Tollywood special story on legendary singer ghantasala

ghantasala, ghantasala venkateswara rao, gantasala hit songs, devotional songs, legendary singer, sarvashri ghantasala venkateswara rao,

Special story on legendary singer Ghantasala

మనకు తెలియని ఘంటసాల

Posted: 05/11/2013 05:24 PM IST
Tollywood special story on legendary singer ghantasala

తెలుగు సినిమా ఉన్నంత కాలం తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే స్వరం ఘంటసాల మాస్టర్ ది. 100 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఘనత , వేల పాటలు పాడిన అనుభవం ఈ మహా గాయకుడి సొంతం . నాటి నుండి నేటి తరం వారికి కూడా, ఘంటసాల మాస్టర్ గురించిన ఎన్నో విశేషాలు తెలుసు . మరి మీకు ఈ మహా గాయకుడి గురించిన ఈ విశేషాలు తెలుసా ???

ఘంటసాలకు తను పనిచేసిన సంస్థలంటే చాలా ఇష్టం. విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రాల్లోని పాటలు, నేపథ్య సంగీతం ఎందరెందరికో చేరువైందనడానికి కీలక కారణం ఘంటసాల.

ఘంటసాల తన జీవిత కాలంలో వంద సినిమాలకు దర్శకత్వం వహించారు. విజయవారికి చేసినన్ని సినిమాలు ఇంకెవరికీ చేయలేదు. డజను సినిమాలకు పనిచేశారు. ఆ సంస్థ పట్ల ఆయనకున్న అభిమానంతో, భక్తితో తన ప్రథమ కుమారుడికి విజయకుమార్ అనే పేరు పెట్టుకున్నారు.

ఘంటసాల గొప్ప గాయకుడే కాదు, అంతకంటే గొప్ప మనసున్న వాడు కూడా. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపించబడింది. అలాంటి ఒక సంఘటన...

అవి ఎన్టీఆర్ హీరోగా భలే తమ్ముడు చిత్రానికి పాటల రికార్డింగ్ జరుగుతోన్న రోజులు. కొత్తదనం కోసం ఆ చిత్రంలో పాటలను మహమ్మద్ రఫీ తో పాడించాలని నిర్ణయించుకున్నారు. అయితే, మహమ్మద్ రఫీ మాత్రం తెలుగులో ఘంటసాల వంటి మహాగాయకుడు ఉండగా తెలుగులో తాను పాడకూడదని అన్నాడట.

ఈ విషయం తెలుసుకున్న ఘంటసాల అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దనీ.. తనకి ఇచ్చేదాని కన్నా ఎక్కువే ఇస్తారు కాబట్టి లాభం పొందమంటూ రఫీను ఘంటసాల ప్రోత్సహించారు.

ఘంటసాల ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడంతో, ఘంటసాల గొప్ప మనసుకి మహమ్మద్ రఫీ ఆశ్చర్యపోయారట.

ఎన్నో మధురమైన ... మనసుకి హత్తుకునే పాటలతో శ్రోతలను పరవశింపజేసిన ఘంటసాల, తనకి ఎంతగానో నచ్చిన ఓ పాటను మాత్రం పాడలేకపోయారు. 'ప్రేమలు పెళ్లిళ్లు' చిత్రంలో 'మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు' అనే పాట ఘంటసాలకి ఎంతగానో నచ్చింది. రిహార్సల్స్ పూర్తి అయిన తరువాత ఆయనకి విపరీతంగా దగ్గురావడం ... ఆ దగ్గు తొందరగా తగ్గకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు ఆ పాటను రామకృష్ణతో పాడించారు.

దగ్గు తగ్గిన తరువాత ఘంటసాలతోనే ఆ పాటను పాడించడానికి వాళ్లు సిద్ధపడ్డారు. అయితే రికార్డింగ్ థియేటర్ కి వెళ్లిన ఘంటసాల, ముందుగా రామకృష్ణ పాడిన పాటను వినిపించమన్నారట. ఆ పాటను విన్నాక ''కుర్రాడు చాలా బాగా పాడాడు. అతను అంత అద్భుతంగా పాడిన ఆ పాటను మళ్లీ నేను పాడనవసరం లేదు' అంటూ వెనుదిరిగారు.

ఆ తరువాత ఘంటసాలకి 'భక్తతుకారం' సినిమాలో పాడే అవకాశం వచ్చింది. పాటలన్నీ ఆయన పాడవలసినదేనంటూ ఆది నారాయణరావు - అంజలీదేవి పట్టుబట్టారు. కానీ అప్పటికే ఘంటసాల ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నారు. అక్కినేని కాల్షీట్లు అయిపోతున్నాయని తెలుసుకున్న ఘంటసాల, రామకృష్ణతో ట్రాక్ పాడించమని ఆది నారాయణరావుతో చెప్పారు. కాస్త కోలుకుని ఇంటికి వచ్చిన ఘంటసాల, రామకృష్ణ పాడిన పాటలు విని ముచ్చట పడ్డారట. అతని పాటలు అలాగే ఉంచమని చెప్పి, మిగిలిన రెండు పాటలు మాత్రం తాను పాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles