Telugu movie news special story on tollywood veteran actor tadepalli lakshmi kanta rao

actor kanta rao, actor tadepalli lakshmi kanta rao, tollywood tadepalli lakshmi kanta rao, n. t. rama rao, akkineni nageswara rao, kantha rao super acting, telugu movies, folk movies, popular telugu actor kanta rao,

special story on tollywood veteran actor tadepalli lakshmi kanta rao

'జానపద ' చిత్రాల రారాజు ఈ నటుడు

Posted: 05/15/2013 12:33 PM IST
Telugu movie news special story on tollywood veteran actor tadepalli lakshmi kanta rao

యన్ . టీ . ఆర్. , . యన్ . ఆర్. స్టార్ హీరోలు గా , రఘునాధ్ వంటి వారు రోమ్యాంటిక్ హీరోలుగా కొనసాగుతున్న సమయం అది . అయినా , 'జానపద' చిత్రాలలో నటించాలి అంటే , దర్శక - నిర్మాతలు , ఈ చిత్రాలని చూసే ప్రేక్షకులు సైతం , ఈ హీరోనే ఆ పాత్రలో చూడటానికి మక్కువ చూపే వారు.

ఈ హీరో ఎవ్వరు అని ఆలోచిస్తే , ఒకే పేరు , ఒకే రూపం మనకు వినపడుతుంది , కనపడుతుంది . ఆయనే , కాంతా రావు గారు . ఈ నటుడి గురించి మరికొంత ఇవాల్టి ఆనిముత్యాలలో ...

జానపద కళాకారునిగా కాంతా రావుగారు ఎంతటి పెరునైతే సంపాదించుకున్నారో , పౌరాణిక పాత్రలు పోషించడం లో కూడా అంతటి పేరు - గుర్తింపుని సంపాదించుకున్నారు . ముఖ్యంగా 'నారదుని ' పాత్రలో కాంతా రావు గారి నటన , అనన్య సామాన్యం . పౌరాణిక పాత్రల్లోకేల్లా , త్రిలోక సంచారి , కలహ భోజనుడు అయిన నారద పాత్రను , పోషించడం చాలా కష్టం . నారదుని పాత్రను పోషించడం అంటే , కాంతా రావు గారికి ఎంతో ఇష్టం . మాటల్లో చమక్కులు , చూపుల్లో తళుక్కులు , పదాల్లో విభిన్నతలు , నటనలో , ముఖ కవళికల్లో అవసరం మేరకు విరుపులు , ఇవన్నీ నారద పాత్రలో ఉన్న ప్రత్యేకతలు . ఈ ప్రత్యేకతలని తన నటన ద్వారా ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టుగా చూబించడం లో కాంతా రావు గారు దిట్ట . 'నారదుడు ' అంటే కాంతా రావు , కాంతా రావు అంటే 'నారదుడు' అన్నంతగా ఈ పాత్రకు ప్రాచూర్యం తీసుకొచ్చారు కాంతా రావుగారు . విశ్వ విఖ్యాత నట సార్వభౌమ , యన్ . టీ . ఆర్. ను మనం ఎలా 'రాముడి'గా , 'కృష్ణుడి'గా మన మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నామో , అలాగే ప్రేక్షకులు కాంతా రావు గారు కూడా 'నారదుని' పాత్రకు జీవం పోశారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .

ఇక పౌరాణిక పాత్రల విషయానికి వస్తే , 'లవ కుశ' చిత్రం లో లక్ష్మనుడిగా , 'బాల భారతం' లో పాండు రాజు గా నటించి మెప్పించారు , కాంతా రావు గారు . అనేక చిత్రాల్లో 'కృష్ణుడి' పాత్రలో కనిపించి అందరి మన్ననలు అందుకున్నారు ఈ సీనియర్ నటులు . కన్నులలో ప్రసన్నత , నడకలో మృదుత్వం , అవసరం అయినప్పుడు గాంభీర్యత , కృష్ణుడి పాత్ర లక్షణాలు ఇవి . ఇవన్ని సమర్ధవంతంగా తన నటన ద్వారా ప్రదర్శించి , యన్ . టీ . ఆర్. ను కృష్ణుడి గా అంగీకరించిన ప్రేక్షకుల చేత కూడా , 'కృష్ణుడి ' గా జేజేలు పలికించుకున్నారు , కాంతా రావు గారు .

జానపద , పౌరాణిక చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి , 'జానపద ' చిత్రాల్లో నటించాలంటే అది కాంతా రావు వల్లే సాధ్యం అవుతుంది అని అందరు అనుకునేంత ఎత్తుకు ఎదిగిన కాంతా రావు గారు , సాంఘిక చిత్రాల్లో కూడా , మరపురాని పాత్రలని పోషించి , అందరి మన్ననలు పొందారు .

ముఖ్యంగా యన్ . టీ . ఆర్ . - సావిత్రి గార్లు అన్నా - చెల్లెళ్ళు గా నటించిన 'రక్త సంబంధం' చిత్రం లో , సావిత్రి గారి భర్త పాత్రలో కాంతా రావు గారి నటన , చిత్రం లో ని ఇతర ముఖ్య పాత్రలు మరింత బాగా ఎలివేట్ అవ్వడానికి ఎంతో దోహదం చేసింది . ఒక తండ్రిగా , ఒక ,సోదరునిగా , ఒక భాగవత్స్వరూపానిగా , ఒక విలన్ గా , ఇలా అనేక డైమెన్షన్స్ ఉన్న పాత్రలను పోషించి , ఇతర హీరోలు స్టార్ హీరోల హోదాలో కొనసాగుతున్న కాలం లోనే , వారందరికీ గట్టి పోటీ ఇచ్చిన ఘనత కాంతా రావు గారిది .

అయితే , దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోనందువలనో , లేక ఇతర ఏ ముఖ్య కారణాల వల్ల అయినా కావచ్చు , కాంతా రావు గారు , తనకు వచ్చిన విజయాన్ని , ఇటు పేరు పరంగా , అటు ఆర్ధికంగా కూడా నిలబెట్టుకోలేక , తన తుది రోజుల్లో ఎంతో ఇబ్బంది పడ్డారనే చెప్పాలి ...

సుఖ దుఖాల సమ్మేళనమే జీవితం , ఏది శాస్వతం కాదు కాబట్టి , ఊహించని పరిణామాలకు , ముందుగానే సిద్ధంగా ఉండాలి అని , కాంతా రావు గారి జీవితం తెలుసుకున్న అందరికీ అర్ధం అయ్యే విషయం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles