Hero srikanth latest interview

hero srikanth interview latest interview, hero srikanth interview new chit chat talking media, hero srikanth interview videos

hero srikanth interview latest interview, hero srikanth interview new chit chat talking media, hero srikanth interview videos

hero srikanth latest interview.GIF

Posted: 04/16/2012 01:01 PM IST
Hero srikanth latest interview

Hero_srikanth_interview

Srikanthఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ ఆబాలగోపాలానికి చేరువయ్యే 'రాధాగోపాళం' ఆయన. పరిచయ వాక్యాలు అక్కర్లేని అందాల నటుడే కాదు, నూనూగు మీసాలనాడే సినిమా హీరో అయిపోదామని ఊహల్లో తేలిపోయి చెన్నపట్నం పారిపోయిన ఘనుడు కూడా. 'పీపుల్స్ ఎన్‌కౌంటర్'తో సినీ అరంగేట్రం చేసి 'ఆమె', 'తాజ్‌మహల్', 'పెళ్లిసందడి', 'ఖడ్గం', 'ఎగిరే పావురమా', 'తాళి', 'కన్యాదానం', 'నిన్నే ప్రేమిస్తా', 'ఒట్టేసి చెబుతున్నా', 'విరోధి' నుండి నిన్నటి 'శ్రీరామరాజ్యం' వరకు శతాధిక చిత్రాల్లో నటించి తన 'ఊహ'ని నిజం చేసుకున్న శ్రీకాంత్ జీవితంలోని కొన్ని సంతోషకరమైన విషయాలు ఇవి.

అందరికీ మామూలు కలలొస్తే, నాకు మాత్రం ఈస్ట్‌ మెన్ కలర్లో సినిమా కలలొచ్చేవి. అదేం చిత్రమో అందరికీ గుండె 'లబ్ డబ్ - లబ్ డబ్' అని కొట్టుకుంటే నా గుండెమాత్రం 'సినిమా సినిమా' అని కొట్టుకునేది. మా పొలం దగ్గర చేనుకి కావలికి వెళ్లిన రాత్రుళ్లు ... మంచెమీద పడుకుని ఆకాశంలో (సి)తారల్ని లెక్కపెడుతూనే, మేఘాలమాటున దోబూచులాడే విమానాల్ని కూడా తదేకంగా చూసేవాణ్ణి. 'ఆ యిమానంలో ఎవురుండారయ్యా?' అని మా పాలేర్లు అడిగితే 'ఇంకెవుర్రా, సినిమా యాక్టర్లు ... అదిగదిగో అందులో ఉన్నది చిరంజీవిగారే' అని చూసినట్టు ఠపీమని చెప్పేవాణ్ణి. సినిమా హీరోలు తప్పించి మరో మనిషి ఆకాశయానం చేయలేడనే నా అమాయకత్వాన్ని మా పాలేర్లు కూడా నమ్మేంతగా ఊరించి చెప్పేవాణ్ణి.హీరోనైపోదామని మద్రాసు పారిపోయా

నా బాల్యం, కౌమార్యం, యవ్వనారంభం కర్నాటకలోనే గడిచింది. 5 దశాబ్దాలకు పూర్వమే ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చి గంగావతి సమీపాన బసవపట్నంలో సెటిలైన వ్యవసాయ కుటుంబం మాది. గొట్టిపాటి వెంకటరత్నం హైస్కూల్లో 'టెన్త్' ప్యాసవగానే ఎడ్యుకేషన్ సెంటర్‌గా పేరుపొందిన ధార్వాడ్‌లో ఇంటర్ చదివేందుకు పంపించారు నన్ను. కొంతమంది మిత్రులతో కలిసి రూమ్ తీసుకుని ఉండేవాణ్ణి. ఇంగ్లీషు మీడియం. ఏమీ అర్థమయ్యేది కాదు. అతి కష్టంమీద రెండు నెలలు ఓపిక పట్టాను. ఏం చేయాలో తోచక 20 కిలోమీటర్ల దూరంలోని హుబ్లి వెళ్లి ఏకబిగిన కన్నడ, తెలుగు సినిమాలు చూస్తుండేవాణ్ణి. ఒకానొక ముహూర్తంలో చదువు మనకబ్బదని నిర్ణయించుకుని (3 నెలలు పూర్తవకుండానే) గప్‌చుప్‌గా ఇంటికి వచ్చేసి దొరికినన్ని డబ్బులు జేబులో వేసుకుని ముందూ వెనకా ఆలోచించకుండా 'చలో మద్రాస్' అంటూ రైలెక్కేశాను.

స్టూడియో గేట్లు తొక్కనివ్వలేదుSrikanth1

మద్రాసు సెంట్రల్ చేరగానే హీరో దర్జాతో ఒక లాడ్జిలో దిగాను. ముందురోజు ఆటో మాట్లాడుకుని ఎ.వి.ఎం. స్టూడియో, తర్వాత రోజు మరో స్టూడియోకి వెళ్లాను. చిరంజీవిగారు ఎక్కడైనా షూటింగులో ఉంటారేమో, నా మనసులోని మాట చెప్పి సినిమాల్లో చేరిపోవచ్చనే అమాయకత్వం. చిరంజీవిదాకా ఎక్కడ, స్టూడియో గేటులోపలకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఔట్‌డోర్ షూటింగ్స్ మెరీనా బీచ్‌లో జరుగుతాయని తెలిసి అక్కడ మనల్ని అడ్డుకునే వాళ్లు ఉండరని వెళ్లేవాడిని. 3 రోజులు గడిచాక చెన్నపట్నంలో ఎన్నాళ్లున్నా లాభం లేదని, హీరోనవడానికి ఇది సరైన సమయం కాదని నాకు నేను సర్ది చెప్పుకుని తిరిగి బసవపట్నం చేరుకున్నా.అప్పటికే ఇంట్లో అంతా అల్లకల్లోలం. బయట నాన్న, తమ్ముడు నాకోసం కంగారుగా వెతుకుతుంటే ఇంట్లో అమ్మ శోకాలు. నన్ను చూడగానే 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు. ధార్వాడ్‌కు మళ్లీ వెళ్లనని మొరాయించా. సరే వాళ్లు మాత్రం ఏమంటారు? మళ్లీ పారిపోకుండా తమ కళ్లముందు ఉంటే చాలనుకున్నారు. కొన్నాళ్ల పాటు అక్కవాళ్లింటికి విజయవాడ వెళ్లి అక్కడే ఉన్నాను. తర్వాత సంవత్సరం మాకు 40 కి.మీ. దూరంలోని హోస్పేట్‌లో మళ్లీ ఇంటర్‌లో చేరా. తమ్ముడు నాకంటే ఒక సంవత్సరం జూనియర్‌గా ఉండేవాడు. నేనొక సంవత్సరం చదవకపోయేసరికి నాతో సమానమయ్యాడు. హోస్పేట్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అమ్మ, నేను, తమ్ముడు ఉండేవాళ్లం. అమ్మ, తమ్ముడు తోడుగా ఉండటంతో మళ్లీ పారిపోవాలన్న ఆలోచన మాత్రం రాలేదు.

పార్టీ ఇచ్చి బోరున ఏడ్చాడు

ప్రేమో, ఆకర్షణో తెలీదు కానీ డిగ్రీ ఫైనల్‌లో ఉండగా ఒకమ్మాయిని బాగా ఇష్టపడేవాడిని. తను చాలా అందంగా, కోమలంగా, అచ్చం చందనం బొమ్మలా ఉండేది. తరచూ ఐ లవ్‌యూ చెప్పేద్దామని అనిపించేది. మెల్లమెల్లగా దగ్గరవ్వాలనుకుని స్పోర్ట్స్ కాంపిటేషన్స్‌లో క్యారమ్స్ పార్టనర్‌గా ఉండమన్నాను. తను ఒప్పుకుంది. నేను ఆ అమ్మాయికి దగ్గరయ్యేంతలోపే బసవరాజు అనే మిత్రుడు వచ్చి 'నాకో హెల్ప్ చేయి గురూ, ఆ అమ్మాయి నీతో క్యారమ్స్ ఆడుతుంది కదా, తనంటే నేను పడి చస్తాను. మా ఇద్దరినీ కలుపు ప్లీజ్' అన్నాడు. ఆ మాటతో షాక్ తిని, వెర్రిచూపులు చూసి, చివరికి సరే అన్నాను ఏడ్వలేక నవ్వుతూ. ఆ అమ్మాయిని వొప్పించి, దినేష్ వాళ్ల హోటల్లో కలిసేట్టుగా అరేంజ్ చేశా. వాళ్లిద్దరూ హోటల్లో ఒక మూలగా కూర్చుని మాట్లాడుకుంటున్నంతసేపూ 'వాడి ప్రపోజల్‌ని ఆ అమ్మాయి ఒప్పుకోకుండా చెయ్యి దేవుడా' అని జపం చేస్త్తూనే ఉన్నా. గంట తర్వాత వాడొచ్చి 'రేపు పార్టీరా' అనేసరికి తెల్లబోయా. మర్రోజు అన్యమనస్కంగానే పార్టీలో కూర్చున్నా. కొద్దిసేపు తర్వాత బసవరాజు నిజం కక్కేస్తూ 'గురూ, తను ఒప్పుకోలేదం'టూ భోరున ఏడ్చేశాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని 'థాంక్ గాడ్' అనుకున్నాను. కొసమెరుపు ఏంటంటే ఆ అమ్మాయి మా ఇద్దర్నీ కాదని మరొకరిని ప్రేమించడం!

తరచూ గోవా వెళ్లేవాళ్లం

ఫైనలియర్‌లో కాలేజీడేకి ఒక హిందీ సాంగ్ గ్రూప్ డాన్స్‌ లో పాల్గొని కోలాటం ఆడాను. అదే నేను తొలిసారిగా స్టేజ్ ఎక్కడం. గుంపులో గోవిందలా కాకుండా నా పర్మార్మెన్స్ నచ్చి నన్ను వరసలో ముందుంచేవారు. కొన్నాళ్లు కరాటే కూడా నేర్చుకున్నాను. ఉండేది రూమ్‌లో అయినా వంట పని ఉండేది కాదు. మూడు పూటలా మెస్‌లోనే తిండి. కాకపోతే బట్టలు మాత్రం ఎవరికి వాళ్లం ఉతుక్కునేవాళ్లం. ఆదివారం వచ్చిందంటే ఎక్కడో పిక్నిక్ వేసేసేవాళ్లం. గోవా మాకు వంద కిలోమీటర్ల దూరమే కాబట్టి తరచూ ఫ్రెండ్స్‌తో వెళ్లి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ గడిపేవాళ్లం. ఇలాంటి హ్యాపీడేస్ చేజారిపోతే మళ్లీ రావన్నట్టుగా ఇంటినుండి తెచ్చిన డబ్బులన్నీ వారం రోజుల్లోనే ఖర్చు చేసి, మళ్లీ డబ్బులకోసం ఉత్తరాలు రాస్తుండేవాణ్ణి. ఒకప్పుడు ధార్వాడ్‌లో చదువుకోడానికి భయపడి, మద్రాసు పారిపోయిన నేను తిరిగి అదే కాలేజీ నుండి డిగ్రీ తీసుకోవడం గర్వంగా ఉంటుంది. కాలేజీ వదిలేసి వచ్చేప్పుడు స్నేహితుల ఇళ్లకు వెళ్లి మా ఆత్మీయతను కలబోసుకుని, కన్నీళ్లతో వీడ్కోలు చెప్పుకున్నాం.

మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ...

Srikanth2డిగ్రీ చేతికి రాగానే కొన్నాళ్లపాటు అక్కవాళ్లింట్లో ఉండి అక్కడ్నించి సినిమా ప్రయత్నాలు చేస్తానని, సక్సెస్ కాకపోతే వచ్చి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయినవుతానని ఇంట్లో చెప్పేసి విజయవాడ చేరాను. అక్కడ్నుంచే 'అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్'కి అప్లయ్ చేశాగానీ సీటు రాలేదు. తర్వాత హైద్రాబాద్ వచ్చి 'మధు ఫిలిం ఇనిస్టూట్యూట్'లో వి.మధుసూదనరావుగార్ని కలిశాను. రెండు నెలల పాటు వచ్చి పరిశీలిస్తూ ఉండమన్నారాయన. కొన్నాళ్లు వెళ్లి కొంత నేర్చుకున్నాక, నా పర్మార్మెన్స్ చూసి వారే నీకిక శిక్షణ అక్కర్లేదు, సినిమాల్లో ప్రయత్నించు అని చెప్పేశారు. అమీర్‌పేట 'చర్మాస్' వెనకుండే రామకృష్ణ అపార్ట్‌మెంట్స్‌లో మరో ముగ్గురితో కలిసి ఉండేవాణ్ణి. కేవలం సినిమా ఛాన్సులకోసం తిరగాలికాబట్టి ఒక బైక్ కొనుక్కున్నాను. మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సర్టిఫికెట్ తీసుకోకుండానే ఉషాకిరణ్ వారి 'పీపుల్స్ ఎన్‌కౌంటర్'లో నటించే అవకాశం వచ్చింది. ఇక్కడ ఫెయిలయి ఉంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలాగూ ఉండేదనుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Exclusive interview with k viswanath
Interview with new director maruthi dasari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles