Ssrajamouli child days happy moments

director rajamouli interview , ss.rajamouli interview, rajamouli interview, rajamouli about eega, rajamouli about future projects, rajamouli movies, rajamouli new movies, rajamouli ,rajamouli

Director Rajamouli Interview , SS.Rajamouli Interview, Rajamouli Interview, Rajamouli about Eega, Rajamouli about future projects, Rajamouli movies, Rajamouli new movies, Rajamouli

SS.Rajamouli child days happy moments.png

Posted: 08/01/2012 01:04 PM IST
Ssrajamouli child days happy moments

SS.Rajamouli_child_days_happy_moments

SS_Rajamouliఈ తరం హీరోలకే  హీరో  అతను. ఆయన  సినిమాలో  పని చేయాలనుకోవడం    వాళ్లకొక   మధుర  స్వప్నం.  అతనికి గాలి, నీరు, తిండి, నిద్రా  అన్నీ సినిమానే. . కష్టే ఫలి సూత్రాన్ని  నమ్ముకుని   చిత్రరంగంలోకి    అడుగుపెట్టి ' స్టూడెంట్ నెం.1'తో దర్శకుడై  'సింహాద్రి', 'సై', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ', 'మగధీర' , 'మర్యాద రామన్న' లతో తన కీర్తి పతాకాన్ని  సినీ వినీలాకాశంలో   రెపరెపలాడించాడు. ' . మగధీర' చిత్రానికి  ఉత్తమ  దర్శకుడిగా   నంది, ఫిలిమ్‌ఫేర్ పురస్కారాలు   కూడా  అందుకుని  'ఈగ'తో విజయ దుందుభి  మ్రోగిస్తూ  దూసుకుపోతున్న '  నవచిత్ర' యువ దర్శకుడు   ఎస్.ఎస్. రాజమౌళి   జీవితంలో  ని కొన్ని  మధుర  సంఘటనలు.

నాలో మీకు ఒక్కడే కనిపిస్తాడు కానీ నిజానికి ఇద్దరున్నారనే సీక్రెట్ తెలిసింది మాత్రం నా ఒక్కడికే. ఒకడిలో చిన్నతనం నుండి మనసు నిండా భయం, పిరికితనం. మరొకడిలో నిలువెల్లా 'అడ్వంచరే'. వాటన్నిటికీ బీజం ఎక్కడ, ఎలా పడిందో చెపుతాను.నేను పుట్టింది కర్నాటకలోని  రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలో. ఎప్పుడో అరవయ్యో దశకంలో నాన్నవాళ్లంతా తుంగభద్ర డ్యామ్ కడుతున్నప్పుడు కొవ్వూరు నుండి వలస వెళ్లి అమరేశ్వర కాంపును ఏర్పాటు చేసుకున్నారట. ఉమ్మడి కుటుంబం. మావాళ్లంతా అక్కడే ఉన్నా నేను, అక్కయ్య మాత్రం కొవ్వూరులో నాన్నమ్మ దగ్గర ఉండేవాళ్లం. మొదట్నించీ దూకుళ్ల మీద సాగిన చదువు నాది. నాన్నమ్మ చెప్పే బాల రామాయణం, భారతాల్ని ఔపోసన పట్టాక ఒకేసారి నన్ను 4వ తరగతిలో పడేశారు. నాన్న అప్పుడప్పుడు మమ్మల్ని చూడ్డానికి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి లైబ్రరీలో అక్కకూ, నాకూ ఐదు రూపాయల చొప్పున కట్టి కార్డు తీయించారు. ఆ లైబ్రరీలోని చెక్క బీరువాలు తెరవగానే మరో ప్రపంచం కనిపించింది. పట్టలేని ఆనందం. ఎన్ని కామిక్సో. 'అమరచిత్ర కథలు' నన్ను పూర్తిగా లోబరుచుకున్నాయి.

అర్థం తెలియకుండానే    పాడేశాను 

అప్పట్లో మా 'దీప్తి కాన్వెంట్'లో ప్రతి శనివారం విద్యార్థుల్లోని కళలను వెలికి తీసేవిధంగా రెండు క్లాసులు ఉండేవి. నాన్నమ్మ నుండి అబ్బిన విద్య కథ చెప్పడమే కాబట్టి చిలవలు పలవలు కల్పించి చెప్పేవాణ్ణి. నావంతు రాగానే పిల్లలంతా 'ఇక కథ మొదలెడ్తాడ్రా' అని గట్టిగా నిట్టూర్చేవాళ్లు. ఒకసారి రజియా సుల్తానా టీచర్ ఆ పీరియడ్ తీసుకున్నప్పుడు ఎప్పట్లాగే లేవబోతుంటే 'నో స్టోరీస్' అంది సీరియస్‌గా. ఉక్రోషం పొడుచుకొచ్చి 'పాట పాడతా టీచర్' అన్నాను. 'సరే పాడు చూద్దాం' అంది అపనమ్మకంగానే. ఆమె అనడం ఆలస్యం 'చూడు పిన్నమ్మా పాడు పిల్లడూ ...' అంటూ ఆరున్నొక్క రాగంలో ఎత్తుకున్నా. అంతే! మిన్నే విరిగిందో, సునామే వచ్చిందో తెలీదుగానీ ఒక్కసారిగా అందరూ ఊగిపోతూ పగలబడి పడీ పడీ నవ్వడం - మా టీచరైతే నవ్వలేక కడుపు పట్టుకుని తనముందున్న టేబుల్‌పై దభీమని పడిపోవడం ఇప్పటికీ కళ్లకు కట్టినట్టే ఉంది. అంత చిన్న వయసులో ఆ పాటకి అర్థం నాకెలా తెలుస్తుంది చెప్పండి?

వయసు 11, ఆలోచన 60

ముందే చెప్పా కదా, నాది దూకుళ్ల చదువని. 4వ తరగతి కాగానే ఏకంగా ఏడవ తరగతి చదవడానికి ఏలూరికి జంప్. బెనర్జీపేటలోని పాండురంగ టాకీసు సమీపంలో మా మేనత్తగారింట్లో ఉండేవాణ్ణి. ఆ టాకీసులో ప్రదర్శించే సినిమాలు డైలాగ్స్‌తో సహా ఇంట్లోకి వినిపించేవి.

సెవెన్త్‌క్లాస్ మంచి మార్కుల్తో ప్యాసయ్యాక మెట్రిక్‌లోకి మళ్లీ దూకుడు. అప్పటికింకా నా వయసు పదకొండే. 13 ఏళ్లుంటేగానీ మెట్రిక్‌లో కూర్చోనివ్వరని ఒక డాక్టర్‌ను సంప్రదించి 2 ఏళ్లు పెంచుకుని ఒక సర్టిఫికెట్ సృష్టించాం. ఈ విషయం తెలుసుకున్న మా ఫ్రెండొకడు ఆశ్చర్యపోయి 'నీకేమైనా పిచ్చా? రెండేళ్లు ఎక్కువేయించుకుంటావా? రెండేళ్లు ముందుగానే ఉద్యోగంలోంచి రిటైర్ అవ్వాలి తెలుసా?' అన్నాడు. పదకొండేళ్లు కూడా ఉండవు రిటైర్‌మెంట్ గురించి వాడుచేసిన దూరాలోచనకి వెర్రిమొహంతో చూస్తుండిపోయా.

ఏలూరు టు కొవ్వూరు వయా మద్రాసు

ఇంటర్ తప్పాక ఏం చేయాలో అర్థంకాక తిన్నగా మద్రాసు వెళ్లిపోయా. అప్పటికే నాన్నావాళ్లు సినిమాలకు కథల్రాయడానికి  కర్నాటక నుండి అప్పుడప్పుడు అక్కడికి వస్తుండేవారు. మద్రాసులో ఏం చేయాలో తోచేది కాదు. మా అన్నయ్య కల్యాణమాలిక్ (సంగీత దర్శకులు) నేనూ కలిసి చెరో 35 రూపాయలు పోగేసి 'సత్యం, శాంతం, శుభం' టాకీసులకు వెళ్లి ఇంగ్లీషు పిక్చర్స్ చూసి వచ్చేవాళ్లం. పనీ పాటా లేకుండా మేం చేసే ఘనకార్యాలు తెలుసుకున్న మా సమీప బంధువు బి.ఎస్.ప్రసాద్‌గారు 'అడ్డగాడిదలా మద్రాసు రోడ్లు కొలుస్తూ తిరుగుతున్నాడు వీడు, ఇక్కడుంటే ఇక చదువు అటకెక్కడం ఖాయమ'ని తిరిగి నన్ను కొవ్వూరుకు తీసుకెళ్లి ఇంటర్ సెకండియర్‌లో చేర్పించేశారు.గడగడ  వణికించిన  కపాలం
సాయంత్రాలు గోదావరి గాలి పీలుస్తూ ఇసుక మేటలపై నడవడం చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు ఆలోచిస్తూ నడుస్తున్న నా పాదానికి ఏదో గట్టిగా తగలడంతో ఉలిక్కిపడి చూశాను. ఇసుకలో సగం కూరుకుపోయిన మనిషి పుర్రె. ఆ కపాలం చూడగానే భయం నా కపాలానికి ఎక్కేసింది. ఒళ్లంతా చెమటలు. చుట్టూ చీకటి. అప్పటికే కిలోమీటరు పైగా నడిచేశాను. ఇంకేముంది? వణికిపోతూ తడబడుతూ వెనక్కి ఒకటే పరుగు. ఆ టైంలో నాలోని అడ్వంచర్ మనిషి నిద్రపోతున్నట్టున్నాడు. లేకపోతే ఆ పుర్రెని చేత్తో పట్టుకుని కాలితో ఫుట్ బాల్‌ని తన్నినట్టు ఒక తన్ను తన్నేవాడే !

సెకండియర్ అయిపోయాక అందరం విడిపోతుంటే మాత్రం చాలా బాధేసింది. అన్నట్టు ఒకమ్మాయిని బాగా ఇష్టపడేవాణ్ణండోయ్. కాని మాట్లాడాలంటే చచ్చేంత సిగ్గో భయమో తెలీదు కానీ ... ఒక్కసారి మాత్రం ధైర్యంచేసి 'ఫీజు కట్టావా?' అని అడగ్గలిగాను. ఆ సంవత్సరం మొత్తంలో నేను మాట్లాడింది ఆ మాటొక్కటే అంటే నమ్ముతారా?ఇంటర్మీడియట్‌తో చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టేసి కర్నాటక వెళ్లిపోయా. అక్కడ ప్రసంగి అనే పాస్టర్ ఒకాయన మాకు తోడు దొరికాడు. ఎందుకో తెలీదు కానీ అప్పట్లో ఒకరకమైన ఆధ్యాత్మికత నన్ను ఆవరించుకుని ఉండేది. తరచూ గుండు గీయించుకుని, కాషాయ వస్త్రాలు ధరించేవాణ్ణి. చిన్నతనంలో చదివిన 'అమరచిత్ర కథల' ప్రభావం వల్ల కాబోలు ఎప్పుడూ ఏదో అడ్వెంచర్ చేయాలని మాత్రం ఉండేది. ప్రసంగి గారితో పాటు ఒకసారి పెద్ద గుట్ట ఎక్కి ఎవరెస్టు శిఖరం అధిరోహించినంత ఆనందం పొందటం ఇప్పటికీ మర్చిపోలేను.తర్వాత నా మజిలీ మళ్లీ మద్రాసు. ఈలోగా కీరవాణి అన్నయ్యకి పెళ్లవడం, మా శ్రీవల్లి వదిన (అమ్మనే పిలుస్తాం) ఇంట్లో పనీ పాటా లేకుండా తిరిగే నాలాంటి వాళ్లందర్నీ కూచోబెట్టి విజయానికి ఎలా నిచ్చెనలేయాలో రోజువారీగా క్లాసులు తీసుకోవడంతో ... 'ఇక లాభంలేదు, జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే' అని గట్టిగా నిర్ణయించుకుని ఒక శుభముహూర్తం  చూసుకుని ఎడిటింగ్ అసిస్టెంట్‌గా  అరంగేట్రం చేసి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టరుగా .... అలా అలా .... అబ్బో ఇప్పటికే చాలా చెప్పేసినట్టున్నాను - తర్వాత ఏం జరిగిందో మీకెలాగూ తెలుసు.

