T-TDP Chief L Ramana All Set To Join TRS! తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్.? కారెక్కనున్న ఎల్ రమణ

Telangana tdp chief l ramana all set to join trs

L Ramana to join TRS, L Ramana offered MLC post, L Ramana to quit TDP, L Ramana, Telangana TDP President, TRS, Etala Rajender, Jagityala, Telangana CM KCR, MLC post, Chandrababu Naidu, TDP President, Nara Lokesh, Telangana, Politics

The Telgnana TDP is likely witness a heavy exodus in the next few days, There is buzz that Telangana TDP unit president L. Ramana is getting ready to join the TRS in the coming days. There is information many more TDP leaders are likely to switch loyalties to the TRS.

కారు ప్రయాణానికి సిద్దమవుతున్న ఎల్ రమణ.?

Posted: 06/07/2021 05:17 PM IST
Telangana tdp chief l ramana all set to join trs

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుందా.? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలకమైన నాయకుడు కూడా టీఆర్ఎస్ గూటికి చేరువకానున్నాడా.? అంటే ఔనన్న సమాధానాలే వస్తున్నాయి. టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 98వ జయంతి పూర్తై పది రోజులు కూడా గడవకముందే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడే కరువు కానున్నాడా..? తెలంగాణ టీడీపీ అధ్యక్షడు ఎల్.రమణ త్వరంలోనే గులాబీ కండువా కప్పుకోనున్నారా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి,

ఇటు తెలంగాణలో వైఎస్సార్ పార్టీ షర్మిలతో పట్టు సాధించడానికి రెడీ అవుతున్న క్రమంలో టీడీపీకి రాష్ట్రస్థాయి నాయకులే కరువుకానున్నారు. ఇది పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తేరుకోలేని దెబ్బగా మారుతుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రం విడిపోయాక..కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాక. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకుగడ్డుకాలం ఏర్పడింది.పలువురు నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలనుంది.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లోనే చేరునున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగిన నాయకులు లేనట్లుగానే ఉంది. గత కొంతకాలంగా ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ రమణ మాత్రం ఇప్పటి వరకూ టీడీపీలోనే కొనసాగారు. కానీ మాజీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత టీఆర్ఎస్ నేత లాబీయింగ్ తో రమణ కూడా గులాబీ గూటికే చేరున్నట్లుగా తెలుస్తోంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మంచి సంబంధాలున్నాయి. ఈక్రమంలో రమణ పార్టీలో చేరటానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ మంత్రి ఈటల పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవటం.. ఆ స్థానాన్నిబీసీ నేత రమణతో భర్తీ చేయాలనుకంటున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో రమణ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో రమణ చేరికతో లబ్ది పొందాలని, ఈటెల బిసి కార్డుకు ఎల్ రమణతో చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో రమణ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఉమ్మడి ఏపీ విడిపోయింది.

రాష్ట్ర విభజన అనంతరం కూడా రమణ టీడీపీలోనే కొనసాగారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని వీడలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ హావా ఉన్నా.. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయటాని రమణ ఎంతో కృషి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారేందుకు ఇష్టపడలేదు. కానీ రాను రాను టీడీపీ తెలంగాణలో కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో రమణ తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైంది. తదపరు గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాటు జరిగినట్లుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  L Ramana  Telangana  TRS  TTDP  Etala Rajender  Jagityala  Telangana  Politics  

Other Articles