాంఘిక సేవా కార్యక్రమాలు జరిపారు.

వ్యక్తిగత జీవితం :

అయ్యన్న తండ్రి వీరయ్య వ్యవసాయదారుడు కాగా.. తల్లి లలితకు కళలయందు ఎక్కువ మక్కువ వుండేది. అయ్యన్న దంపతులకు ధర్మప్రచారక్, శారదాదేవి, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర అనే ఆరుగురు సంతానం. సమాజంకోసం తనవంతు సహాయాన్ని అందించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన అయ్యన్న.. 2000 ఏప్రిల్ 24వ తేదీన మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramineni ayyanna chowdary  telugu social workers  indian businessmen  telugu news  

Other Articles