Ys rajasekhara reddy 4th death anniversary

YS Rajasekhara Reddy 4th death anniversary, YSR 4th Death Anniversary, Rajasekhara Reddy death, YSR death anniversary, Yuvajana Sramika Rythu Congress Party, YSRCP president Y S Jagan Mohan Reddy

YS Rajasekhara Reddy 4th death anniversary

మహానేతకు నాలుగేళ్లు ..

Posted: 09/02/2013 02:39 PM IST
Ys rajasekhara reddy 4th death anniversary

నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు... మన కళ్ల ముందునుంచి దూరమయ్యారు మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి. ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు. ఆ ప్రజల సంక్షేమం కోసం పరిగెత్తున్న సమయంలో పంచభూతలకు కన్నుకుట్టి. మహానేతను ప్రక్రుతిలో కలిపేసుకుంది. ప్రక్రుతిలో నెలకొరిగిన మహానాయకుడు ఇక లేడు అనే నిజం తెలిసి కోట్లాది మంది కన్నీటి పర్వతమైనారు. సెప్టెంబర్‌ 2, 2009 రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం. బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా హెలికాప్టర్‌. దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు. ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. కానీ ఆ హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాల గుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైలట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అంతా మరణించారు.

 

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాజశేఖర్‌ రెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూసింది. నాడు ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడులే అని జనం నమ్మారు. రాజన్న అంటేనే కొండంత అండ అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉచిత విద్యుత్‌ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఫించన్లిచ్చి ఎంతో మంది వృద్ధులకు పెద్ద కొడుకయ్యాడు. మహానేత పాలనలో ఎంతో ధైర్యంగా బతికారు బడుగు, బలహీనవర్గాల ప్రజలు.

 

అందుకే ఆ సంక్షేమ సారధి పదికాలాలు పదవిలో ఉండాలని జనం ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే మహానేత ఇక లేడని తెలిసిందో పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తాము ఉండలేమన్నారు. రాజన్న లేడని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు. కాని మహానేత కానరాని లోకాలకేగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles