Actor Ali planning to say goodbye to YCP? వైసీపీ అధిష్టానంపై నటుడు అలీ మనస్తాపం..

Is actor ali upset over ysrcp party for ignoring him for rajya sabha seat

Actor Ali upset over RajyaSabha seat, Actor Ali ignored for Rajya Sabha seat, Actor Ali Rajya Sabha nomination, Actor Ali YSRCP High Command, Actor Ali senior comedian, Actor Ali political aspirations, Actor Ali APFDC Chaiman, Actor Ali Rajya Sabha seat, Actor Ali, Senior comedian, Ignored, nomination, Wakf board, APFDC chairman, political aspiration, Andhra Pradesh, Politics

Ever since YCP announced its four candidates for Rajya Sabha, many probables in the party left disappointed. One among them was comedian Ali who had expected a Rajya Sabha nomination from the ruling YCP. Actor Ali joined YCP hoping that Jagan would fulfil his political aspirations, but had been ignored for Rajya Sabha, which made the senior comedian upset over party High Command.

వైసీపీ అధిష్టానంపై నటుడు అలీ మనస్తాపం.. అదే కారణమా.?

Posted: 05/19/2022 05:55 PM IST
Is actor ali upset over ysrcp party for ignoring him for rajya sabha seat

సీనియర్‌ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అన్ని రంగాల నుంచి అభినందనలు వెల్లివిరిసినా.. సీనిరంగం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో అభినందనలు కూడా వెల్లివిరయలేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరోక అంశముంది. సినీరంగం నుంచి పెద్దలు రాకపోయినా.. దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి, హస్యనటుడు అలీ, పృధ్వీరాజ్, ఇలా కొందరు మాత్రం ఏమీ ఆశించకుండానే వైసీపీ అండగా నిలిచారు.

వైసీపీలో చేరిన అలీ.. పార్టీ కోసం ప్రచారం చేయడమే కాదు.. తన మిత్రడిని ఆయన పార్టీని కూడా కాదనుకుని మరీ జ‌గ‌న్ పాదయాత్ర స‌మయంలోక్రియాశీలంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి రాక‌ముందు ఆయ‌న త‌న వంతుగా పార్టీ కోసం కృషి చేశారు. జిల్లాలు, పట్టణాల్లో పర్యటించిన వైసీపీకి ఓటు వేయాలని ఓ సినీకళాకారుల బృందంతో ప్రచారం చేశారు. అయితే 2019 ఎన్నిక‌ల త‌రువాత పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న‌కు జ‌గ‌న్ కూడా అంతే ప్రాదాన్య‌త ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం కల్పించాలని భావించిన జ‌గ‌న్.. తాను ముఖ్య‌మంత్రి ఆయ‌న త‌రువాత అలీని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించారు.

తెలుగు చిత్రసీమ రంగం హైదరాబాదులో స్థిరపడిన నేపథ్యంలో.. అక్కడి నుంచి విశాఖకు తీసుకువచ్చేందుకు అలీ చేస్తున్న కృషిని కూడా జగన్ ప్రశంసించారు. దీంతో పాటు సినిమా టికెట్ల అంశంలోనూ ప్రముఖ అగ్రనటులతో పాటు అలీని కూర్చోబెట్టి అభిప్రాయాలు సేకరించారు. ఈ అంశం ముగిసిన తరువాత సీఎం జ‌గ‌న్.. హాస్యనటుడు అలీని ప్రత్యేకంగా పిలుపించుకుని.. ఆయ‌నకు రాజ్య‌స‌భ అవ‌కాశం ఇస్తాన‌ని హామి ఇచ్చారని వార్త‌లు వినిపించాయి. ఈ నేపథ్యంలో అలీ వాటిని బలపర్చేలా.. త్వరలో మీకు ఓ గుడ్ న్యూస్ ఉంటుందని కొండంత సంతోషాన్ని తన మన్సుసులో దాచుకుని మరీ చెప్పారు.

దీంతో అలీకి రాజ్య‌స‌భ ప‌క్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలీ కూడా ఈసారి జ‌గ‌న్ త‌న‌కు అవ‌కాశ‌మిస్తార‌ని భావించిన‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వర్గాల స‌మాచారం. అయితే ఎవ‌రూ ఉహించ‌ని విధంగా పార్టీ త‌రుపు నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారిలో అలీ పేరు లేక‌పోవ‌డం ఆయ‌న కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పగా అప్పటికే పూర్తైన రాజకీయ సమీకరణల నేపథ్యంలో అధి సాధ్యంకాదని చెప్పిన జగన్.. అవకాశం వచ్చినప్పుడు ఆయనను రాజ్యసభకు పంపుతానని హామి ఇచ్చారన్న వార్తలు వినిపించాయి. అయితే తీరా ఆ అవకాశం వచ్చిన తరువాత అలిని పార్టీ అధినేత విస్మరించారా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్నాళ్లుగా రాజ్యసభ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన తరువాత.. సామాజిక రాజకీయ కారణాలను తమ భుజాలపైకి ఎత్తుకున్న వైసీపీ అధిష్టానం తనను విస్మరించడంతో ఆయన పార్టీ అధిష్టానంపై కినుకు వహించారని సమాచారం. పార్టీ గెలుపులో కీలకంగా వ్యహరించిన తనను పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం.. తనకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇవ్వడంతో అలీ మనస్తాపం చేందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహిత నేతలతో మాట్లాడిన ఆయన.. ఇకపై నుంచి పార్టీ వ్య‌వ‌హారాల‌కు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్న‌ారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles