Istory of holi festival

History of Holi - Details about holi history, history of holi festival, holi, holi festival, Holi 2012, holi festival india, holi festival 2012, about holi, holi information, holi in india, holi colours, holi traditions, holi recipes, holi greetings, holi calendar, holi date 2012, holi rituals, holi celebrations, legend of lord krishna, hindu festival holi, holi fun, holi history, holi cards, holi songs, holi messages, holi gifts, holi essay, holi pictures

History of Holi - Details about holi history, history of holi festival, holi, holi festival, Holi 2012, holi festival india, holi festival 2012, about holi, holi information, holi in india, holi colours, holi traditions, holi recipes, holi greetings, holi calendar, holi date 2012, holi rituals, holi celebrations, legend of lord krishna, hindu festival holi, holi fun, holi history, holi cards, holi songs, holi messages, holi gifts, holi essay, holi pictures

istory of holi festival.GIF

Posted: 03/08/2012 01:10 PM IST
Istory of holi festival

Holi_Special_article

Holi_specialహోలీ రంగుల పండుగ. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో ఘనంగా చేసుకుంటారు. ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్‌ జాత్రా) లేదా బసంత-ఉత్సబ్‌ (వసంతోత్సవ పండుగ) అని అంటారు. ెలీ పండుగను బ్రాజ్‌ ప్రాంతంలో, శ్రీకృష్ణూడి చరితంతో ముడిపడిన మధుర, బృందావనం, నందగావ్‌, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. ెలీ పండుగ సందర్బంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక ేకంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటారు.

దుల్‌‌‌హేతి , ధులండి, ధులెండి అని కూడా పిలిచే హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రం గుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్‌, చోటీ హోలీ అని అం టారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటల లో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుం టాడు. మరో పౌరాణిక కథనం ప్రకారం దీన్ని కామ దహనం అని అంటారు.

హోలిక దహనం

రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరు లకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధిం చడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు.దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివ రిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చో వాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవు తుంది. ఆ శాలువా ఎగిరి వచ్చి ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవడాన్నే హోలీగా ఉత్తరాదిన నిర్వహిస్తారు.

Holiకామదేవుడి దహనం

పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి వీలుగా శివుని తపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. కామదేవుని భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని భౌతిక కామం కంటే నిజమైన ప్రేమ ఆధ్యాత్మి కతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.

ప్రత్యేక విందులు

హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి, మల్పాస్‌, మథిరి, పురాన్‌ పొలి, దాహి బదాస్‌ వంటి వివిధ రకాలైన ఫలహరాలను వడ్డిస్తారు. హోలీ రోజు రాత్రి గంజాయిని(కేనబిస్‌) తీసుకొని మైకంతో ఊగుతారు.

కృష్ణుడితో ముడిపడిన పండుగ

శ్రీకృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో తన నల్లని శరీర రంగు, రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురిం చి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. దీంతో యశోద రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది.అలా కృష్ణభక్తులు ఈ వేడుకను నిర్వహించుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mulayam singakhilesh yadav
Interview with dr c narayana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles