Interview with dr c narayana reddy

c.narayana reddy, cnare, indian poet, padmabhusham, telugu poets, telugu literature, mohan muralidhar venigalla, tori, treluguone radio on internet

Dr. Cingireddy Narayana Reddy (born 29 July 1931) is an Indian poet, writer. He is a winner of the Jnanpith Award in 1988 for his contribution to Telugu lite

Interview with Dr. C. Narayana Reddy.gif

Posted: 03/05/2012 03:21 PM IST
Interview with dr c narayana reddy

Dr._C._Narayana_Reddy

C._Narayana_Reddyకొన్ని సంఘటనలు, కొద్ది రోజులో కొద్ది మాసాలో మనసును కుదిపేసి ఆపైన అంతర్ధానమైపోతాయి. కానీ, కొన్ని సంఘటనలు జీవితమంతా వ్యాపిస్తాయి. జీవితాన్నే నడిపిస్తాయి. అయితే ఆ సంఘటనలు ఏ వయసులో జరిగాయన్నది కూడా అంత ముఖ్యం కాదు. ఆ సంఘటనల నుంచి ఏం నేర్చుకున్నామనేదే సర్వదా ముఖ్యమవుతుంది. ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జీవితంలోని ఓ అరుదైన అనుభవం

ఇది.కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేట మా స్వగ్రామం. ఆ ఆరోజుల్లో మాకు 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. పైగా మా తల్లిదండ్రులకు నేను ఒకే ఒక్క కొడుకును. అక్కాచె ళ్లెల్లు కూడా ఎవరు లేరు. మా తల్లిదండ్రుల దృష్టిలో బ్రతుకుదెరువు కోసం నేను, ఉద్యోగమో మరొకటో చేయవలసిన అవసరమే లేదు. ఉన్న భూమిలో వ్యవసాయం చే యించుకుంటూ దర్జాగా బతికేయొచ్చన్నది వారి భావన. కాకపోతే, కాస్త అక్షర జ్ఞానం ఉండటం అవసరమని ఊళ్లోనే చదువుకు పంపించారు.

మా ఊళ్లో అప్పుడు ప్రభుత్వ పాఠశాల ఏదీ లేదు. ఎవరో కాస్త చదువుకున్న వ్యక్తి మూడవ తరగతి దాకా తమ ఇంట్లోనే పాఠాలు (కాన్‌గిరి)చెప్పే వారు, ఆ మూడవ తరగతి అయిపోయాక, వ్యవసాయానికే అంకితమై ఉండిపోవాలన్నది మా అమ్మానాన్నల అభిలాష. కానీ, పై చదువులు చదవాలన్న కోరిక నాలో బాగా బలంగా ఉండేది. నాలుగవ తరగతి చదవాలంటే, మా జిల్లాలోని సిరిసిల్లకు వెళ్లాలి. అక్కడ నాలుగు నుంచి ఏడోతరగతి దాకా ఉండే ప్రభుత్వ పాఠశాల ఉంది. నాలుగో తరగతి కోసం సిరిసిల్ల వెళతాననే కోరికను నేను మా అమ్మ ముందు వ్యక్తం చేశాను. ఆమెకు అదో వింత కోరికలా అనిపించింది. 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా నేనింక ఏదో చదువుకోవడం అనవసరం అన్నది ఆమె భావన. అందుకే ఆమె నా కోరికను ఖండించింది. నేను ఎంత మారాం చేసినా ఫలితం లేకపోయింది. నేను నాలుగో తరగతి చదవడానికి అమ్మ ఎట్టి పరిస్థితిలోనూమ అంగీకరించదని నిర్ధారించుకున్న తరువాత, నాలో ఏదో ఆవేశం, ఆగ్రహం కమ్ముకున్నాయి.ఆ వయసులో విచక్షణలూ, విశ్లేషణలూ ఏముంటాయి? పరుగులాంటి నడకతో మా ఊరి చివర ఉన్న ఒక మోటబావి వద్దకు వెళ్లాను. అప్పటికి నాకు ఈత కూడా రాదు. ఇక వెనకా ముందు ఆలోచించకుండా బావిలో దూకేశాను. సరిగ్గా అదే సమయంలో పక్కపొలంలో ఉన్న ఒకతడు వచ్చి గబాలున బావిలోకి దూకేసి నన్ను బయటికి తీశాడు. విషయం తెలిసిన అమ్మ, నన్ను ఒళ్లోకి తీసుకుని గుండె బద్దలయ్యేలా ఏడ్చింది.

బలమైన కోరిక

చదువు పట్ల నాలో ఉన్న ఆ ఆకాంక్ష వెనుక ఉద్యోగపు ఆలోచనో, మరొకటో లేనేలేవు.ఆనాడు మాకున్న ఆస్తుల రీత్యా బ్రతుకు తెరువు కోసం వాటి అసవరమే లేదు. అయితే, బాల్యంలోనే చదువు గురించి నాలో పెద్ద ఆరాటమే ఉండేది. దానికంతా, అప్పుడో ఇప్పుడో వింటున్న జానపద గీతాల్లోని భాష, భావాల పట్ల నాలో ఏర్పడిన మక్కువే కారణమేమో! క్రమంగా నాలో పైచదువుల గురించిన ఆకాంక్ష బలపడింది. ఆ తరువాత్తరువాత అదే నాలో ఒక లోతైన లక్ష్యమై నన్ను ఇంత దూరం నడిపించింది.ఒక సంఘటన జరిగినప్పుడు దాని వెనుకున్న ఒక మనోభావాన్ని గుర్తించే స్థాయి అప్పటికి మనలో ఉండకపోవచ్చు. కానీ, ఆ తరువాతయినా గుర్తించి, మనసులోని ఆ తీవ్రతను గ్రహించగలిగితే, దాని కోసం మనం నడుస్తాం. అది కూడా మనల్ని నడిపిస్తుంది. నా దృష్టిలో మన అంతశ్చేతనలో ఒదిగి ఉన్న ఆకాంక్షలు కొన్ని సార్లు జీవితం కన్నా ఎంతో ఎత్తుగా ఉంటాయి. వాటి కోసం మనలో ఒక తీవ్రమైన తపన ఉంటుంది. ఆ తపనతో మనం వేసే అడుగులకు ఎవరైనా అడ్డుపడితే, సహజంగానే మనసు ఆగ్రహానికి లోనవుతుంది.

అభివ్యక్తి తెలియాలి

ఆనాటి సంఘటన గురించి కాస్త ఎదిగాక ఆలోచించుకుంటే ఆ నాడు నేను చేసింది ఆగ్రహాన్ని తెలియచేయడానికే గానీ, ఆత్మహత్యా ప్రయత్నం మాత్రం కాదనిపించింది. అయితే, ఆ చర్యకు పాల్పడటానికి ఆ వయసులో మరో మార్గమేదీ తెలియకపోవడమే కారణం కావచ్చు. నిజానికి బాల్యంలో ఇదీ అని తెలియకపోవచ్చు కానీ, మనల్ని జీవితమంతా నడిపించే ఏదో ఒక బలమైన ఆకాంక్ష మనసును ఆవరించి ఉంటుంది. ఆ ఆకాంక్షకు విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని వ్యతిరేకించే తత్వం కూడా మనలో ఉంటుంది.కాకపోతే అలా వ్యతిరేకించడానికి సంబంధించి ఒక స్పష్టమైన విధానమేదీ ఆ వయసులో ఉండదు. ఏమైనా, బావిలోంచి నన్ను బయటికి తీసినప్పుడు అమ్మ దుఃఖంతో విలవిల్లాడిపోవడాన్ని కొన్నాళ్ల తరువాత గుర్తు చేసుకుంటే , ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి అది సరియైన మార్గం కాదనిపించింది. బలంగా ఒక విషయం చెప్పడానికి అంత కఠినమైన మార్గాన్ని ఎంచుకోవలసిన అవసరం లేదనిపించింది. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న ఈ సత్యం నిజంగా నా జీవితమంతా వెన్నంటి నడుస్తూనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Istory of holi festival
Telugu actor sunil birthday wishes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles