Apj abdul kalam biography

apj abdul kalam, apj abdul kalam news, apj abdul kalam birthday news, apj abdul kalam history, apj abdul kalam story, apj abdul kalam scientist, former president apj abdul kalam

apj abdul kalam biography who is the 11 president of india

అందరి తరాలకు ఆదర్శం.. అబ్దుల్ కలాం జీవితం!

Posted: 10/16/2014 06:14 PM IST
Apj abdul kalam biography

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం.. అణుపరీక్షల ద్వార భారత సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్పవ్యక్తి! ఈ అణు పరీక్షలే భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చడంలో ప్రధానపాత్రధారిగా నిలిచాయి. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ప్రధానసూత్రధారి కావడంతో ఆయనకు భారత దేశపు ‘‘మిస్సైల్ మాన్’’ అనే పేరు వచ్చింది. భారత దేశపు ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఇంజనీరు కూడా అయిన ఈయన.. మన భారతదేశ 11వ రాష్ట్రపతి! ఈయన పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్.

జీవిత విశేషాలు :

1931 అక్టోబర్ 13వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో అబ్దుల్ కలాం జన్మించారు. ఆయన తన స్కూలు జీవితం నుంచే న్యూస్ పేపర్లను పంపిణీ చేసే పని చేసేవారు. ఎన్నో సమస్యల నుంచి వచ్చిన ఆయన 1958లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగులో పట్టా పుచ్చుకున్నారు. తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ.లో చేరిన ఆయన... ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేశారు. అక్కడి నుంచి 1962లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రోకు మారారు. అక్కడ ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.

1982లో ఆయన DRDOకు డైరెక్టరుగా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. జూలై 1992లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. భారతదేశానికి ఆయన అందించిన సేవలకుగానూ దేశంలోనే అత్యున్నత పౌరపుస్కారాలు అయిన పద్మ భూషణ్ (1981లో), పద్మ విభూషణ్(1990ఃలో), మరియు భారత రత్న (1997లో)లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు పొందిన వ్యక్తి! జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై... జూలై 25న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : apj abdul kalam  indian presidents list  indian politics  

Other Articles