Telangana rebellion kaloji narayana rao aksharam

Telangana Rebellion Kaloji-Narayana-Rao-Aksharam, Kaloji Narayana Rao, Telangana Rebellion: Kaloji Narayana Rao, Telangana Rebellion, Burgula Ramakrishna Rao, Raavi Narayana Reddy, Makhdoom Mohiuddin, Telangana Poet Kaloji Narayana Rao

Telangana Rebellion Kaloji-Narayana-Rao-Aksharam

మాతృభాష పై కాళోజీ 'అక్షర' యుద్ధం..

Posted: 09/13/2013 03:38 PM IST
Telangana rebellion kaloji narayana rao aksharam

''అన్యాయాన్నెదిరించడం.. నా జన్మహక్కు–నా విధి

అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడవకు సంతృప్తి

అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తి, ప్రాప్తి

అన్యాయాన్నెదిరించినోడు.. నాకు ఆరాధ్యుడు''

అంటూ.. తన పదునైన అక్షరాలతో అన్యాయంపై యుద్ధభేరి మోగించారు ప్రజాకవి, రచయిత, వక్త, పౌరహక్కుల నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మ విభూషణ్.. డాక్టర్ కాళోజీ నారాయణ రావు.

పుటక, చావునీది బతుకంతా దేశానిది...

'పుట్టుక నీది.. చావునీది.. బతుకంతా దేశానిది' అంటూ ప్రతి పౌరుడూ దేశానికి చేయాల్సిన సేవను వ్యక్తపరిచారు కాళోజీ నారాయణరావు. చెప్పడమే కాదు.. అక్షరాలా దానికి కట్టుబడి జీవితమంతా ప్రజాసేవలో గడిపారు. 1914 సెప్టెంబర్ 9న కాళోజీ జన్మించారు. పాతికేళ్ల ప్రాయంలో సంఘ సంస్కర్త, వేలూరి మాణిక్యరావు కుమార్తె రుక్మిణీబాయిని పెళ్లాడారు. కుటుంబ బాధ్యతలన్నీ అన్న రామేశ్వరరావుకి వదిలి నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తూ ప్రజల కష్టసుఖాలను గమనిస్తూ గ్రామాలలో తిరుగుతుండేవాడు. అన్యాయాలను ఖండిస్తూ ప్రజల మనిషిగా మారాడు. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజాబాహుళ్యంలో విస్తరించిన తొమ్మిది దశాబ్దాల నిండు జీవితంలో విస్తృతమైన రచనను మనకు విశ్లేషణా వస్తువుగా, ఆదర్శంగా, పాఠంగా మిగిల్చి వెళ్లిపోయారు.

 

బాల్యం నుంచే అన్యాయంపై ఎదురుదాడి..పాఠశాల విద్యార్థి దశ నుంచి మరణానికి కొద్దినెలల ముందు వరకూ ఆయన సాంఘిక జీవితం మొత్తంలోనూ అన్యాయం అని ఆయన భావించిన, గుర్తించిన అంశాల మీద తిరుగుబాటు సాగించారు. దానిపై పోరాటమే ఆయన స్వభావంగా కొనసాగింది. ఆ తిరుగుబాటును తన కవిత్వంలో, సంభాషణలో, ఉపన్యాసంలో, ఆచరణలో, సామాజిక జీవనంలో ప్రతి చోటా చూపించారు.. ఆచరించారు. దేశ ప్రజలందరి ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఇందిరాగాంధీ విధించిన

ఎమర్జెన్సీ ప్రజాస్వామికవాదులందరినీ కదిలించింది. ఆ సందర్భంలో బైట ఉండి అవకాశం వచ్చిన చోటనల్లా ఆ అన్యాయంపై కాళోజీ తిరుగుబాటు ప్రకటించారు.

మాతృభాష గొప్పదనాన్ని చాటుతూ...

తెలుగు భాష గొప్పదనాన్ని సైతం కాళోజీ చాటిచెప్పారు.

‘‘తెలుగు బిడ్డవయ్యి తెలుగు రాదంచును

సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా..?

దేశ భాషలందు తెలుగు లెస్సయటంచు

తెలుగు బిడ్డా ఎపుడు తెలుసుకొందువురా..?

అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు

సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?’’

అంటూ నిరాఘాటంగా విమర్శించినవారు కాళోజి. ఇలాంటి అలుపెరగని ప్రజాకవి శతజయంతి ఉత్సవాల సందర్భంగా 'తెలుగువిశేస్.కామ్ నివాళులర్పిస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles