Superstar prince mahesh babu interview

Superstar Prince Mahesh Babu Son of Living Legend Superstar Krishna.Mahesh Babu, Superstar Mahesh Babu, Maheshbabu, Telugu Superstar, Prince Mahesh Babu, Pokiri Records, Manamahesh, Mahesh New Movie Details, Mahesh New Movie Updates, Superstar Krishna, Goutham Krishna.

Superstar Prince Mahesh Babu Son of Living Legend Superstar Krishna.Mahesh Babu, Superstar Mahesh Babu, Maheshbabu, Telugu Superstar, Prince Mahesh Babu, Pokiri Records, Manamahesh, Mahesh New Movie Details, Mahesh New Movie Updates, Superstar Krishna, Goutham Krishna.

Superstar Prince Mahesh Babu.GIF

Posted: 02/22/2012 03:13 PM IST
Superstar prince mahesh babu interview

Superstar_Prince_Mahesh_Babu

Prince_Mashesh_babuఅతడు అమ్మాయిల కలల రాజకుమారుడు... ‘అబ్బ ఎంత అందం‘ అని మగాళ్ళు సైతం ఆ ‘పోకిరి’ని చూసి అసూయపడాల్సిందే. అతడు... తెలుగు సినిమాను రికార్డుల బాట పట్టించి, కాసుల వర్షం కురిసేలా చేసిన ‘బిజినెస్ మెన్’. ‘ఇంత భారీ కలెక్షన్లు సాధ్యమా’ అని సినీ వర్గాలు సైతం ‘ఆ ఖలేజా’కు విస్తుపోవాల్సిందే. ఈ ‘దూకుడూ... సాటెవ్వడూ...’ అని అందరూ ముక్తకంఠంతో మెచ్చుకుంటున్న ఆ నట ప్రభంజనమే మహేష్ బాబు. మరి అతని అంతరంగంమే ఈ వారం ముఖాముఖి.

ప్రొఫైల్ .....

1975, ఆగష్టు 9న పుట్టాడు మహేష్ బాబు.‘సూపర్ స్టార్ క్రిష్ణ’ గారి అబ్బాయి అని పుడుతూనే పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకున్నాడు మహష్ బాబు. ఇంతకంటే ఏం కావాలి. సూపర్ క్రిష్ణ ‘గాజుల క్రిష్ణయ్య’ షూటింగ్ లో ఉన్నప్పుడు ఈ వార్త అందింట. అప్పుడు ఆయన సంతోషానికి అవధుల్లేవట. దాంతో షూటింగ్ వాతావరణం అంతా పండగ వాతావరణంలా మారిపోయిందట. మహేష్ బాబు ఇంట్లో అందరి కన్నా చిన్నవాడు కావడంతో గారాబంగా పెరిగాడు. మహేష్ కంటే ముందు అతని అన్నయ్యలు రమేష్, అక్కలు పద్మావతి, మంజుల లు ఉన్నారు. మహేష్ అంటే ఆ ఇంట్లో అందరికీ చాల ఇష్టం.

బాల నటుడిగా.....

మద్రాసులో చదువుకుంటున్న రోజుల్లో అనుకోని మలుపు... నటన.. జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు... మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. మహేష్ సినీ రంగ ప్రవేశం కూడా అలానే జరింగిందని చెప్పుకొచ్చాడు. నా అయిదో ఏట అన్నయ్య రమేష్ తో విజయవాడ వెళ్లా. అప్పటికి అన్నయ్య ‘నీడ’ సినిమా చేస్తున్నాడు. దానికి దర్శకుడు దాసరిగారు. ఆయన నన్ను తొలిసారి అందులో నటింప చేశారు. నాకు చెప్పకుండానే షూటింగ్ చేసేశారు. నేనేం చేశానో నాకు గుర్తులేదు.

1983లో నాన్నగారు ‘పోరాటం’ సినిమా చేస్తున్నప్పుడు వాహినీ స్టూడియోకి వెళ్లాను. దానికి కోడి రామక్రిష్ణ దర్శకుడు. అందులో నాన్నగారికి తమ్ముడు పాత్రలో నటించడానికి బాలనటుడి కోసం వెదుకుతున్నారు. షూటింగ్ కి వచ్చిన నన్ను చూసి రామక్రిష్ణగారు‘ మీ అబ్బాయి బాగుంటాడు కదా’ అన్నారు. ఆ మాట వినగానే.. ఎందుకో తెలియదుగానీ నాకు భయం వేసింది. అక్కణ్ణుంచి పరిగెత్తాను. యూనిట్లో వాళ్ళు పట్టుకుంటే నేను చేయనంటే చేయనని మారాం చేశాను.  బిస్కట్లు, చాక్లెట్లు ఇచ్చి నటింపజేశారు. నాకు తెలిసిన నేను నటుణ్ణయిన సినిమా అదే.

నా చదువుకు ఏ మాత్రం ఆటంకం కలిగేది కాదు. వేసవి సెలవులు ఇచ్చిన ప్రతిసారీ ఊటీ వెళ్లిపోయేవాణ్ణి. ఒక సినిమాలో నటించేవాణ్ణి. సెట్ లో కెమెరాలు లైట్ల హంగామా, నాన్నగారు కొత్త కొత్త గెటప్ లతో కనిపించడం.... చాలా థ్రిల్లింగ్ గా ఉండేది. నేను చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యేసరికి నాకు తెలియకుండానే బాలనటుడిగా ఒక ఇమేజ్ వచ్చింది.

విద్యార్థి...

1990... సినీ పరిశ్రమలో నాన్నగారికి అది రజతోత్సవ సంవత్సరం. ఆ ఏడాది నాతో కలిసి ‘అన్నా తమ్ముడు’ సినిమా చేయాలనుకున్నారు. వేసవిలో మొదలవుతుందనుకున్న సినిమా జూన్ జులై వరకూ ప్రారంభం కాలేదు. దాంతో నేను ఆ ఏడాది స్కూలుకు వెళ్లలేక పోయాను. అప్పడు నాన్న ఆలోచనలో పడ్డారు. సినిమాల వల్ల నా చదువు ఆగిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ‘ఇక సినిమాలు వద్దు.... బుద్దిగా చదువుకో’ అన్నారు. నేను మరో మాట చెప్పలేదు. చదువుమీదే శ్రద్ధ పెట్టాను. స్కూల్లో నేను యావరేజ్ స్టూడెంట్ ని. సైన్సు, సోషల్, తెలుగు, ఇంగ్లీష్.. అన్నీ బాగానే చదివేవాణ్ని. ఒక్క లెక్కలంటేనే ఎందుకో కాస్త భయం. పదో తరగతిలో లెక్కల్లో తక్కువ మార్కులొచ్చాయి. నిజానికి నేను లయోలా కాలేజిలో చదువాలనుకున్నా. కానీ టెన్త్ లో తక్కువ మార్కులు రావడం వల్ల అందులో సీటు రాలేదు.

దాంతో నాలో పట్టుదల పెరిగింది. ఎలాగైనా లయోలా కాలేజీలో చదవాలనుకున్నాను. ఇంటర్ లో కష్టపడి చదివి డిస్టింక్షన్ లో పాసయ్యాను. లయోలా కాలేజీలో డిగ్రీలో సీటు వచ్చింది. బీకామ్ లో చేరాను. ఒక ప్రక్క చదువుకుంటుండగానే... సినిమాల పై ఆసక్తి మొదలైంది. ఈ విషయం నాన్నగారికి చెప్పాను. ఆయనలో ఆలోచించి సరేనన్నారు. రాఘవేంద్రరావుగారితో విషయం చెప్పారు. నన్ను హీరోగా పరిచయం చేసే చిత్రానికి సంబంధించిన కథా చర్చలు మొదలయ్యాయి. అలా 1999లో అశ్వినీదత్ గారి బ్యానర్ లో ‘రాజకుమారుడు’ సినిమాకు రంగం సిద్ధమైంది. అయితే నటించడం మానేసి అప్పటికి దాదాపు తొమ్మిదేళ్ళు అయిపోయింది. అందుకే శిక్షణ తీసుకుందామని వైజాగ్ లో సత్యానంద్ గారి దగ్గర చేశాను. మూణ్ణాలుగు నెలలు చాలా కష్టపడ్డాను. ఆ తరువాత మీ ముందుకు వచ్చాను.

ప్రేమ....

‘రాజకుమారుడు’ విజయవంతమైంది. ఆ తరువాత చేసిన ‘యువరాజు’ నిరాశపరిచింది. తరువాత సినిమా ‘వంశీ’ నా జీవితాన్ని... ‘వంశీకిNamratha ముందు... వంశీకి తరువాత’ అని చెప్పుకోదగ్గ సినిమా అది. ఈ సినిమాతోనే నమ్రత నా జీవితంలోకి అడుగు పెట్టింది.
ప్రేమ... ఇదో గొప్ప అనుభూతి. ప్రేమించడం... అందరూ చేస్తారు. కానీ... అందరూ ప్రేమించబడరు. అదో లక్. ఈ విషయంలో నేను చాలా లక్కీ ఫెలోని.  తెలుగులో నమ్రత తొలి చిత్రం. ‘అంజి’. కానీ మొదట విడుదలైన సినిమా మాత్రం ‘వంశీ’. షూటింగ్ లో భాగంగా నేనూ, నమ్రత నలభై రోజులు ఆస్ర్టేలియాలోనే ఉన్నాం. అప్పటికి నాకు చాలా బిడియం. సెట్ లో ఎవ్వరితోనూ మాట్లాడేవాణ్ని కాదు. ఒంటరిగా కూర్చునేవాణ్ణి.. తను నెమ్మదిగా మాట్లాడించడం మొదలు పెట్దింది. సినిమా పూర్తయ్యే సరికి ఇద్దరం స్నేహితలం అయిపోయాం. అభిరుచులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. నాలుగేళ్ళు ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ... అమ్మానాన్నలకు ఈ విషయం ఎలా చెప్పాలి... వాళ్ళను ఎలా ఒప్పించాలి.  అని ఆలోచించాం. ఈ విషయంలో మంజుల అక్క సాయం చేసింది. నమ్రతతో ప్రేమ విషయం అప్పటికే అక్కకు తెలుసు. తనే నాన్నగారికి చెప్పింది. అప్పుడు నాన్నగారు ‘ ఆ అమ్మాయి మన కుటుంబంలో కలిసిపోతుందా’ అని అడిగారట. దానికి అక్క... చాలా మంచి అమ్మాయి‘ అని చెప్పిందట.  నాన్నగారికేమీ అభ్యంతరం చెప్పలేదు. నమ్రత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో మేం ఒక్కటయ్యాం.

నటుడిగా అంతరంగం....

ఒక సినిమా ప్లాప్ అయ్యిందటే... నేను ఎవరితో మాట్లాడను. ఇంట్లోనే ఉండిపోతాను. అయితే అది తాత్కాలికమే. జీవితమన్నాక అంతా తీపే కాదు... చేదు అనుభవాలు ఉంటాయి కదా... అనుభవం మనిషికి పాఠాలు నేర్పిస్తుంది. అవగాహన లోపం కావచ్చు. సరైనా అంచనా లేక కావచ్చు....  నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను. చెయ్యకూడని సినిమాలు చేశాను. అవన్నీ నాకు ఎన్నో పాఠాలు నేర్పాయి.ఈ మధ్య నన్ను అందరూ రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో మొదటిది...

‘మీ అందు వెనుక రహస్యం ఏమిటి ? ముఖం మీద చిరగని చిరునవ్వే నిజమైన అందం అంటాను నేను. అయితే అదేదో తెచ్చి పెట్టుకున్నది కాదు. మనస్పూర్తిగా రావాలి. అప్పుడు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అందుకు కారణం... నేను ఇంత వరకు తప్పు చేయలేదు. ఇకముందూ చెయ్యను. అని నా మీద నాకున్న నమ్మకం. అది నాన్నగారి నుండి నేర్చుకున్నదే.

రెండో ప్రశ్న... ‘ఇప్పుడు తెలుగులో మీరే నెంబర్ వన్ కదా... ?
నాకు నెంబర్ల మీద నమ్మకం లేదు. ఆసక్తి అంతకన్నా లేదు. నేను చాలా చిన్నవాణ్ణి. ఇంకా ఎంతో నేర్చుకోవాలి. అయితే విజయం అంటే.. ఒక్క కెరీర్లోనే కాదు, కుటుంబంలోనూ విజేత కావాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. నేను అదే సూత్రాన్ని నమ్ముతాను. సినిమాల్లో నేను పోషించే పాత్రలకు నూటికి నూరు  శాతం న్యాయం చేయాలని ఎలా తపన పడతానో... కొడుగ్గా, భర్తగా, తండ్రిగా... అన్ని పాత్రలకూ న్యాయం చేయాలని ఆరాట పడతాను. నా సినిమాలు సూపర్ హిట్ కావడం మాత్రమే కాదు, నేను చాలా మంచి కొడుకునని మా అమ్మానాన్నా, భర్తంటే ఇలాగే ఉండాలని నా భార్యా, మై డాడీ ఈజ్ ద బెస్ట్ అని నా కొడుకూ... అనుకుంటే అదీ సంపూర్ణ విజయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A narasimha reddy chairman ap bar council
Actor tagubothu ramesh interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles