Rajesh khanna the custodian of his own famous avatar

Amar Prem, Rajesh Khanna, Congress Party,Rajesh Khanna,Rajesh Khanna cremation,Akshay Kumar,Aarav,Rajesh Khanna dead

Despite his lacklustre performance as MP, Khanna remained a steadfast campaigner for the Congress party.

Rajesh Khanna The custodian of his own famous avatar.gif

Posted: 07/19/2012 12:56 PM IST
Rajesh khanna the custodian of his own famous avatar

Rajesh_Khanna_3

Rajesh_Khanna‘ ఐ హేట్ టియర్స్... ’ ‘అమర్ ప్రేమ్ కి’ ముందూ, ఆ తరువాత రాజేష్ ఖన్నా ఇలాంటి పదునైన డైలాగులు ఎన్నో చెబుతుంటాడు. ఇది మాత్రం అతని మనసు లోతుల్లోంచి వచ్చిన మాట. ఎందుకంటే ఆయనకు కన్నీంటే అసహ్యం. రాజేష్ ఖన్నా చిరునవ్వుల్ని ప్రేమిస్తాడు. కల్మషం లేని మనషుల్ని ప్రేమిస్తాడు. కన్నీళ్ళు, ఆకలి అతనికి తెలియవు. ఎందుకంటే అతను ధనవంతుల బిడ్డ. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు కాళ్ళరిగేలా తిరగలేదు. తొలి అడుగుల్లోనే బాక్సాఫీసు గుండెల్లో చెదరని ముద్ర వేసేశాడు. హిట్.. హిట్... అంటూ పరితపించడం తెలీదు. విజయాలు అతడి వెనకాలే పరుగులు తీశాయి. ఇక కన్నీటికి చోటెక్కడిది.

రాజేష్ ఖన్నా జీవితమూ సినిమా లాంటిదే. ఇంటర్వెల్ తరవాతే అసలు మలుపులొచ్చాయి. విధి అక్కడే ఓ ఆట ఆడింది. ఉప్పు నీరు సముద్రంలోనే కాదు, గుండె పొరల్లోనూ ఉంటుందనే నిజం రాజేష్ ఖన్నాకి తెలిసేలా చేసింది.

****

సినిమా రంగంలో ఏళ్ళ తరబడి ఎవర్‌గ్రీన్‌ హీరోగా కొనసాగడం ఆషామాషీ కాదు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ ఘనత సాధించారు. అలాంటి వారి లో ఒకరు రాజేష్‌ ఖన్నా. రాజేష్‌ ఖన్నాపై 1974లో బీబీసీ ప్రత్యేకంగా బాంబే సూపర్‌ స్టార్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌ నిర్మించింది. ఇలాంటి గౌరవం దక్కింది కొందరికే.

సినీరంగ ప్రవేశం...

1942, డిసెంబర్‌ 29న జన్మించిన రాజేష్‌ ఖన్నా దత్తత తీసుకున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగారు. ఆయన అసలు పేరు జతిన్‌ ఖన్నా. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలంటే పిచ్చి. స్కూల్లో ఎన్నో నాటకాల్లో నటించారు. సినిమాల్లో చేరాలనుకుని నిర్ణయించుకున్నాక 1965లో తన పేరును రాజేష్‌గా మార్చుకున్నారు. అదే ఏడాది యునెటైడ్‌ ప్రొడ్యూసర్స్‌, ఫిల్మ్ ఫేర్‌ నిర్వహించిన ఆల్‌ ఇండియా టాలెంట్‌ పోటీలో విజేతగా నిలిచి సినిమా అవకాశం దక్కించుకున్నారు. చేతన్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఆఖరి కథ్‌ చిత్రం ద్వారా ఖన్నా వెండితెర పై అడుగుపెట్టారు. జితేంద్రకు మొదటి అడిషన్‌ టెస్ట్‌ జరిగినప్పుడు ‘కోచింగ్‌’ ఇచ్చింది రాజేష్‌ ఖన్నానే కావడం విశేషం.

Rajesh_Khanna1తారపథంలో...

1969లో వచ్చిన ఆరాధన చిత్రం ఆయన స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో గాయకుడు కిషోర్‌కుమార్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడమే కాకుండా రాజేష్‌ ఖన్నా ఆస్థాన గాయకుడిగా మారిపోయాడు. అక్కడి వీరిద్దరి కాంబినేషన్‌ లో ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు వచ్చాయి. ఆర్‌డీ బర్మన్‌, ఖన్నా, కిషోర్‌కుమార్‌ కలిసి 30పెైగా సినిమాలు చేశారు.

మహిళా అభిమానులు నుంచి రక్తంతో రాసిన ప్రేమలేఖలు లెక్కలేనన్ని అందుకున్నారు. ఆయన కంటే ముందు రాజ్‌కపూర్‌, దిలీప్‌ కుమార్‌ కూడా అభిమానులను అలరించినప్ప టికీ ఖన్నా ఏకంగా వారి హృదయాల్లోనే పాగా వేశారు.

మహిళా అభిమానులే అధికం...

మహిళా అభిమానులు రక్తంతో రాసిన ప్రేమ లేఖలు రాజేష్‌ ఖన్నా లెక్కలేనన్ని అందుకున్నారు. ఆయన కంటే ముందు రాజ్‌కపూర్‌, దిలీప్‌ కుమార్‌ కూడా అభిమాను లను అలరించినప్పటికీ ఖన్నా ఏకంగా వారి హృదయా ల్లోనే పాగా వేశారు. ఆ తరం యువతుల హృదయాలను కొల్లగొట్టిన రొమాంటిక్‌ హీరోగానే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటి సూపర్‌స్టార్‌గా అభిమానుల మన్ననలు పొందారు.

అభిమానుల సందడి

సినిమా జీవితం ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు అభిమానులతో కాకా అని ముద్దుగా పిలుపించు కున్నారు. ఆయనెక్కడకు వెళితే అక్కడ అభిమాన తరంగం ఉప్పొంగేది. ఆయన కనబడితే చాలు ఫ్యాన్స్‌ వరుస కట్టే వారు. ఆయన పేరును నిత్యాపారాయణంలా జపించే వారు. అభిమానులు ఆయన కారును ముద్దుల్లో ముంచెత్తిన సంఘటనలు ఉన్నాయని షర్మిలా ఠాకూర్‌ అన్నారు.

రాజకీయాల్లోకి...

80వ దశకం చివరివరకు తన నటనతో అభిమానులను అలరించిన ఆయన 1992-96 వరకు కాంగ్రెస్‌ తరపున లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు.

Rajesh_Khanna2వ్యక్తిగత జీవితం...

1970 ఆరంభంలో ఆయన ఫ్యాషన్‌ డిజెైనర్‌, నటి అంజు మహేంద్రను ప్రేమించారు. ఏడేళ్ళ పాటు వారు కలసి తిరిగారు. ఆ తరువాత విడిపోయారు. విడిపోయిన తరువాత 17 ఏళ్ళ పాటు మాట్లాడుకోలేదని ఆ తరువాత అంజు తెలిపారు. రాజేష్‌ ఖన్నా 1973లో తన కంటే 15 ఏళ్లు చిన్నదయిన డింపుల్‌ కపాడియాను పెళ్లిచేసు కున్నారు. 1984లో వీరు విడిపోయారు. వీరికి ట్వింకిల్‌, రింకిల్‌ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డింపుల్‌కు దూరమయిన తర్వాత టీనా మునియమ్‌కి దగ్గరయ్యారు. వీరిద్దరూ ఫిఫ్టీ-ఫిఫ్టీ, అధికార్‌, బెవఫాయ్‌, సురాగ్‌ తదితర సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించినా ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్‌ హీరోగానే ఖన్నా ఖ్యాతికెక్కారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు.

సూపర్‌హిట్లు-అవార్డులు...

ఆరాధన సినిమా తర్వాత ఖన్నా శకం ప్రారంభమైంది. 1969-1972 మధ్య కాలంలో ఏకబిగిన 15 సోలో సూపర్‌ హిట్‌లిచ్చి భారతీయ చిత్ర పరిశ్రమలో తిరగరాయలేని రికార్డును తన పేరిట లఖించుకున్నారు. మొత్తం 163 సినిమాల్లో నటించిన ఆయన 106 చిత్రాల్లో సోలో హీరోగా చేశారు. 17 షార్ట్‌ ఫిల్స్మ్ లోనూ ఆయన నటించారు. 14సార్లు ఫిలిం ఫేర్ అవార్డుకు నామినేట్ అయి మూడుసార్లు బెస్ట్‌ హీరోగా అవార్డు అందుకున్నారు. 2005లో ఫిల్మ్ ఫేర్‌ లెైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం స్వీకరించారు.

సూపర్ స్టార్ లకి కొత్త అర్థాన్ని ఇచ్చిన ఖన్నా.... ఇప్పుడు చుక్కల చెంతకు చేరాడు. అయినా కన్నీళ్ళను రాల్చకండి. ఎందుకంటే.. హీ హేట్.. టియర్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ssrajamouli child days happy moments
History of sardar bhagat singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles