"vijay sai reddy doesnt know simple addition" విజయ్ సాయిరెడ్డికి లేక్కలు రావా.?

Is vijaya sai reddy really a charted accountant questions janasena activists

pawan kalyan, janasena, Pawan Kalyan Vijaya sai reddy, JD LaxmiNarayana Vijaya sai reddy, Pawan Kalyan Janasena, YSRCP Janasena, JanaSena Government formation Vijaya sai reddy, janasena government Vijaya sai reddy, Government, Vijaya sai reddy, JD LaxmiNarayana, YSRCP, andhra pradesh, politics

Janasena activists fires on YSRCP Leader Vijaya sai reddy, who gives counter to former CBI JD VV Laxminarayana, asks how a person who doesnt know simple addition becomes a charted accountant.

‘‘కూడికలు రాకుండా చార్టెడ్ అకౌంటింగ్ ఎలా విజయ్ సాయి.?’’

Posted: 04/19/2019 01:39 PM IST
Is vijaya sai reddy really a charted accountant questions janasena activists

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన క్రమంలో అన్ని పార్టీలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు ఓటములు ఓటర్ల తీర్పుపై అధారపడి వుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత పర్యాయం కొద్దిలో చేజారిన అధికారం ఈ సారి తప్పక అందుతోందని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేయడంతో పాటు తమదే అధికారమన్న అధికార, ప్రత్యర్థి పార్టీలపై వ్యంగంగా విరుచుకుపడుతుంది. దీంతో ఆ పార్టీపై జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎవరి ధీమాను వారు వ్యక్తం చేసుకుంటే.. మీ జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అయినా ఈ విషయంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి రాజకీయా పార్టీలకు సముచిత గౌరవం ఇవ్వాలని తెలియకుండా కేవలం అధికారమే పరమావధిగా వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతల అధికార దహాన్ని ప్రతిబింభిస్తుందని జనసేన కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. తమ పార్టీకి మే 23న వెల్లడికానున్న ఫలితాల్లో 88 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చెప్పడంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

ఇవాళ ట్విట్టర్ లో ఈ మేరకు స్పందించిన ఆయన ఆయన స్పందిస్తూ.. జనసేన పార్టీ  కేవలం 65 స్థానాల్లోనే పోటీ చేసిందనీ, అలాంటప్పుడు  పవన్ కల్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 చోట్ల ఎలా విజయం సాధిస్తుందని జోస్యం చెబుతున్నారని వ్యంగంగా ప్రశ్నించారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని ట్వీట్ చేశారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా కామెంట్లు చేశారు. పాకిస్థాన్ వాళ్లు పిలిచినా చంద్రబాబు వెళ్లి ప్రచారం చేసి వస్తాడని ఎద్దేవా చేశారు.

దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి అనుంగు నాయకుడి కోసం అందరినీ టార్గెట్ చేసి.. ఒకరితో మరోకరికి లింకులు పెట్టుకుంటూ మసిపూసి మారేడు కాయను చేయలాని ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. చేతికి వున్న ఐదు వేళ్లను విజయసాయి అంజనం వేసి యాభై వేళ్లుగా కూడా చూపగల గణిత ఘనాపాటి అని సైటర్లు వేశారు. కూడికలు కూడా రాని విజయసాయి చార్టడ్ అకౌంటెంట్ ఎలా అయ్యారని జనసైనికులు ఆయనపై మండిపడుతున్నారు. జనసేన సొంతంగా పోటీచేసింది 120 స్థానాలని, మిత్రపక్షాలతో కలసి 175 స్థానాల్లో పోటీ చేసిందని వారు పేర్కోన్నారు. తాము అధికారంలోకి వస్తామని  జేడీ చెప్పడంలో తప్పేముందని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

ఎవరు గెలుస్తారన్న. ఎవరికి అధికారం దక్కుతుందన్న విషయాలు వచ్చే నెల 23వ తేదీన తేలిపోనుంది. అయితే ఈ లోపు ఎవరెంత ధీమా వ్యక్తం చేసినా అది కేవలం తమ క్యాడర్ ను కాపాడుకుని, ఉనికి చాటుకోవడానికే అన్న విషయం ఓటర్లతో పాటు రాజకీయ పార్టీల నేతలకు కూడా తెలుసు. అంతా తెలిసి కూడా ప్రత్యర్థి పార్టీలోపై వ్యంగస్త్రాలు సంధించడం.. ప్రత్యర్థి పార్టీలను, కార్యకర్తలను, ఆయా పార్టీలకు ఓట్లు వేసిన ఓటర్లను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అవసరమా.? అన్నది వారికే తెలియాలి. పార్టీల కార్యకర్తల మధ్య యుద్దవాతావరణాన్ని సృష్టించడం ఎందుకో నాయకులకైనా అర్థమయ్యేనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Government  Vijaya sai reddy  JD LaxmiNarayana  YSRCP  andhra pradesh  politics  

Other Articles