భారత ప్రధాని మోదీకి రైతుల సెగ తగిలింది. కనీవినీ ఎరుగని, శత్రు దుర్భేద్యమైన ఆయన భద్రతజజ వేలాది మంది సాయుధబలగాల రక్షణ కలిగివుంటారన్న విషయం తెలిసిందే. అయితే వీళ్లందరూ ఉన్నా.. ఇవాళ ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది. ఏకంగా ప్రధానమంత్రి మోడీకి రైతుల సెగ తగిలింది. ఏడాది పాటు ఢిల్లీలోని శివార్లలో ఏడాది కాలంగా వారు నిరసన దీక్షలు చేపట్టినా.. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ర్యాలీలో తమ సత్తాను కేంద్రప్రభుత్వానికి చాటారు. అయితే అందులోనూ అల్లరిమూకలు చేరి వారిధర్నాను అబాసుపాలు చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఎర్రకోటపై మతానికి చెందిన జెండాను ఆవిష్కరించిన విషయాన్ని ఇప్పటికీ రైతులు మర్చిపోలేదు.
అయితే ఓ వైపు కేంద్రప్రభుత్వం రైతులతో సానుకూలంగా వ్యవహరించిన బేషరుతుగా నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని ప్రకలించింది. అయితే తమ పంటలకు మద్దుతు ధరపై నూతన చట్టం తీసుకురావాలన్న డిమాండ్ తో పాటు రైతులకు చెందిన పలు డిమాండ్లను కూడా సానుకూలధోరణితో అమలుచేస్తామని ప్రకటించింది కేంద్రం. అయినా పంజాబ్ లో రైతులు ఫ్లైఓవర్ పైకి ఎక్కి ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై ఎందుకు ధర్నాకు దిగారన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. గంటల వ్యవధి ముందు ప్రధాని రోడ్డు మార్గాన వెళ్తున్నారని సమాచారం అందడంతో.. అందుకు అనుగూణంగా మార్పులు చేసిన ప్రభుత్వం రైతులను మాత్రం కట్టడి చేయడంలో విఫలం అయ్యిందా.?
గంటల వ్యవధితో ప్రధాని ఆ మార్గాన వస్తున్నారన్న సమాచారం రైతులకు ఎలా తెలిసింది.? అందునా ఎటూ కదల్లేని విధంగా ఫ్లైఓవర్ పైనే రైతులు ధర్నాకు దిగారంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఇక ఈ విషయంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపి వర్గాలు ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీంతో పంజాబ్ లో ఇది పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గంలో అందునా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం.. ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపి నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తక్షణం సీఎం చన్నీ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నారు.
అయితే చివరి నిమిషంలో చేసిన మార్పులతో ప్రధానికి భద్రత కల్పించేందుకు తమ రాష్ట్ర పోలీసు శాఖ సమాయత్తమై అన్ని చర్యలు చేపట్టిందని అయితే ఇలా ఎలా రైతులు ఫైఓవర్ పైకి చేరుకున్నారో తెలియడం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుస్సేనీవాలాలోని అమరవీరుల స్థూపం వద్దకు వాస్తవానికి విమానంలో వెళ్లాల్సివుంది. అయితే వాతావరణం అనుకూలించక చివరి నిమిషంలో చేసిన మార్పుల కారణంగానే ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఇక ఈ సమాచారంతో పోలీసలు బందోబస్తు కల్పిస్తుండగా.. ఆకస్మాత్తుగా వచ్చిన రైతులు ఫ్లైఓవర్ పై ధర్నాకు దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ రాష్ట్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో తాను నిన్నంతా ఆయన ఏర్పాట్ల పనులు పర్యవేక్షణలోనే బిబీగా వున్నానని, దీంతో రాత్రి ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించానని చెప్పారు. ఇక ప్రధాన మంత్రి ర్యాలీ నిర్వహించాల్సిన ప్రాంతమైన ఫిరోజ్ పూర్ లోనూ ఏకంగా 70వేల కుర్చీలను వేయించామని చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం అక్కడ కనీసం 700 మంది మినహా ఎవ్వరూ లేరని అందులోనూ కొందరు కేవలం సివిల్ డ్రెస్సుల్లో వున్న భద్రతా సిబ్బంది వున్నారని ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ చెప్పుకోచ్చారు.
అయితే ఇది బీజేపి ముందస్తు స్కేచ్చా.. అన్న అనుమానాలు కూడా కలగక తప్పడం లేదు. పంజాబ్ లోని రైతులను ఓ వైపు తమ పార్టీ అనధికార ప్రచార కార్యకర్తగా వున్న ఓ ప్రముఖ సినీనటితో.. పంజాబ్ వాసులపై అనుచిత వ్యాఖ్యలు చేయించి.. వారిని అవమానించి.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వారిలో ఆశలు కల్పించడానికి ప్రయత్నించినా.. వారు బీజేపిని విశ్వసించే పరిస్థితిలో లేరని అర్థం చేసుకున్న పార్టీ.. ఈ సరికొత్త ఎత్తుగడను ప్లాన్ చేసిందా.? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోడీ.. తనను హత్య చేయించడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ తో చేతులు కలిపి కుట్ర చేశారని, సుపారీ కూడా ఇచ్చారని చేసిన కామెంట్ల నేపథ్యంలో రైతుల ధర్నా బీజేపి ఎత్తుగడలో భాగమన్న బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రధాని విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలించక.. అప్పటికప్పుడు చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని రోడ్డు మార్గం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పుకోచ్చిన హోం శాఖ.. రైతుల ఫైఓవర్ దర్నా ఘటనపై భద్రతా వైఫల్యాం అంటూ కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా వ్యాఖ్యానించడం.. తక్షణమే నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించడం మంచిదే. అయితే రైతులు చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ ఘటనపై చర్యలు తీసుకునే ముందు.. గత ఏడాది జనవరి 26న రైతులు తాము ఎర్రకోట వద్ద ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి మరీ ఎర్రకోటకు చేరుకుని విధ్వంసం సృష్టించిన ఘటనకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్‌లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more