Raghupathi venkaiah naidu biography who is the father telugu film industry

raghupathi venkaiah naidu news, raghupathi venkaiah naidu history, raghupathi venkaiah naidu life story, raghupathi venkaiah naidu movie life, raghupathi venkaiah naidu movies, raghupathi venkaiah naidu biography, raghupathi venkaiah naidu wiki, raghupathi venkaiah naidu updates, raghupathi venkaiah naidu father of telugu film industry, telugu film industry father raghupathi venkaiah naidu, raghupathi venkaiah naidu son prakash, raghupathi venkaiah naidu awards, indian film industry

raghupathi venkaiah naidu biography who is the father telugu film industry

తెలుగు చలనచిత్ర పితామహుడు ‘‘రఘుపతి వెంకయ్య’’

Posted: 10/15/2014 03:34 PM IST
Raghupathi venkaiah naidu biography who is the father telugu film industry

విశ్వవ్యాపితం అయిన తెలుగు సినిమాను అభివృద్ధి చేసిన వారు ఎందరో వున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ‘‘రఘుపతి వెంకయ్య’’. తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడిగా పేరు సాధించిన రఘుపతి వెంకయ్య గురించి ప్రస్తుతకాలంలో చాలా అంటే చాలామందికి తెలియదు. ఆనాడు చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయడంలో ఈయన ఎన్నో అవస్థలు, కష్టాలు - నష్టాలను ఎదుర్కొని.. చివరికి పట్టుబడి సాధించారు. అదే ఇతరులు ఈయన స్థానంలో వుంటే మాత్రం.. ఆ కష్ట-నష్టాలను భరించలేక ఎప్పుడో వెనుదిరిగేవారు. కానీ ఈయన మాత్రం అలా చేయలేదు... చిత్రపరిశ్రమ మీద వున్న మక్కువ ఈయనను తన లక్ష్యంవైపు తీసుకెళ్లింది. విశ్వవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో ఎంతోగానో తోడ్పడింది. చిత్రపరిశ్రమకు ఈయన అందించిన సేవలకుగాను ఈయనను ‘‘చలనచిత్ర రంగానికి పితామహుడి’’గా పేరొచ్చింది.

జీవిత చరిత్ర :

వెంకయ్యనాయుడు ఎప్పుడు, ఎక్కడ పుట్టారో ఖచ్చితంగా తెలియదు కానీ.. 1869 అక్టోబర్ 15న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించినట్లు కొన్ని కథనాలు వున్నాయి. ఈయన ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్. ఆ వృత్తిలో ఈయన ఎంత పేరు సంపాదించుకున్నాడంటే.. ఫోటో తీస్తే అతనే తీయాలన్నంతగా సాధించారు. 1886లో 17వ ఏట నుంచి వెంకయ్య ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన... ఎన్ని కష్ట - నష్టాలు వచ్చినా.. ఇతరుల నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా.. ప్రభుత్వాధికారుల నుంచి బలమైన ఒత్తిళ్లు వచ్చినా వెనుదిరగలేదు. తన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినప్పటికీ 1910లో 40 వేలు ఖరీదు చేసే ఒక ‘‘క్రోమో మెగాఫోను’’ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవారు.

1912లో మద్రాసులో ‘‘గెయిటీ’’ అనే సినిమా థియేటర్ నిర్మించారు. తరువాత ‘‘క్రౌన్, ‘‘గ్లోబ్’’ సినిమాహాళ్ళను కూడా నిర్మించారు. తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపారు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు ‘‘సిసిల్ బి డెమిల్లి’’ (Ceicil B.Demille)... 'టెన్ కమాండ్‌మెంట్స్'(Ten Comamndments) అనే చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.
ప్రకాష్ తిరిగి భారత్ కు వచ్చిన తరువాత దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ ‘‘Star of the East’’ను స్థాపించాడు. 1921లో ‘‘భీష్మప్రతిజ్ఞ’’ అనే మూగచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా అందులో భీష్ముని పాత్రను కూడా పోషించారు. ఆ చిత్రంలో ‘‘డి కాస్టెల్లో’’ (De Castello) అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది.

తరువాత ఈ తండ్రీకొడుకులు (రఘుపతి వెంకయ్య, ప్రకాష్) ‘‘మత్స్యావతార్, నందనార్, గజేంద్రమోక్షం’’ వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. అనంతరం ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు. అయితే కేవలం సినీపరిశ్రమకే తన జీవితం మొత్తాన్ని అంకితం చేసిన రఘుపతి... సినిమా నిర్మాణంలో, ఇతర వ్యవహారాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నారు. కానీ ఆ నేపథ్యంలో ఆ కష్టాలను పూడ్చేందుకు ఇతరుల నుంచి ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చిందట. దాంతో అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఆస్తి ఏమీ మిగలలేదని అంటారు. 1941లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 1980వ సంవత్సరములో రఘుపతి వెంకయ్య పేరు మీదుగా ఒక అవార్డును నెలకొల్పారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రధానం చేస్తారు. వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghupathi venkaiah naidu  telugu film industry  indian cinemas  nandi awards  

Other Articles