BJP creating nuisance, crisis to fizzle out soon: CM స్వతంత్ర ఎమ్మెల్యే బాటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Karnataka coalition dodges crisis threat of collapse still looms

supreme court, Bheema Naik, Vajubhai Vala, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, pro tem speaker, mukhul rothagni, congress mlas, jds mlas, BS Yeddyurappa, Siddaramaiah, Congress, BJP, JDS, Kumara Swamy, PM Modi, Amit shah, karnataka, politics

The coalition government in Karnataka appeared to have dodged another bullet as many of its legislators, presumed to be missing or likely to defect, returned to dispel speculation that they were planning to switch sides to the BJP.

స్వతంత్ర ఎమ్మెల్యే బాటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Posted: 01/17/2019 01:40 PM IST
Karnataka coalition dodges crisis threat of collapse still looms

కర్ణాటకలో కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం దిశగా సాగుతుందా.?బీజేపి అన్నంత పని చేస్తుందా.? ఇటీవల బీజేపి నేత ఉమేష్ కత్తి వారం రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దెదింపడం గ్యారంటీ అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపి తన వ్యూహరచనను తూచా తప్పకుండా అమలుపరుస్తోందా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత రెండు రోజులుగా కన్నడ నాట రాజకీయాలలో తిరుగుతున్న అనేక మలుపులు తాజాగా అనేక సందేహాలకు తావిస్తోంది.

ఈ క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మొదలైన వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్ లోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఇవాళ రాజీనామా చేయనున్నట్టు వార్తలు గుప్పుమనడంతో మరోసారి కలకలం రేగింది. స్వతంత్రులతో ప్రారంభమయ్యే అకర్ష్ ఎంత మందిని తమవైపుకు తిప్పుకుంటుంది..? ఈ తరుణంలో కుమారస్వామి ప్రభుత్వం మనగలుగుతుందా.? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

రాష్ట్రంలో బీజేపి అనుకున్నట్లుగానే తమ పాచికలను పారవేస్తూ పగ్గాలను అందుకుంటుందా.? ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి కలుపుకుంటుందా.? అన్న అనుమానాలు సర్వత్రా రేకెతుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రభావితం చూపుతున్నాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ తో తాను వేగలేకపోతున్నానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి ‘నియంత్రణ’లోనే ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను సంతలో  పశువుల్లా కొంటున్నారంటూ కాంగ్రెస్-జేడీఎస్ చేసిన ఆరోపణలపై బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప స్పందించారు. అధికార పార్టీనే ఆ పనిచేస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి తమవైపు తిప్పుకుంటోందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bheema Naik  kumaraswamy  Yeddyurappa  Siddaramaiah  BJP  Congress  JD(S)  karnataka  politics  

Other Articles