Kopparapu kavulu biography koppara dynasty history

Kopparapu Kavulu, Kopparapu Kavulu news, Kopparapu Kavulu special news, Kopparapu Kavulu wikipedia, Kopparapu Kavulu life story, Kopparapu Kavulu life history, Kopparapu Kavulu biography, Kopparapu Kavulu story, Kopparapu Kavulu history, koppara dynasty, telugu news, telugu literatures, telugu poets

Kopparapu Kavulu biography koppara dynasty history

తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన సోదరకవులు

Posted: 11/12/2014 03:32 PM IST
Kopparapu kavulu biography koppara dynasty history

కొప్పరవంశంలో ప్రసిద్ధిచెందిన కవులలో కొప్పరపు వేంకటసుబ్బరాయకవి, కొప్పరపు వేంకటరమణకవి అనే ఇద్దరు సోదరులు ఎంతో ప్రసిద్ధిచెందారు. రామడుగు కృష్ణశాస్త్రి, పోతరాజు రామకవి లాంటి గొప్ప వ్యక్తులవద్ద శిక్షణ పొందిన వీరిద్దరు తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంటసోదరకవులుగా పేరుపొందారు. అసలు వీరి గొప్పతనం ఏమిటంటే... సోదరులిద్దరూ పదహారేళ్ల వయస్సు ఇంకా పూర్తిగా నిండకముందే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.

జీవిత చరిత్ర :

ఈ కొప్పరప సోదర కవులలో కొప్పరపు వేంకటసుబ్బరాయకవి (జ: 1885 నవంబరు 12 - మరణం: 1932 మార్చి 29) పెద్దవాడు కాగా..  కొప్పరపు వేంకటరమణ కవి (జ: 1887 డిసెంబరు 30 - 1942 మార్చి 21) చిన్నవాడు. వీళ్లిద్దరూ ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా కొప్పరం గ్రామంలో వెంకటరాయులు - సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. కొప్పరవంశం కవిత్వంతోనే ఎక్కువగా ముడిపడివున్న నేపథ్యంలో వీళ్లు కూడా ఆ విద్యనే తమ బాల్యంనుంచి పునికిపుచ్చుకున్నారు. అలా కవిత్వంలో విద్యాభ్యాసం ప్రారంభించినవాళ్లు.. కేవలం పదహారేళ్ల వయస్సులోనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి తమ కవితాప్రతిభను నిరూపించుకున్నారు. 1908 నుంచి మొదలుకొని అసంఖ్యాకంగా అష్టావధానాలు చేసి.. ‘‘కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు’’ అనే ఖ్యాతి పొందారు.

ఈ సోదరులిద్దరూ లక్కవరం, గద్వాల, చల్లపల్లి వంటి సంస్థానాల్లో 150 సభలలో పాల్గొని అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకాదరణను సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలిసి అల్వాలు లష్కరులో నిర్వహించిన మొదటి ఆశుకవిత్వ సభకు ఆదిరాజు తిరుమలరావు ముగ్ధులైపోయి వారిద్దరికీ ముంగాలి అందెను బహూకరించాడు. ఇక అప్పటినుంచి మొదలైన వారి ప్రయాణం బాగానే కొనసాగింది. ముఖ్యంగా వాళ్లు హైదరాబాద్ లో చేసిన శతావధానాలు ప్రఖ్యాతమైనవి. వీరిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే.. ఇద్దరు సోదరులు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. అప్పట్లో మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అరగంటలో ‘మనుచరిత్ర’ను ఆశువుగా చెప్పినట్లు వార్తలున్నాయి. వీరు ప్రదర్శించిన ప్రతిభకుగానూ ఎంతోమంది ప్రముఖకవులు మురిసిపోయి వారిని పొగడ్తలతో ముంచెత్తారు.

కొప్పర సోదరుల ప్రచురణలు :

మద్రాసు, గుంటూరు వంటి నగరంలో వీరిద్దరూ చేసిన సభల గురించి చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాదు... కాకినాడ సభల గురించి చేగంటి బాపిరాజు సేకరించి 1911 సంవత్సర ప్రాంతంలో ప్రచురించారు. 1963 సంవత్సరకాలంలో కుంటముక్కల జానకీరామశర్మ అనే ఆయన ఆ రెండు సంకలనాలతోపాటు మరికొన్ని అవధానాశు కవితాపద్యాలను కలిపి ‘‘కొప్పరపు కవుల యశోడిండిమ’’ అనే పేరుతో రెండు సంపుటాలుగా మకర సంక్రాంతి పర్వదినాన ప్రచురించారు. ఇక జీవితచరిత్ర విషయాల గురించి నిడదవోలు వెంకటరావు అనే ఆయన 1973 సంవత్సరంలో రచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kopparapu Kavulu  telugu poets  telugu literatures  telugu news  

Other Articles