Yeddyurappa resigns3rd time as CM, the third day రాజకీయ చక్రబంధంలో యడ్యూరప్ప బలయ్యాడా.?

Yeddyurappa resigns3rd time as cm the third day

karnataka assembly floor test, bs yeddyurappa, resigns, resign, floor test, no majarity, emotional speech, vajubhai wala, yeddyurappa audio tape, yeddyurappa resign, new cm resigns, yeddyurappa cm, audio tape, poaching mla, sri ramulu, congress, JDS, priyanka chaturvedi, karnataka assembly, congress, JDS, kumaraswamy, revanna, siddaramaiah, karnataka, politics

After an emotional speech in the Assembly, BS Yeddyurappa went to Raj Bhavan and meets governor vajubhai wala and submits his resignation as the chief minister of Karnataka.

యడ్యూరప్పకు మూడోసారి సీఎం పదవి మూడ్రోజుల ముచ్చటే

Posted: 05/19/2018 05:42 PM IST
Yeddyurappa resigns3rd time as cm the third day

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించి.. అధికారాన్ని అందుకున్న అది మున్నాళ్ల ముచ్చేటే అయ్యింది. దక్షిణాది రాష్ట్రంలో కాషాయపార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దోహదపడిన యడ్యూరప్ప ఇవాళ అసెంబ్లీలో తనదైనశైలిలో ప్రసంగం చేస్తూ.. తన జీవితం మొత్తం అగ్నిపరీక్షలా సాగిందన్న మాటలు వెనుక అవేదన ఎలా వున్నా.. సీఎం పదవిని చేపట్టాలన్న ఆయన అశలు మాత్రం నిజంగా అగ్నిపరీక్ష మాదిరిగానే వుందన్నది కాదనలేని సత్యం.

మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీతో సాగిన ఎన్నికలలో నువ్వా-నేనా అన్నట్లు సాగి.. అదే తరహా తీర్పును ఈ నెల 15న వెల్లడి కాగానే.. తమ సంఖ్యాబలం కూడా చూసుకున్న తరువాత యడ్యూరప్ప ఏకంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ట్వీట్ చేశారు. అప్పుడే ఆయన సమయాన్ని, రోజును కూడా ప్రకటించారు. ఇది కాస్తా వైరల్ కాగానే.. దానిని తొలగించారు. అనుకున్నట్లుగానే గవర్నర్ యడ్యూరప్పను ఈ నెల 17 ఉదయం తొమ్మిది గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు.

అయితే ఎక్కడైనా తమపార్టీ నేతలు సీఎంగా ప్రమాణం చేస్తుంటూ వచ్చి హాజరై ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపే ప్రధాని నరేంద్రమోడీ కానీ, కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కానీ యడ్డీ ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరుకాలేదు. ఇక పైపెచ్చు ప్రమాణస్వీకారోత్సవం కూడా ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా.. అత్యంత సాధారణ తంతుమాదిరిగానే రాజ్ భవన్ లో జరిగింది. దీంతోనే యడ్యూరప్పకు బలం లేని ఆయన రాజీనామా తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇక గవర్నర్ ఇచ్చిన సమయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం కుదించిన నేపథ్యంలో ఇవాళ బలాన్ని నిరూపణకు సిద్దమైన యడ్యూరప్పను బీజేపి పార్టీ బలిపశువును చేసిందా.? అన్న అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో 17 ఉదయం 9గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప.. సరిగ్గా మూడో రోజు అంటే 19న మధ్యాహ్నం నాలుగు గంటల 7 నిమిషాలకు తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన జీవితం మొత్తం అగ్నిపరీక్షలా సాగిందన్న ఆయన మాటలను పలువురు నెట్ జనుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. జీవితం కాదు కేవలం సీఎం పీఠం అందుకోవాలనుకున్న ప్రతీసారి నీకు అగ్ని పరీక్షే ఎదురవుతుందని నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు. మూడు రోజులకే సీఎం పదవి ముచ్చట తీరిపోయిందని.. మూడోసారి మూడో రోజు.. మూడు పనిచేయదా.? మూడు కలసిరాదా.? ఇలా నెట్ జనులు స్పందించారు. ఇందులో మాత్రం ఒక నిజం వుంది.

అయన తొలిసారి 2007లో కుమారస్వామితో కలసి రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడు వారం రోజుల వ్యవధిలోనే ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. నవంబర్ 12, 2007న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆయన సరిగ్గా అదే నెల 19న రాజీనామా సమర్పించారు. ఈ తరుణంలో నవంబర్ 19 నుంచి మే 29 2008 వరకు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తరువాతి ఎన్నికలలో యడ్యూరప్ప ప్రజల్లోకి విరివిగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని బీజేపి ప్రభుత్వాన్ని దక్షిణాధిలో తొలిసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడ్డారు.

మే 10 2008న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆ ముచ్చట మూడేళ్లు మాత్రమే కొనసాగింది. ఆయనపై భూవివాదాలు, అక్రమాస్థులు, అవినీతి కేసులు ఇలా అనేకం చుట్టుముట్టడంతో ఆయన గత్యంతరం లేని పరిస్థితులలో తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. దీంతో అగస్టు 2, 2011న ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక తాజాగా మూడోసారి ముచ్చట మూడో రోజునే నీరుగారింది. కాగా, సంఖ్యాబలం లేకపోయినా బీజేపి శ్రేణులు, అధిష్టాన దూతలు అంతాకలసి ఆయనను బలిపశువును చేశారా.? అన్ని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles