Vavilala gopala krishnaiah biography

vavilala gopala krishnaiah, vavilala gopala krishnaiah news, vavilala gopala krishnaiah birthday, vavilala gopala krishnaiah death day, vavilala gopala krishnaiah biography, vavilala gopala krishnaiah history, vavilala gopala krishnaiah stories, vavilala gopala krishnaiah gandhiji, vavilala gopala krishnaiah latest news

vavilala gopala krishnaiah biography who take part in indian freedom movement and become mla

గాంధేయసూత్రాలను పాటించిన కళాప్రపూర్ణుడు!

Posted: 09/18/2014 06:35 PM IST
Vavilala gopala krishnaiah biography

భారతదేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాని సందర్భంలో మన తెలుగురాష్ట్రాలకు చెందిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు వున్నారు. దేశస్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి, ఎనో కష్టాలను అనుభవిస్తూనే ప్రజల్లో చైతన్యం నింపిన కళాప్రపూర్ణులు కూడా ఎందరో వున్నారు. అటువంటివారిలో వావిలాల గోపాలకృష్ణయ్య కూడా ఒకరు. దేశ స్వాతంత్ర్యం మీద ప్రజల్లో చైతన్యం నింపిన కళాప్రపూర్ణుడు. పూర్తి గాంధేయవాది అయిన ఈయన.. ఆయన సూత్రాలనే పాటిస్తూ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. స్వాతంత్ర్యం అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా కూడా పనిచేశారు.

జీవిత చరిత్ర :

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నివాసం వున్న వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు 1906 సెప్టెంబర్ 17వ తేదీన నాలుగో సంతానంగా జన్మించారు. విద్యార్థి దశలోనే వున్నప్పుడు ఈయన దేశస్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే గాంధీ సూత్రాలను పాటిస్తూ.. స్వాతంత్ర్యం మీద ప్రజల్లో చైతన్యం నింపుతూ వచ్చారు. అంతేకాదు.. ఈయన రచనలు రాయడంలోనూ మంచి వక్త. దాంతో ఆయనకు బహుగ్రంథకర్త అనే పేరు కూడా వచ్చింది.

స్వాతంత్ర్యోద్యమంలో ఈయన పాత్ర :

భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి స్వరాజ్య భిక్ష పేరుతో బియ్యం, జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించారు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందేనంటూ గళం విప్పిన ఈయన.. సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మార్గాన్ని కనుగొన్నారు. 1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గురై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన 2003 ఏప్రిల్ 29న కన్ను మూశారు.

ఈయనకు లభించిన పదవులు, బిరుదులు :

1. అంధ్రా గాంధీ అని పిలిచే ఈయన సోషలిస్టు
2. 1974 - 77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా పని చేశాడు.
3. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
4. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
5. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు.
6. 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు.

రాసిన రచనలు :

1. 1922 లో తొలి రచన 'శివాజీ'
2. 1947 లో మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?
3. 1951 లో విశాలాంధ్రం
4. 1976-77 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vavilala gopala krishnaiah  independence day movement  mahatma gandhiji  

Other Articles