మథ్స్ నా బద్ధ శత్రువు

మెట్రిక్‌లో నా మార్కులు చూడగానే అంతా అవాక్కయ్యారు. మా అక్క మాత్రం 'వీడు ఏకసంథాగ్రాహి. కేవలం పరీక్షలముందు చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇకపై వీడు ఎన్ని ఆటలాడినా మనం ఏం అనకూడదని డిసైడ్ Rajamouliఅయిపోయింది. ఆ నమ్మకమే నాకు మైనస్ పాయింట్ కూడా అయ్యిందనుకోండి. ఖాళీగా ఉన్నప్పుడంతా నవలలు అద్దెకు తెచ్చుకుని చదివేవాణ్ణి. ముఖ్యంగా ఫాంటసీ బాగా ఇష్టపడేవాణ్ణి. మ««ధుబాబు షాడోతో పాటు, యండమూరి, మల్లాదిల ద్వయం నన్ను ఊపిరి సలపనిచ్చేవాళ్లు కాదు. దానికితోడు మా మావయ్య బంగారం ఎలా తయారు చేయాలో, రాబిన్ వుడ్‌లా సాహసయాత్రలు ఎలా చేయాలో చెబుతూ నా బుర్రలోని ఫాంటసీకి ఆజ్యం పోస్తుండేవాడు. ఇది చూసి మా మేనత్త తన పైత్యంతో మా మావయ్య నన్ను చెడగొడుతున్నాడని లబో దిబోమనేది (మావయ్య ఎడ్డెమంటే ఆమె తెడ్డెమనేదనుకోండి).మెట్రిక్ కాగానే సి.ఆర్.రెడ్డి కాలేజీలో చేరి ఎంపిసి తీసుకున్నాను. మాథ్స్, ఫిజిక్సులంటే నాకు ముందునించే పడదు. పైగా ఒక్కో పుస్తకం ఇంతెత్తున ఇటుకంత దళసరిగా కన్పించేవి. వాటిని చూస్తేనే నీరసం వచ్చేది. కాలేజీకి వెళ్లే వాణ్ణి కాని క్లాసులో కూర్చోబుద్ధి కాక, ఇండోర్ స్టేడియంలో ఆటలాడేవాణ్ణి. క్లాసులకు రోజూ ఎగ్గొట్టినా కాలేజీ ఎగ్గొట్టింది మాత్రం సంవత్సరం మొత్తంలో రెండుసార్లే. ఒకటి - రాజీవ్, శ్రీనివాస్, సుపర్ణలతో కలిసి సైకిల్‌మీద విజయవాడ పొలిమేరల దాకా వెళ్లి మేం కూడా సాహసాలు చేయగలమని నిరూపించుకున్నప్పుడు. రెండు - బ్రూసిలీ సినిమా చూడ్డం కోసం. ఇష్టం లేని చదువు కదా. పొరపాటున డిస్టింక్షన్‌లో ప్యాసయితే నన్ను నేను తట్టుకోవడం కష్టమనిపించి ఫస్ట్ ఇయర్‌లో మాథ్స్, ఫిజిక్స్ చీదేశాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eega villain sudeep interview
Rajesh khanna the custodian of his own famous avatar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles